జవహర్ బాగ్ లో జరిగిన అల్లర్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి.
మథుర: మథురలోని జవహర్ బాగ్ లో జరిగిన అల్లర్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆందోళన కారుల దగ్గర భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఇంటలీజెన్స్ వర్గాలు 40 నివేదికలు సమర్సించాయని, వాటిని బుట్టదాఖలు చేసిన ఫలితమే 29 మంది మృతికి కారణమైందని తెలుస్తోంది. ఆక్రమణదారులను కాలీ చేయించడానికి వెళ్లిన పోలీసులకు అదనపు బలగాలను సైతం కేటాయించలేదు.ఆందోళన కారుల దగ్గర ఆయుధాలు ఉన్నట్టు, వారు ఆయుధ శిక్షణనను ఇస్తున్నవిషయాన్ని నిఘా వర్గాలు ఫోటోలు,వీడియోలతో సహా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈహెచ్చరికల్ని ప్రభుత్వం తేలికగా తీసుకున్న ఫలితమే ఇద్దరు పోలీసులతో సహా 29 మంది మృతికి కారణ మని సమాచారం. కాగా జవహరబాగ్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు.