kiran kher
-
కిరణ్‌ఖేర్‌కు మొండిచేయి
సాక్షి, న్యూఢిల్లీ: చండీగఢ్ నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన బాలీవుడ్ నటి కిరణ్‌ఖేర్‌కు బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించింది. అక్కడ ఛత్తీస్‌గఢ్ మాజీ గవర్నర్, జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన దివంగత బలరామ్‌జీ దాస్ టాండన్ కుమారుడు సంజయ్ టాండన్‌ను బరిలో నిలిపింది. 9 మంది అభ్యర్థులతో బీజేపీ బీజేపీ బుధవారం పదో జాబితా విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు, చండీగఢ్, పశి్చమ బెంగాల్ నుంచి చెరొకరు చొప్పున పేర్లను ప్రకటించింది. అలహాబాద్ సిట్టింగ్ ఎంపీ రీటా బహుగుణ జోషీ స్థానంలో నీరజ్ త్రిపాఠికి అవకాశమిచి్చంది. మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ అభ్యర్థి, అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌పై రాష్ట్ర మంత్రి జైవీర్‌సింగ్ ఠాకూర్‌ను పోటీలో దింపింది. బలియాలో నాలుగుసార్లు ఎంపీగా గెలి్చన వీరేంద్రసింగ్‌ను పక్కనబెట్టి మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్‌కు టికెటిచి్చంది. పశి్చమ బెంగాల్లో అసన్సోల్ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియాకు టికెటిచి్చంది. గాజీపూర్‌లో ఇటీవల మరణించిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు అఫ్జల్ అన్సారీపై పరాస్నాథ్ రాయ్‌ను బరిలోకి దింపింది. కౌశాంబి నుంచి వినోద్ సోంకార్, మఛ్లీషహర్ నుంచి బీపీ సరోజ్ పోటీచేయనున్నారు. -
Kirron Kher: గ్రేట్ కమ్ బ్యాక్ గెలుపు కిరణం.. ‘ఆమె ఫైటర్. అంతే’!
Kirron Kher, Battling Cancer, Returns To India's Got Talent Set As A Judge: కిరణ్ ఠాకూర్ సింగ్ సందు ఎవరు? అంటే జవాబు చెప్పడానికి తటపటాయిస్తారుగానీ, ‘కిరణ్ ఖేర్’ అనే పేరు మాత్రం సుపరిచితం. నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలు. కొన్ని నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ అనే విషయం ప్రకటితమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతో బాధపడ్డారు. సోషల్ మీడియాలో సానుభూతి మాటలు వెల్లువెత్తాయి. కిరణ్‌ఖేర్ చికిత్స కోసం వెళ్లే ముందు తనయుడు సికిందర్ ఖేర్ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశాడు. అందులో ఆమె ఎప్పటిలాగే ఉన్నారు. అదే చిరునవ్వు. ‘కెమెరాను కాస్త నా ముందుకు తీసుకురా’ అన్నారు. అలాగే చేశాడు. అప్పుడు... స్నేహితులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులను ఉద్దేశించి కిరణ్ ఖేర్ ఇలా అన్నారు... ‘హలో! థాంక్యూ ఎవ్రీబడీ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్ లవ్’ ఎప్పటిలాగే చీర్‌ఫుల్ వాయిస్! చికిత్స జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకునేవారు కిరణ్. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా సమస్యల్లో ఉన్నవారికి అండగా ఉండేవారు. ఫోన్ ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు. చండీగఢ్‌లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలనేది ఆమె కల. తన అనారోగ్యం ఆ కలను ఆపలేకపోయింది. ఎప్పటికప్పడు, ఎవరితోనో ఒకరితో ఈ ప్లాంట్ గురించి మాట్లాడుతూనే ఉండేవారు. పని వేగం పుంజుకోవడానికి ప్రయత్నించేవారు. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చండీగఢ్‌కు వెళ్లాలనేది ఆమె బలమైన కోరిక. అయితే ఆరోగ్యజాగ్రత్తల రీత్యా వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం థెరపీ కోసం నెలకు ఒకసారి హాస్పిటల్‌కు వెళ్లాలి. ‘ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నారు’ అని చాలామంది ఇచ్చే ప్రశంసలకు ఆమె ఇచ్చే సమాధానం... ‘పనే నా బలం. పనే నా ఆరోగ్యం. పనే నా ఉత్సాహం’ పని లేకుండా తనను తాను ఊహించుకోలేని కిరణ్ మళ్లీ పనిలోకి దిగారు. రియాల్టీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ సెట్లోకి రావడం తొలి అడుగుగా చెప్పాలి. ఈ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జడ్జిగా ఆమె ప్రతిభను గురించి సెట్లో ఉన్న శిల్పాషెట్టిలాంటివారు గొప్పగా మాట్లాడారు. ఆ ప్రశంసల మాధుర్యాన్ని కిరణ్ ఆస్వాదించారో లేదో తెలియదుగానీ, ఆరోజు తాను ధరించిన నగలపైన తానే జోక్ వేసి అక్కడ ఉన్నవారిని గట్టిగా నవ్వించారు. వారితో పాటు తాను కూడా గొంతు కలిపారు. దురదృష్టమా మళ్లీ రాకు... ఆ నవ్వుల్లో ఎంతబలం ఉందో చూశావు కదా! కిరణ్ చికిత్సకు వెళుతున్న రోజు భర్త అనుపమ్ ఖేర్ కళ్లలో ఎన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో తెలియదుగానీ... వాటిని దాచుకొని ఆరోజు ధైర్యంగా అన్నాడు... ‘ఆమె ఫైటర్. అంతే’ అతడి ఆత్మవిశ్వాసం వృథా పోలేదు అని కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
ఆడవాళ్ల జాగ్రత్తల గురించి ఆమెకు తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : చండీగఢ్‌లో గత నెల 22 ఏళ్ల యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనపై ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ స్పందిస్తూ ‘నీవు ఎక్కాల్సిన ఆటోలో అప్పటికే ముగ్గురు యువకులు కూర్చొని ఉన్నప్పుడు ఆ ఆటో నీవు ఎక్కాల్సింది కాదు’ అని బాధితురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా రవాణాకు కిరణ్ ఖేర్ చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్టున్నారు. అసలు ఆమెకు ఎన్నడూ ప్రజా రవాణాలో ప్రయాణించిన అనుభవమే ఉండక పోవచ్చు. చండీగఢ్ లాంటి నగరాన్ని తీసుకుంటే షేరింగ్ టాక్సీలోగానీ, షేరింగ్ ఆటోలోగానీ వెళ్లాలంటే క్యూలో నిలబడాల్సిందే. నీ వంతు రాగానే గుడ్డిగా ఎక్కాల్సిందే, మరో ఛాయిస్ ఉండదు. లేదంటే పక్కకు తోసేస్తారు. ఒక్కసారి క్యూ నుంచి పక్కకు వచ్చావంటే మళ్లీ అందరికన్నా వెనక నిలబడాల్సిందే. ఎక్కాల్సిన ఆటోలో ఎంత మంది ఉన్నారు? వారిలో పురుషులు ఎంత మంది ? మహిళలు ఎంత మంది? వారెలా ఉన్నారు? రౌడీల్లా ఉన్నారా? రేపిస్టుల్లా ఉన్నారా? సాధు జీవుల్లా ఉన్నారా? తెలుసుకునేందుకు వారి ముఖాలను పరికించి చూసే అవకాశంగానీ, ఆలోచించే క్షణంగానీ ఉండదు. ముందున్నది ట్యాక్సీ అయినా, ఆటో అయిన జనంతోపాటు ముందుకు నడవాల్సిందే. షేరింగ్ కాకుండా సొంతంగా టాక్సీ లేదా ఆటో తీసుకోవడం వేరు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా చేరుకునేందుకు ఆరాటపడే మహిళల్లో ఎక్కువ మందికి అంతటి స్థోమత ఉండదు. అంతటి స్థోమత ఉన్నవాళ్లు కూడా వాటిల్లో వెళ్లేందుకు ఇష్టపడరు. ఎందుకంటే భద్రత. ఒంటరిగా వెళితే జరుగకూడదేదో జరుగుతుందన్న ఆందోళన. అందుకనే పట్టణాల్లో ఉద్యోగాలు చేసి బతికే దిగువ, మధ్య తరగతి మహిళల్లో 99 శాతం ప్రభుత్వ లేదా ప్రజా రవాణేనే ఆశ్రయిస్తారు. కారణం, పదిమందిలోనే భద్రత ఉంటుందన్న నమ్మకం. అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రభుత్వ బస్సుల్లో వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు దేశంలోని అనేక పట్టణాల్లో బస్సుల్లో, సెట్విన్లలో, షేరింగ్ ఆటో లేదా ట్యాక్సీల్లో వెళ్లాలంటే క్యూల్లో నిలబడాల్సిందే. భారతీయ మహిళలకు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కిరణ్ ఖేర్ లాంటి వారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లులు, అత్తలు, కజిన్స్, స్నేహితులు ఇలాంటి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అవి కాకుండా స్వానుభవంతో మరికొన్ని జాగ్రత్తలు తెలుసుకుంటారు. మనం ఎక్కడికి వెళుతున్నాం ? ఏ ప్రాంతానికి వెళుతున్నాం ? అక్కడ ఎలాంటి రకం మనుషులు ఉంటారు? వారి దృష్టిలో పడకుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి దుస్తులు ధరించి వెళ్లాలి? ఇన్ని అంశాలను ఆలోచించి మహిళలు రోడ్డెక్కుతారన్న విషయం కిరణ్ ఖేర్‌కు ఎంత మేరకు తెలుసు? రైళ్లలో ఎక్కినప్పుడు కూడా ఆ కంపార్ట్మెంట్లో మహిళలు ఉన్నారా, లేరా? ఉంటే ఎంత మంది మహిళలు ఉన్నారు? వారు గుంపుగా ఒక దగ్గరున్నారు ? వేర్వేరుగా ఉన్నారా? వాది వద్దకు వెళితే తనకు మరింత భద్రత ఉంటుందా? మగవాళ్లు ఎక్కువుంటే వారు గ్రూపులుగా కూర్చొని ఉన్నారా? విడివిడిగా ఎక్కువగా ఉన్నారా? వారు కాకతాళీయంగా గుంపులుగా కూర్చున్నారా? లేదా వారి మధ్య పరిచయం ఉందా? అదే కంపార్ట్మెంట్లో ఉంటే తనకు మంచిదా, మరో కంపార్ట్‌మెంట్‌కు వెళ్లడం శ్రేయస్కరమా? ఇన్ని విధాలుగా మహిళలు ఆలోచిస్తారన్న విషయం కిరణ్ ఖేర్ లాంటి వారికి తెలుసా? దేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ ఉండాలని, దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అందుకు పోరాడాల్సిన బాధ్యత తన లాంటి ఎంపీలదని ఆమె ఎప్పటికైనా గ్రహిస్తారా? అత్యుత్తమ రవాణా వ్యవస్థ లేకనే ఇలా అప్పుడప్పుడు మహిళలు మగాళ్లకు బలవుతున్నారన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా? ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థ అంటే ‘బుల్లెట్ ట్రెయిన్’ అనుకుంటే ఇక ఆ బుర్రలను ఏం చేయలేం! ఇక్కడ చండీగఢ్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన అమ్మాయి ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. పైగా రిస్కు తీసుకువడం అనేది ఆమె ఇష్టం. నగరంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా, రాత్రయినా, పగలైనా వెళ్లే హక్కు, పౌరుల మధ్య తిరిగే హక్కు ఆమెకుంది ? ఆమె హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. (ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ స్కూల్ ఆఫ్ మిడియా అండ్ కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్ శిల్పా పాడ్కే వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షరరూపం) -
రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదు
ముంబై: వివాదాస్పద ట్వీట్లతో తరచు వార్తలో నిలిచే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పారు. తాను కోట్లాది మంది భారతీయులకు ప్రతినిధిగా ఉంటానని చెప్పారు. ఈస్ట్ ఆర్ వెస్ట్.. ఇండియా ఈజ్ బెస్ట్ అని నమ్మే భారతీయుల తరఫున తన వాదనను వినిపిస్తాను తప్ప రాజకీయాల్లోకి రానన్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో, స్నేహితులతో ఆయన సరదాగా చాట్ చేసినపుడు.. మీ భార్య కిరణ్లా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నలకు ఆయన ఇలా స్పందించారు. మీ భార్య అడుగు జాడల్లో నడుస్తారా అన్న నెటిజన్ల ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లో చేరనని, నటుడిగా, స్ఫూర్తిమంతమైన ఉపన్యాసకుడిగా ఉండటమే తనకు సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. పరమత సహనం కోరుతూ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని ప్రకటించిన ఖేర్ తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. అయితే ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న అనుపమ్ భార్య కిరణ్ ఖేర్.. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా సల్మాన్ సెన్సేనషనల్ మూవీ 'ప్రేమ రతన్ ధన్ పాయో'లో నటించిన అనుపమ్.. క్రికెటర్ ధోనీపై రూపొందుతున్న చిత్రం 'ఎమ్ఎస్ ధోనీ' లో ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కిరణ్ ఖేర్ (టీవీ, సినీ నటి), కె.ఎం.బిర్లా (పారిశ్రామికవేత్త) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. వీరికి ఈ సంవత్సరం వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ధనం చేతికందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని ఉన్నతికి ఉపయోగించు కుంటారు. అవివాహితులకు వివాహం. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది. అహంకారంతో ప్రవర్తించడం వల్ల స్నేహితులు, దగ్గరివారు దూరమయ్యే ప్రమాదం ఉంది. అనాలోచితంగా, ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, నవగ్రహాభిషేకం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, నేత్రదానం చేయడం, ప్రోత్సహించడం మంచిది. - డా. మహమ్మద్ దావూద్ జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
జింగిల్స్..జిల్జిల్ జిలా!
రికార్డు చేసిన సందేశాలతో ఓటర్లను ఆకట్టుకోనున్న బీజేపీ - ఫోన్లు, రేడియోల్లో ప్రసారానికి ఏర్పాట్లు - సుపరిపాలన ఇతివృత్తంగా సందేశాల ప్రచారం - సోషల్ మీడియా ప్రచారంలో తామే ముందున్నట్లు ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: కిరణ్ ఖేర్, హేమమాలిని, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో ఢిల్లీవాసులతో ఫోన్లో, రేడియోలో మాట్లాడనున్నారు. తమ పార్టీ తరఫున ప్రచారం చేసే జనాకర్షణ గల నేతల సందేశాలను రికార్డు చేసి ఢిల్లీలో ఓటర్లకు వినిపించడానికి ఢిల్లీ బీజేపీ సన్నాహాలు చేస్తోంది. సుపరిపాలన అంశంపై ఢిల్లీవాసులకు ఈ నేతల సందేశాలను వినిపించి ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంపీలతో జరుపుతోన్న ప్రచారం ఈ నెల 20న ముగియనుండడంతో మరో తరహాలో ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటోన్న బీజేపీ రేడియోలో, ఫోన్లో ముందే రికార్డు చేసిన సందే శాలు, జింగిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారంపై దృష్టి సారించనుంది. ఈ ప్రచారంలో తాము అసత్య వాగ్ధానాలు చేయబోమని, మోడీ అభివృద్ధి నమూనాను ప్రజల ముందుంచుతామని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ చెప్పారు. ప్రచారం కోసం సుపరిపాలనను ఇతివృత్తంగా ఎంచుకున్న బీజేపీ గత ఆరు నెలల్లో కేంద్రం చేపట్టిన జన్‌ధన్ యోజన, స్మార్ట్ సిటీస్, వై-ఫై కనెక్టివిటీ ఇత్యాది అంశాలను ప్రచారం కోసం ఉపయోగించుకోనుంది. సోషల్ మీడియా ప్రచారంలో తమ పార్టీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందుందని ఉపాధ్యాయ చెప్పారు. ఆప్ ఫేస్ బుక్ పేజీకి రోజుకు 3 వేల లైక్స్ వస్తుండగా, తమకు పది వేల లైక్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం చేపట్టిన కార్యకమాన్ని డిసెంబర్ 20 తర్వాత మరింత ముమ్మరం చేయనున్నట్లు ఉపాధ్యాయ తెలిపారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిన నియోజకవర్గాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మంగళవారం వరకు కొత్తగా 16 లక్షల మంది సభ్యత్వం స్వీకరించారని పార్టీ తెలిపింది. -
సతుల కోసం బాలీవుడ్ పతుల పాట్లు
పలువురు బాలీవుడ్ నటీమణులు ఈసారి ఎన్నికల బరిలో ఉండటంతో వాళ్ల పతులకు ఎన్నికల పాట్లు తప్పడం లేదు. ఇప్పటికే కిరణ్ ఖేర్ తరఫున ఆమె భర్త అనుపమ్ ఖేర్ ప్రచారపర్వంలో తలమునకలుగా ఉన్నారు. చండీగఢ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ మీద కిరణ్ ఖేర్ బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే స్థానం నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. కిరణ్ తరఫున బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్ ఖేర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇందుకోసం ఆయన దాదాపు నెల రోజుల పాటు తన సినిమా షూటింగులన్నీ రద్దు చేసుకున్నారు కూడా. ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మథుర స్థానం నుంచి పోటీ చేస్తున్న అలనాటి కలల సుందరి హేమమాలిని కూడా తన భర్తను ప్రచార బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హేమమాలిని భర్త, ఒకప్పటి టాప్ హీరో ధర్మేంద్ర వచ్చే వారం నుంచి ప్రచారపర్వంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హేమమాలినే ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా హేమమాలినికి మద్దతుగా రావట్లేదంటూ ఇతర పార్టీల నాయకులు విమర్శలు గుప్పించడంతో ఆమె ఒకింత నొచ్చుకున్నారు. పెద్దకూతురు ఈషా డియోల్ ఇప్పటికే ప్రచారంలో అక్కడక్కడ పాల్గొంటుండగా, చిన్నకూతురు అహానా కూడా ప్రచారం చేసింది. ధరమ్జీ మరికొన్ని రోజుల్లో వస్తారని హేమ మాలిని చెప్పారు. అయినా జనం తన కుటుంబం గురించి ఎందుకు అడుగుతారో అర్థం కాదని, తన అల్లుళ్లు, వియ్యపురాళ్లు కూడా ప్రచారానికి వస్తామని చెప్పారని.. అయితే వాళ్లను ఎవరూ గుర్తుపట్టరు కాబట్టి వద్దన్నానని ఆమె అన్నారు. -
పవన్ బన్సల్ కు ఎన్నికల సంఘం షోకాజ్
మామూలు టైమ్ లో ఏదంటే అది మాట్లాడవచ్చు కానీ ఎన్నికల సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది కోడ్ ఉల్లంఘనో, ఏది ఉల్లంఘన కాదో చెప్పడం కష్టం. చండీగఢ్ నుంచి బరిలో ఉన్న కేంద్ర మంత్రి పవన్ బన్సల్ ఎప్పట్లాగే బిజెపిపై మతపరమైన ఆరోపణలు చేశారు. దీంతో ఎన్నికల కమీషన్ ఆయనకు అలా ఎందుకు మాట్లాడావంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బన్సల్ ఓట్లడిగేందుకు ముస్లింల సభకి వెళ్లి 'ముస్లింలు బాబరీ కూల్చివేతను, గోధ్రా నరమేథాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు' అని తనకు ఓట్లేయమని అడిగారు. ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని బిజెపి ఆరోపించింది. అంతే కాదు. కాంగ్రెస్ నేతలు బిజెపి అభ్యర్థి, నటి కిరణ్ ఖేర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కూడా బిజెపి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సంఘం మూడు రోజుల్లో తన వాదనను వినిపించాల్సిందిగా పవన్ బన్సల్ కి నోటీసులు జారీ చేసింది. పవన్ భాయి ఇప్పుడు అసలు తానేం మాట్లాడాడు, అందులో అభ్యంతరకరమైనదేమిటి తెలుసుకునేందుకు తన స్పీచిని తానే వింటూ కాలం గడుపుతున్నారు. 'పవన్ బన్సల్ చాలా తెలివైన వారు. ఆయన అనుభవజ్ఞుడైన కేంద్ర మంత్రి. ఆయన ఇలాంటి మాటాలు మాట్లాడరు' అంటున్నారు ఆయన అనుచరులు. -
చండీగఢ్‌లో మెరిసే 'తార' ఎవరో ?