సాక్షి, కామారెడ్డి క్రైం: తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అక్కతో కూడా చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆమెపై చెల్లి మరిగిన నూనె పోసింది. ఈ ఘటన కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీలో మంగళవారం చోటు చేసు కుంది. కాలనీలో నివాసం ఉండే షేక్ చాందిని, నా గూర్‌బీలు అక్కాచెల్లెళ్లు. ఇది వరకే ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. తమ భర్తలతో గొడవల కారణంగా ఎవరికి వారు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా చాందినికి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉంటోంది.
చెల్లెలు నాగూర్‌బీ కూడా శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉండేది. తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి తన అక్క కూడా సన్నిహితంగా ఉంటుందని జీర్ణించుకోలేక కాగుతున్న నూనెను నిద్రిస్తున్న చాందినిపై తన చెల్లెలు నాగూర్‌బీ పోసింది. తీవ్రగాయాలైన చాందినిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసుధన్‌గౌడ్ తెలిపారు.
చదవండి: ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో
Comments
Please login to add a commentAdd a comment