
తరగతి గదిలో నీలి చిత్రాలు: టీచర్ అరెస్ట్
ఓ టీచర్ పాఠాలు పక్కకు పెట్టి పిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తున్న ఘటన మధురలోని తక్షశిల పబ్లిక్ స్కూల్ లో చోటు చేసుకుంది.
మధుర: స్కూల్ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచరే ప్రక్కదోవ పడితే ఇక పిల్లల భవిష్యత్తు ఏమిటి?, పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన టీచర్ తాను తప్పుదోవ పట్టడమే కాకుండా పిల్లలను కూడా వక్రమార్గంలో పయనించేటట్లు చేస్తే ఇక చేసేదేముంది. ఓ టీచర్ పాఠాలు పక్కకు పెట్టి పిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తున్న ఘటన మధురలోని తక్షశిల పబ్లిక్ స్కూల్ లో చోటు చేసుకుంది.
ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పని మీద బయటకు వెళ్లిన సమయంలో అదే అదనుగా భావించిన టీచర్ జితేంద్ర గౌతమ్ తన సెల్ ఫోన్ లో ఉన్న బ్లూ ఫ్లిల్మ్ లను పిల్లలకు చూపెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ విషయాన్ని పిల్లలు తమ తల్లి దండ్రుల వద్దకు తీసుకువెళ్లగా ఆ టీచర్ ను పట్టుకుని చితకబాదారు. అనంతరం ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఊర్మిలా శర్మ ఫిర్యాదు మేరకు కీచక టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.