అమ్మాయిలు ఫోన్ వాడుతూ రోడ్డుపై నడిస్తే..
అమ్మాయిలు ఫోన్ వాడుతూ రోడ్డుపై నడిస్తే..
Published Wed, May 3 2017 5:05 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
మొబైల్ ఫోన్.. ప్రతిఒక్కరి చేతిలో ఇది ఇప్పుడు తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అలాంటి ఫోన్ అమ్మాయిలు వాడకూడదట. అమ్మాయిలు మొబైల్ ఫోన్స్ వాడుతూ.. వీధిలో నడిస్తే భారీ జరిమానా విధించనున్నారు. ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? మదురలోని మడోర గ్రామ పంచాయతీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క అమ్మాయిల ఫోన్ల వాడకంపైనే కాక, గోవులను చంపే వారిపై కూడా భారీ జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఆవులను చంపేవారికి వ్యతిరేకంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ కు ఎన్నికైన కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రచారాన్నిసపోర్టు చేయాలని ముస్లిం కమ్యూనిటీ నిర్ణయించడంతో, గ్రామ మాజీ ప్రధాన్ మహమ్మద్ గఫ్ఫర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆవులను దొంగలించేవారిపై లేదా చంపేవారిపై 2 లక్షలు, అదేవిధంగా మద్యం అమ్మేవారిపై రూ.1.11 లక్షలు , మొబైల్ ఫోన్లు వాడుతూ రోడ్లపై వీధుల్లో నడిచే అమ్మాయిలపై రూ.21వేల రూపాయలు జరిమానా విధించాలని పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. అమ్మాయిలపై జరుగుతున్న క్రైమ్ కేసులను తగ్గించడానికి ఈ మేరకు జరిమానా విధించనున్నామని పంచాయతీ చెబుతోంది. పెనాల్టీతో పాటు ఏ మేరకు శిక్ష విధించాలో కూడా పంచాయతీ అంతా ఓ సారి నిర్ణయించనున్నారు.
Advertisement