కలిదిండిలో మహిళ ఆత్మహత్య
కలిదిండి, న్యూస్‌లైన్ : కలిదిండి శివారు ఇందిరా కాల నీలో ఓ మహిళ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కాలనీలో నివసిస్తున్న మహిళ కాసా బాజీకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. భర్త చనిపోవడంతో బాజీ కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్న కుమార్తె నగీనా(22) ఒక వ్యక్తితో కొన్నేళ్లుగా సహ జీవనం చేస్తోంది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.
నగీనా బుధవారం రాత్రి తన తల్లి ఇంటి వద్ద నిద్రిం చింది. అర్ధరాత్రి సమయంలో లైటు వెలుగుతుండటం, టీవీ ఆన్ చేసి ఉండటంతో బాజీకి మెలకువ వచ్చి చూడగా పక్క గదిలో చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ బాలశౌరి సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. తహశీల్దార్ కె. ఆంజనేయులు, వీఆర్వో శ్రీనివాసరావు సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
వివాహిత అనుమానాస్పద మృతి
వెల్లంకి(కంచికచర్ల రూరల్) : ఓ వివాహిత ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని మృతి చెందిన సంఘటన వీరులపాడు మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వీరులపాడు మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన యర్రంరెడ్డి సాంబశివరావుతో గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకకు చెందిన శిరీషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె ప్రియ ఉంది.
సాంబశివరావు లారీ డ్రైవర్. వారి ఇంట్లోని ఓ గదిలో శిరీష అత్తమామలు సీతారావమ్మ, మోహనరావు, ఆడపడుచు లక్ష్మి ఉంటున్నారు. మరో గదిలో సాంబశివరావు, శిరీష ఉంటున్నారు. సాంబశివరావు లారీ డ్యూటీకి, మోహనరావు సమీపంలోని ఓ కర్మాగారంలో పనిచేసేం దుకు వెళ్లారు. సీతారావమ్మ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. శిరీష తన కుమార్తె ప్రియను అంగనవాడీ కేంద్రంలో దింపి, ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని ఫ్యానుకు తాడుతో ఉరేసుకుంది.
ఇంటికి వచ్చిన ప్రియ ఏడుస్తుండటంతో స్థాని కులు తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతున్న శిరీష కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికిచేరుకుని పరిశీలించారు. నాగశిరీష తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ ఎం.రాంకుమార్ తెలి పారు. ఎస్ఐ ఎం.నరసింహారావు, వీఆర్వో వెంకటేశ్వరరావు, కంచికచర్ల, వీరులపాడు పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించారు.