
లక్నో: ప్రజలకు దగ్గర కావడానికి పోలీసులు ఇటీవల కాలంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తమ వికృత చర్యలతో ప్రజలను భయకంపితులను చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... మథురలోని గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శాంతి ప్రజలను కాపాడాల్సిన పోలీసు అధికారి 8 ఏళ్ల బాలుడిపై మరుగుతున్న నూనె పోశాడు. దీంతో బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు గోవర్ధన్-బర్సానా రోడ్డును దిగ్భందించారు. ఈ సంఘటనకు కారణమైన పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలకు దిగారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రోడ్డుపై కొందరు దుండగులు మద్యం సేవించి పోలీస్ అధికారిని వెంబడించడంతో, భయపడిన అధికారి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాలుడిపై వేడి నూనె పడిందన్నారు. ఏదేమైనా దీనికి కారణమైన పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment