సతుల కోసం బాలీవుడ్ పతుల పాట్లు | Dharamji will join me in Mathura next week, says Hema Malini | Sakshi
Sakshi News home page

సతుల కోసం బాలీవుడ్ పతుల పాట్లు

Apr 14 2014 12:26 PM | Updated on Aug 14 2018 4:21 PM

సతుల కోసం బాలీవుడ్ పతుల పాట్లు - Sakshi

సతుల కోసం బాలీవుడ్ పతుల పాట్లు

పలువురు బాలీవుడ్ నటీమణులు ఈసారి ఎన్నికల బరిలో ఉండటంతో వాళ్ల పతులకు ఎన్నికల పాట్లు తప్పడం లేదు.

పలువురు బాలీవుడ్ నటీమణులు ఈసారి ఎన్నికల బరిలో ఉండటంతో వాళ్ల పతులకు ఎన్నికల పాట్లు తప్పడం లేదు. ఇప్పటికే కిరణ్ ఖేర్ తరఫున ఆమె భర్త అనుపమ్ ఖేర్ ప్రచారపర్వంలో తలమునకలుగా ఉన్నారు. చండీగఢ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ మీద కిరణ్ ఖేర్ బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే స్థానం నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. కిరణ్ తరఫున బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్ ఖేర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇందుకోసం ఆయన దాదాపు నెల రోజుల పాటు తన సినిమా షూటింగులన్నీ రద్దు చేసుకున్నారు కూడా.

ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్లోని మథుర స్థానం నుంచి పోటీ చేస్తున్న అలనాటి కలల సుందరి హేమమాలిని కూడా తన భర్తను ప్రచార బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హేమమాలిని భర్త, ఒకప్పటి టాప్ హీరో ధర్మేంద్ర వచ్చే వారం నుంచి ప్రచారపర్వంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హేమమాలినే ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా హేమమాలినికి మద్దతుగా రావట్లేదంటూ ఇతర పార్టీల నాయకులు విమర్శలు గుప్పించడంతో ఆమె ఒకింత నొచ్చుకున్నారు. పెద్దకూతురు ఈషా డియోల్ ఇప్పటికే ప్రచారంలో అక్కడక్కడ పాల్గొంటుండగా, చిన్నకూతురు అహానా కూడా ప్రచారం చేసింది. ధరమ్జీ మరికొన్ని రోజుల్లో వస్తారని హేమ మాలిని చెప్పారు. అయినా జనం తన కుటుంబం గురించి ఎందుకు అడుగుతారో అర్థం కాదని, తన అల్లుళ్లు, వియ్యపురాళ్లు కూడా ప్రచారానికి వస్తామని చెప్పారని.. అయితే వాళ్లను ఎవరూ గుర్తుపట్టరు కాబట్టి వద్దన్నానని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement