మహిళపై యాసిడ్‌తో దాడి | Acid attack on woman over property in Mathura | Sakshi
Sakshi News home page

మహిళపై యాసిడ్‌తో దాడి

Published Wed, Aug 21 2013 2:55 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

ఆస్థి వివాదానికి సంబంధించి ఓ మహిళపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మధుర: ఆస్థి వివాదానికి సంబంధించి ఓ మహిళపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  ఓ ఇంటి కొనుగోలుకు సంబంధించి వివాదం కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నాగిన అనే మహిళ, ఆమె సోదరుడు గుద్దర్ కలసి వారి సమీప బంధువు అబ్రార్ అనే వ్యక్తి వద్ద గోవింద్ నగర్ సమీపంలోని దులియా గంజ్ లో ఓ ఇంటిని కొన్నారు. ఆ ఇంటికి సంబంధించి బకాయి ఉండటంతో అబ్రార్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మంగళవారం నాగిన మరియు ఆమె సోదరి సాగిన కలిసి అబ్రార్ ఇంటికి వెళ్లారు. తాము ఇవ్వాల్సిన మొత్తాన్ని త్వరలోనే ఇస్తామని చెప్పడంతో వివాదం మొదలైంది. 

 

అబ్రార్ అతని కుటుంబ సభ్యులు కలసి డబ్బులు వెంటనే చెల్లించాలని వారితో వాగ్వివాదానికి దిగారు. అక్కడి ఆగకుండా తమ వద్ద నున్న యాసిడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగిన ముఖంపై యాసిడ్ పడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి  చేసిన అబ్రార్‌ను అరెస్టు చేశామని, మిగతా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement