
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కిరణ్ ఖేర్ (టీవీ, సినీ నటి), కె.ఎం.బిర్లా (పారిశ్రామికవేత్త)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. వీరికి ఈ సంవత్సరం వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ధనం చేతికందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని ఉన్నతికి ఉపయోగించు కుంటారు. అవివాహితులకు వివాహం. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది. అహంకారంతో ప్రవర్తించడం వల్ల స్నేహితులు, దగ్గరివారు దూరమయ్యే ప్రమాదం ఉంది.
అనాలోచితంగా, ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, నవగ్రహాభిషేకం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, నేత్రదానం చేయడం, ప్రోత్సహించడం మంచిది.
- డా. మహమ్మద్ దావూద్
జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు