పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సింది | Mathura violence: Police wasn't fully prepared, says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సింది

Published Fri, Jun 3 2016 5:31 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Mathura violence: Police wasn't fully prepared,  says Akhilesh Yadav

లక్నో:  ఉత్తరప్రదేశ్ లోని మథురలో ని జవహర్ భాగ్ ప్రాంతంలో జరిగిన 24 మంది మృతిపై సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. పోలీసులు పూర్తి ప్రిపరేషన్ తో వెళ్లక పోవడంవల్లే ప్రాణ నష్టం జరిగిందన్నారు. పోలీసులు కొంచెం ముందస్తు గా సిద్ధమయి వెళ్లాల్సి ఉండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆజాద్ భరత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి సభ్యుల దగ్గర మందుగుండు సామాగ్రి , ఆయుధాలు ఉంటాయని ఊహించలేదని తెలిపారు. 
 
ఆందోళన కారులకు చాలా విధాలా ప్రభుత్వ స్థలాన్ని కాలీ చేయమని సూచించామని వారు మాటవిననందువల్లనే పోలీసు చర్య తీసుకున్నామని పేర్కొన్నారు. పోలీసు కమిషనర్ స్థాయి వ్యక్తితో దర్యాప్తు జరుపుతున్నామని ఈ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని స్సష్టం చేశారు . చనినపోయిన ఇద్దరు పోలీసు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు 320 మందిని అదుపులోకి తీసుకున్నామని అఖిలేష్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement