బెంగళూరు: సంచలనం సృష్టించిన లైంగిక దాడి వైరల్ వీడియోలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులోని ప్రధాన నిందితులు ఎట్టకేలకు గుర్తించగలిగారు. ఈ వీడియోకు సంబంధించి ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి బట్టలు చించేసి అఘాయిత్యానికి పాల్పడిన వీడియో ఒకటి బుధ, గురు వారాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై కేఎస్‌యూ ఢిల్లీ విభాగం హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాసింది. ఆ వెంటనే కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు, ఐపీఎస్ అధికారి రాబిన్ హిబు, మేఘాలయా ఎమ్మెల్యే అంపరీన్ రంగంలోకి దిగారు. దీంతో 24 గంటలు గడవకముందే నిందితులను అరెస్ట్ చేయడం విశేషం.
చదండి: బట్టలు చించేసి, ఏడుస్తున్నా వినకుండా..
ఫేస్బుక్ ప్రొఫైల్‌తో?
మొదట అది 25 ఏళ్ల నాగాలాండ్ మహిళ వీడియో అని, ఆ అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందనే ప్రచారం జరిగింది. ట్విట్టర్లో బాధితురాలిగా న్యాయం జరగాలని క్యాంపెయిన్ జరిగింది. అయితే అది ఆమె వీడియో కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులు. వీడియో, అందులోని విజువల్స్ ఆధారంగా ఫొటోలు రిలీజ్ చేసిన అస్సాం పోలీసులు.. నిందితుల ఆచూకీ చెప్పిన వాళ్లకు నజరానా ప్రకటిస్తూ ఫేస్బుక్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపై ఆ వీడియోలోని నిందితులను రామమూర్తి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో ఒకరి ఫేస్బుక్ ఫ్రొఫైల్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకోగలిగామని రామమూర్తి నగర్ స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ అమానుష ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నారని, లైంగిక దాడి కేసులో వాళ్లను అరెస్ట్ చేశామని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. బాధితురాలి వయసు 22 సంవత్సరాలని, ఎన్ఆర్ఐ కాలనీలో వారం క్రితం ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారని తెలుస్తోంది. అయితే నిందితుల గాయాల గురించి అప్డేట్ అందింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో కాల్పులు జరపడంతోనే గాయాలయ్యాయని తెలుస్తోంది.
అక్రమంగా వచ్చారు
కాగా, ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బాధితురాలితో సహా నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వాళ్లని పోలీసులు వెల్లడించారు. వాళ్లంతా అక్రమంగా చొరబడి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే వాళ్లంతా వ్యభిచారం చేస్తున్నారని, వ్యక్తిగత కారణాలతోనే బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ప్రతిభా రామన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక నిందితులతో పాటు బాధితురాల్ని ఐడెంటిటీని బంగ్లాదేశ్ ధృవీకరించింది. బాధితురాలు మోఘ్బజార్(ఢాకా) నివాసి అని, సౌదీకి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్న ఆ అమ్మాయి మూడు నెలల నుంచి జాడ లేకుండా పోయిందని తేజ్గావ్ డీసీపీ సహీదుల్లా వెల్లడించారు. ఇక నిందితుల్లో ఒకడు టిక్‌టాక్‌లో ‘హ్రిదోయ్ బాబు’గా బంగ్లాదేశ్‌లో పాపులర్ అని తెలుస్తోంది.
#Nirbhaya-like incident in #Bengaluru. 22-year-old allegedly gang raped by 4 at NRI Colony 6 days ago. Another lady present with accused. All including victim are illegal #immigrants from #Bangladesh reportedly involved in prostitution. Personal rivalry cited. Accused arrested. pic.twitter.com/2zpfIjMxfm
— Pratiba Raman (@PratibaRaman) May 27, 2021
Comments
Please login to add a commentAdd a comment