మధుర: అక్టోబర్ నెల నుంచి 24 గంటలు విద్యుత్తు సరఫరా ఇచ్చే దిశగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇందుకోసం అక్రమ కనెక్షన్లను తొలగించిందేందుకు జిల్లా యంత్రాగాలు కార్యచరణను రూపొందించాయి. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకూ 27 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా గ్రామాల్లో 21బృందాలు, పట్టణాలలో 7 బృందాలు విద్యుత్తు అక్రమంగా వినియోగాన్ని నివారించి, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమస్యపై ప్రజల్లో అవగహన కల్పించేందుకు చాలా ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కొత్త కనెక్షన్లు తీసుకునేవారు కచ్చితంగా ధ్రువీకరణపత్రంతో పాటు ఇంటి యజమాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు.పాత మీటర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మీటర్లను అమర్చుతామని చెప్పారు.