అమ్మాయిలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దట... | Girls should not be given mobile phones, says BJP MLA Sunder Lal | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దట...

Published Mon, Apr 6 2015 4:05 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

Girls should not be given mobile phones, says BJP MLA Sunder Lal

ఝుంఝను:  మహిళలు, బాలికలపై  ఎమ్మెల్యేల, ఎంపీల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర ఇంకా  కొనసాగుతూనే ఉంది.  తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే సుందర్ లాల్ అమ్మాయిలకు సెల్పోన్లు ఇవ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఝుంఝునూలోని  అంబేద్కర్ భవన్లో జరిగిన  ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సుందరలాల్ ఆడపిల్లల తల్లిదండ్రలకు వివాదాస్పద సూచనలు చేశారు. సెల్ఫోన్ వల్ల అమ్మాయల  జీవితాలు పాడైపోతాయి.. వారికి సెల్ఫోన్లు ఇవ్వద్దంటూ తల్లిదండ్రులకు సూచించారు.  జీవితాల మీద చెడు ప్రభావం పడుతుందని, అనవసరమైన విషయాలు నేర్చుకుంటారంటూ  చెప్పుకొచ్చారు.


పిలాని నియోజకవర్గంనుంచి ఎస్సీ కోటాలో చట్టసభకు ఎన్నికయ్యారు సుందర్లాల్. బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి  సోనియాగాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇకపై ఇలాంటివాటిని సహించేది లేదని, జాగ్రత్తగా ఉండాలని.. బీజేపీ అధినాయకత్వం తమ ప్రజాప్రతినిధులకు  హెచ్చరికలు జారీ చేసింది. అయినా చట్టసభ్యులు పెడచెవిన పెట్టడం చర్చనీయాంశమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement