boiling oil
-
సలసల కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి నైవేద్యం
సాక్షి, చెన్నై(వేలూరు): తిరువణ్ణామలై జిల్లాలో కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరువణ్ణామలై జిల్లా కె.అగరం గ్రామంలో అయ్యారమ్మన్ ఆలయ జాతర తమిళ ఆడి మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఆఖరి రోజైన మంగళవారం సాయంత్రం అయ్యారమ్మన్‌కు పాపంపట్టి గ్రామానికి చెందిన శాంతి అమ్మాల్ అనే భక్తురాలు కాలే నూనెలో వడలను చేతితో తీసి భక్తులకు చూపించి వాటితో అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకోసం 48 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు భక్తురాలు తెలిపింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడే పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: (మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి) -
ఇద్దరితోనూ సన్నిహితం.. అక్కపై మరిగిన నూనె పోసిన చెల్లెలు
సాక్షి, కామారెడ్డి క్రైం: తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అక్కతో కూడా చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆమెపై చెల్లి మరిగిన నూనె పోసింది. ఈ ఘటన కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీలో మంగళవారం చోటు చేసు కుంది. కాలనీలో నివాసం ఉండే షేక్ చాందిని, నా గూర్‌బీలు అక్కాచెల్లెళ్లు. ఇది వరకే ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. తమ భర్తలతో గొడవల కారణంగా ఎవరికి వారు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా చాందినికి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉంటోంది. చెల్లెలు నాగూర్‌బీ కూడా శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉండేది. తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి తన అక్క కూడా సన్నిహితంగా ఉంటుందని జీర్ణించుకోలేక కాగుతున్న నూనెను నిద్రిస్తున్న చాందినిపై తన చెల్లెలు నాగూర్‌బీ పోసింది. తీవ్రగాయాలైన చాందినిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసుధన్‌గౌడ్ తెలిపారు. చదవండి: ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో -
8 ఏళ్ల బాలుడిపై పోలీసు వికృత చర్య
-
పోలీసు వికృత చర్య : 8 ఏళ్ల బాలుడిపై..
లక్నో: ప్రజలకు దగ్గర కావడానికి పోలీసులు ఇటీవల కాలంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తమ వికృత చర్యలతో ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... మథురలోని గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శాంతి ప్రజలను కాపాడాల్సిన పోలీసు అధికారి 8 ఏళ్ల బాలుడిపై మరుగుతున్న నూనె పోశాడు. దీంతో బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు గోవర్ధన్-బర్సానా రోడ్డును దిగ్భందించారు. ఈ సంఘటనకు కారణమైన పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలకు దిగారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రోడ్డుపై కొందరు దుండగులు మద్యం సేవించి పోలీస్ అధికారిని వెంబడించడంతో, భయపడిన అధికారి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాలుడిపై వేడి నూనె పడిందన్నారు. ఏదేమైనా దీనికి కారణమైన పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారు. -
కాగుతున్న నూనెలో పడి.. చిన్నారి మృతి
ఆదిలాబాద్: పండుగకు చేసుకునే పిండివంటలు... ఆ పాప పాలిట యమాపాశలయ్యాయి. కాగుతున్న నూనెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన అమూల్య (2) ఈ నెల 21న పక్కింట్లో అప్పాలు చేస్తుండగా పొయ్యి దగ్గరకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాగుతున్న నూనె కళాయిలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
మొహంపై సలసల కాగిన నూనె పోశాడు..
మీరట్: మద్యం మానివేయమని భార్య చెప్పిన మాటలు ఆ భర్తకు ఆగ్రహం తెప్పించింది. దాంతో తన ఇద్దరి స్నేహితులతో కలసి భర్త విజయ్‌పాల్ భార్య సంతోష్ మొహంపై సలసల కాగిన నూనె పోశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ మీరట్ ఉత్తమ్‌నగర్‌లోని గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విజయ్ పాల్ ఇంటికి చేరుకుని... సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తమ్‌నగర్‌లో నివసిస్తున్న విజయ్‌పాల్, సంతోష్ భార్యభర్తలు. విజయ్‌పాల్ తాగుడు అలవాటు అయింది. ఆ క్రమంలో రోజు తప్ప తాగి ఇంటికి వస్తున్న భర్తపై ఆమె ఆగ్రహించింది. తాగుడు మానివేయాలని అతడిని కోరింది. ఎప్పటిలాగే గురువారం విజయ్‌పాల్ తప్పతాగి అతడి ఇద్దరు స్నేహితులు కృష్ణాపాల్, అశోక్‌తో ఇంటి వచ్చాడు. దీంతో సంతోష్‌తోపాటు అతడి స్నేహితులతో ఆమె వాగ్వివాదానికి దిగింది. దాంతో ఆగ్రహించిన విజయ్ పాల్ అతడి స్నేహితుల కలసి సంతోష్ ముఖంపై వేడివేడి నూనె పోశాడు. అయితే ఈ ఘటనలో భర్త విజయ్‌పాల్, కృష్ణాపాల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.