నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. దక్షిణాది మధురగా పేరొందిన కర్నాటకలోని ఉడుపిలో జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూసేందుకు ఉడుపికి తరలివస్తున్నారు.
ఆలయంలో ఈ రోజున తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు ప్రారంభమయ్యాయి. ఇవి రోజంతా కొనసాగనున్నాయి. కర్నాటకలోని అత్యంత పురాతన దేవాలయాలతో ఉడుపి ఒకటి. ఈ ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ఎంతో విశిష్టమైనదని చెబుతారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని సాంప్రదాయక కళారీతిలో అలంకరించారు. ఉడిపిలోని వీధులు, వివిధ దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.
ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లో అందమైన ముగ్గులు వేసి, వాటిని పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఈరోజు ఉడుపిలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్)యూజర్ అను సతీష్ తన అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో శ్రీకృష్ణునికి పూలతో చేసిన అందమైన అలంకరణను, ఆలయశోభను చూడవచ్చు.
Krishna Janmashtami Today
Divine Darshan of Udupi Shri Krishna to bless our day.. Janmashtami wishes
Shri Krishna's blessings to all 🙏✨️ pic.twitter.com/k43CJIQMFe— Anu Satheesh 🇮🇳🚩 (@AnuSatheesh5) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment