తాంత్రికుడి మాటలు విని.. కోడలికి అగ్ని పరీక్ష | UP Woman Allegedly Burns Daughter In Law Hands | Sakshi
Sakshi News home page

తాంత్రికుడి మాటలు విని.. కోడలికి అగ్ని పరీక్ష

Oct 26 2018 12:33 PM | Updated on Oct 26 2018 12:55 PM

UP Woman Allegedly Burns Daughter In Law Hands - Sakshi

కోడలికి అగ్ని పరీక్ష పెడితే అసలు నిజం బయటపడుతుంది.

లక్నో : కోడలికి వివాహేతర సంబంధం ఉందంటూ ఆమెకు ‘అగ్ని పరీక్ష’ పెట్టారు ఓ అత్తగారు. మాంత్రికుడి సలహా మేరకు కోడలి చేతులు కాల్చి రాక్షసానందం పొందారు. ఈ విచారకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకుంది. వివరాలు..సుమానీ అనే యువతికి మథురకు చెందిన జైవీర్‌ అనే వ్యక్తితో గత ఏప్రిల్‌లో వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు సజావుగానే సాగిన వీరి కాపురంలో అనుమానపు చిచ్చు రేగింది. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ జైవీర్‌ ఆరోపించగా, అతడి తల్లి కూడా అందుకు వంతపాడింది. తాను అలాంటి దాన్ని కాదని కోడలు ఎంతగా మొత్తుకున్నా వినకుండా తాంత్రికుడిని పిలిపించింది. కోడలికి అగ్ని పరీక్ష పెడితే అసలు నిజం బయటపడుతుందని అతడు చెప్పడంతో.. సుమానీ చేతులు కాల్చింది.

కాగా కట్నం కోసమే తనపై నిందలు వేసి భర్త, అత్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ సుమానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓసారి తనపై హత్యాయత్నం కూడా జరిగిందని.. ఆ సమయంలో తండ్రి మాటకు కట్టుబడి ఫిర్యాదు చేయలేదన్నారు. తన చెల్లెలు కూడా ఈ ఇంటి కోడలు కావడంతోనే ఇన్నాళ్లు బాధలు భరించానని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement