9 మందితో బీజేపీ పదో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: చండీగఢ్ నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన బాలీవుడ్ నటి కిరణ్‌ఖేర్‌కు బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించింది. అక్కడ ఛత్తీస్‌గఢ్ మాజీ గవర్నర్, జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన దివంగత బలరామ్‌జీ దాస్ టాండన్ కుమారుడు సంజయ్ టాండన్‌ను బరిలో నిలిపింది. 9 మంది అభ్యర్థులతో బీజేపీ బీజేపీ బుధవారం పదో జాబితా విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు, చండీగఢ్, పశి్చమ బెంగాల్ నుంచి చెరొకరు చొప్పున పేర్లను ప్రకటించింది. అలహాబాద్ సిట్టింగ్ ఎంపీ రీటా బహుగుణ జోషీ స్థానంలో నీరజ్ త్రిపాఠికి అవకాశమిచి్చంది.
మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ అభ్యర్థి, అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌పై రాష్ట్ర మంత్రి జైవీర్‌సింగ్ ఠాకూర్‌ను పోటీలో దింపింది. బలియాలో నాలుగుసార్లు ఎంపీగా గెలి్చన వీరేంద్రసింగ్‌ను పక్కనబెట్టి మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్‌కు టికెటిచి్చంది. పశి్చమ బెంగాల్‌లో అసన్‌సోల్ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎస్ అహ్లువాలియాకు టికెటిచి్చంది. గాజీపూర్‌లో ఇటీవల మరణించిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు అఫ్జల్ అన్సారీపై పరాస్‌నాథ్ రాయ్‌ను బరిలోకి దింపింది. కౌశాంబి నుంచి వినోద్ సోంకార్, మఛ్‌లీషహర్ నుంచి బీపీ సరోజ్ పోటీచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment