ప్రచారంలో హేమామాలినికి పెళ్లి కష్టాలు! | Dharmendra absence questioned as Hema Malini's campaign picks up | Sakshi
Sakshi News home page

ప్రచారంలో హేమామాలినికి పెళ్లి కష్టాలు!

Published Mon, Apr 21 2014 1:18 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

ప్రచారంలో హేమామాలినికి పెళ్లి కష్టాలు! - Sakshi

ప్రచారంలో హేమామాలినికి పెళ్లి కష్టాలు!

మథుర: బీజేపీ అభ్యర్థి 'డ్రీమ్ గర్ల్' హేమామాలినికి మధుర నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీస్తున్నా... గెలుపు కోసం చెమటోడ్చక తప్పడం లేదు. అయితే ఈ నియోజక పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్న హేమామాలినికి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ప్రచారంలో భాగంగా ఏ చోటుకెళ్లినా ధర్మేంద్ర ఎప్పుడొస్తున్నారని హేమామాలిని అడుగుతున్నారు. ప్రజల అభ్యర్థన మేరకు ధరమ్ జీని త్వరలోనే ప్రచారంలోకి దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. 
 
అయితే ధర్మేంద్ర ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని.. బీఎస్పీ అభ్యర్థి యోగేంద్ర ద్వివేదికి ప్రచారం నిర్వహిస్తున్న రామ్ ధార్ అనే కార్యకర్త అంటున్నారు. ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొంటే.. హేమామాలినితో వివాహ సంబంధంపై నిలదీస్తామన్నారు. హేమామాలినితో ఉన్న సంబంధమేమిటనే ప్రశ్నకు ధర్మేంద్ర సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అందుకే హేమామాలిని ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొనడానికి వెనకడుగు వేస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని సినీ దర్శకుడు అనిల్ శర్మ ఖండించారు. 
 
విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికావని.. ధర్మేంద్ర సోమవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారని అనిల్ శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి హేమామాలినికి కూతుళ్లు ఇషా, అహానాలు గ్రామీణ ప్రాంతాల్లో కలుసుకుని తల్లి విజయానికి కృష్టి చేస్తున్నారు. జాట్ కులస్థులు ఎక్కువగా ఉన్న మథుర నియోజకవర్గంలో 'డ్రీమ్ గర్ల్' కు రాష్రీయ లోక్ దళ్ అభ్యర్థి జయంత్ చౌదరీ గట్టిపోటీనిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement