Power connections
-
ఉచిత విద్యుత్ వెలుగుల్లో నెంబర్ వన్
-
ఎస్సీలకు సాయంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53,85,270 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా.. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 96.39% అంటే 51,91,091 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు పురోగతిపై విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90% పైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాలలో 80% నుంచి 90% మధ్య సాధిస్తే మంచి పనితీరు చూపిందని.. 80% లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు పేలవంగా ఉందని నివేదిక విశ్లే షించింది. గతంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో 33.57 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందించిందని, అనంతరం జనవరి నుంచి మార్చి వరకు అదనంగా మరో 18.34 లక్షల కుటుంబాలకు సాయం చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో 59,345 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందింది. పట్టణ పేదలకూ చేయూత గత ఆర్థిక ఏడాది పట్టణ పేదలకు సాయం చేయడంలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి మొత్తం 8.49 లక్షల మంది పట్టణ పేదలకు సాయం అందగా, అందులో 7,24,776 మంది ఏపీ వారేనని నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం గల కుటుంబాలకు 2.67 లక్షల ఎల్ఐజీ గృహాలను రాష్ట్రంలో నిర్మించగా, ఇతరత్రా దేశ వ్యాప్తంగా 9.15 లక్షల గృహాలు నిర్మించారని తెలిపింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేశారని ప్రశంసించింది. 18.47 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారని తెలిపింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద లక్ష్యానికి మించి కొత్తగా 33,122 స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించారని స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాదిలో ఏపీలో 24,852 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 1,24,311 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇది లక్ష్యానికి 500 శాతం మేర అధికం అని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 99.98 శాతం డెలివరీలు (ప్రసవాలు) ఇన్‌స్టిట్యూషన్లలోనే జరిగాయని నివేదిక పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 7,61,629 డెలివరీలు జరిగాయని తెలిపింది. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం చాలా మంచి పనితీరు కనపరిచాయని, 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) చక్కగా పని చేశాయని ప్రశంసించింది. -
AP: అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు,..ఏడాదిలో రూ.20.73 కోట్ల ఖర్చు
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోంది. విత్తనం నుంచి ఎరువులు, వ్యవసాయ ఉపకరణాల వరకు, సాగు ప్రారంభం నుంచి పంట కోతల వరకు, సాగు పెట్టుబడి, వడ్డీ రాయితీలు అందిస్తూ, గిట్టుబాటు ధరలు కల్పిస్తూ ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రధానంగా సాగునీటి వసతి కల్పించడం కోసం జలవనరులు అభివృద్ధి చేస్తోంది. నీటి పారుదల వసతి లేక, మోటార్లపై ఆధారపడిన రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించాలనే లక్ష్యంతో సరిపడినంత విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా రైతులు అడిగిన వెంటనే ప్రభుత్వమే ఖర్చులు భరించి ఉచితంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు చేస్తోంది. నెల్లూరు (వీఆర్సీసెంటర్): గత ప్రభుత్వ హయాంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పొందాలంటే గగనంగా ఉండేది. కనెక్షన్ మంజూరు అయినా అన్ని ఖర్చులు రైతులే భరించారు. అప్పట్లో ఏడాదికి పరిమిత సంఖ్యలోనే వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయడంతో రైతులు ఎదురుచూస్తూనే ఉండాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో రాజకీయ నాయకుల ఒత్తిడి, ఎవరైతే అమ్యామ్యాలు ఇచ్చే వారో అడ్డదారిలో ప్రాధాన్యత ఇచ్చి కనెక్షన్లు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నంగా రైతు అడిగిన వెంటనే రూపాయి ఖర్చు లేకుండా వెంటనే ప్రభుత్వం కనెక్షన్ ఏర్పాటు చేస్తోంది. ఏ రాజకీయ ఒత్తిళ్లు లేవు. పైరవీలు లేవు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులు రైతుల అర్హతలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో విద్యుత్ అందుబాటులో నుంచి కనెక్షన్లు ఇస్తున్నారు. విద్యుత్ సర్వీసు అందించడం కోసం ఒక్కొక్క కనెక్షన్ కోసం మూడు విద్యుత్ స్తంభాలు, వైరు (కండక్టర్), కాసారం, ఇన్సులేటర్, లేబర్ చార్జీలకు అయ్యే రూ.22 వేలను పూర్తిగా విద్యుత్‌శాఖనే భరిస్తోంది. ఏడాదిలో రూ.20.73 కోట్ల ఖర్చు ఒక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ (5హెచ్‌పీ) కోసం అందుబాటులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి రైతు పొలం వరకు మూడు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తోంది. 180 మీటర్ల నూతన విద్యుత్ లైన్‌ను వేసి విద్యుత్ సరఫరా అందజేస్తోంది. ఈ ప్రక్రియలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మూడు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు రూ.12 వేలు, నూతన విద్యుత్ లైన్ (కండక్టర్), కాసారాలు, ఇన్సులేటర్లకు రూ.6 వేలు, లేబర్ చార్జీలు (కూలీలు)కు ఖర్చు రూ.4 వేలు వంతున మొత్తం రూ.22 వేలను విద్యుత్ సంస్థే భరిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. ఈ లెక్కన గత పది నెలల కాలంలో 9,426 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పొందిన రైతులకు విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.20,73,72,000 ఖర్చు చేసింది. పంటపొలాలు సస్యశ్యామలం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 1,88,526 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇందులో గతేడాది 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 10 నెలల కాలంలో 9,426 విద్యుత్ సర్వీసులు ఇచ్చారు. ఇవి కాకుండా మరో 1,855 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకోగా వీరందరికీ మరో రెండు నెలల్లో కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క సర్వీస్ కింద 3 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 5,65,578 ఎకరాలకు మోటార్ల ద్వారా సాగునీరు పారుతోంది. ఇందులో వరితో పాటు మెట్ట పైర్లు, ఉద్యాన తోటలు ఉన్నాయి. విద్యుత్ పరికరాల కొరత లేదు గతంలో మాదిరిగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం వేచి చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో సంవత్సరానికి ఇన్ని మాత్రమే వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఇవ్వాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు అడిగిన వెంటనే కనెక్షన్లు ఇస్తున్నాం. సంస్థ స్టోర్స్‌లో విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ పరికరాల స్టాక్ ఉంది. దీంతో దరఖాస్తు చేసుకున్న సత్వరమే కనెక్షన్లు ఇచ్చే వీలు కలుగుతోంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లు కూడా రెండు నెలల్లో ఏర్పాటు చేస్తాం. – వెంకటసుబ్బయ్య, ఎస్ఈ, ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ అప్పట్లో ఒక్క స్తంభానికే రూ.20 వేలు ఖర్చు చేశా ఇరవై ఏళ్ల క్రితం నా పొలానికి నీటి సౌకర్యం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ తీసుకున్నాను. నా పొలానికి దగ్గరగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇచ్చేందుకు అదనంగా ఒక విద్యుత్ స్తంభం కావాల్సి వచ్చింది. దీని కోసం అప్పట్లోనే రూ.20 వేలు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా 3 విద్యుత్ స్తంభాలు వేసి, లైన్ వేసి ఇస్తోంది. ఇది రైతు ప్రభుత్వమని చెప్పడానికి ఇదే ఉదాహరణ. – తోటపల్లి హరిబాబురెడ్డి, రైతు, పడుగుపాడు, కోవూరు మండలం సామాన్య రైతుకు ఎంతో ఉపయోగకరం వ్యవసాయ విద్యుత్ సర్వీ సు పొందే రైతులకు విద్యుత్ శాఖ ఉచితంగా రూ.22 వేలతో మూడు విద్యుత్ స్తంభాలు, 180 మీటర్ల విద్యుత్ లైన్ వైరు, కాసారాలు, ఇన్సులేటర్స్ ఉచితంగా అందజేస్తోంది. ఇది సామాన్య రైతుకు ఎంతో ఉపయోగంగా మారింది. రైతు పక్షపాతిగా ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలోని రైతులు అందరూ ఆనందంగా వారి పొలాలను సాగు చేసుకునే వీలుకలుగుతోంది. – కోటంరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రైతు, వెన్నవాడ, ఆత్మకూరు మండలం -
విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ల లింకు
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు మనోహర. ఇతనిది యల్లనూరు మండలం తిమ్మంపల్లి. ఇతని భార్య పేరు భవాని. వీరు తిమ్మంపల్లిలో తన తండ్రి పేరు బాల చిన్నయ్య పేరు మీద ఉన్న ఇంటిలో నివసిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించి విద్యుత్ కనెక్షన్ కూడా బాల చిన్నయ్య పేరు మీదే ఉంది. కాని భవాని పేరు మీదు అనంతపురం బళ్లారి బైపాస్ సబ్‌స్టేషన్ పరిధిలో ఒక కనెక్షన్, ఆర్ట్స్ కళాశాల సబ్‌స్టేషన్ పరిధిలో రెండు కనెక్షన్లు ఉన్నట్లు తేలింది. అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలో చాలామందికి అమ్మఒడి పథకం, రేషన్ కార్డులు, పింఛన్లకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో నయా దందా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ కనెక్షన్ లేకుండా కేవలం ఇతరుల ఆధార్‌కార్డులతో కొంతమంది లబ్ధి పొందుతున్న విషయం బయటపడింది. విద్యుత్ శాఖ పరిధిలో జిల్లా మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో లబ్ధిదారులు విద్యుత్ బిల్లుల కారణంగా రేషన్‌కార్డుల అనర్హుల జాబితాలో పేర్లు నమోదై ఉండడంతో వాటిని తొలగించుకునేందుకు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. అంతా తిరకాసు.. విద్యుత్ కనెక్షనే ఉండదు. కనీసం వారి పేరుతో మీటర్‌ను కూడా నమోదు చేసుకుని ఉండరు. అలాంటి వారి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉందని, మీరు వందల యూనిట్లు విద్యుత్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నారనే జాబితాల్లో నమోదవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఎవరికి అంతుచిక్కడమే లేదు. 2016–17 నుంచి విద్యుత్ కనెక్షన్లను పూర్తిగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే తగినంత రుసుము చెల్లించిన తరువాతనే మంజూరు చేస్తున్నారు. ఇంత తతంగం మధ్య అసలు దరఖాస్తు చేసుకోని వారి వివరాలు వాటిలో నమోదు కావడం ఎలా సాధ్యమైందో తెలియక తికమక పడుతున్నారు. ఆయా విద్యుత్ శాఖ కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులను వారి పూర్తి వివరాలను తీసుకుని సంబంధిత దరఖాస్తును వారి ద్వారా రాయించుకుని వాటిని ఆయా జాబితాలో నుంచి తొలగించేస్తున్నారు. తప్పెవరిది?.. ఇది ఇలా ఉండగా సంబంధిత జాబితాలను తాము చేయలేదని, ఆయా సచివాలయాల్లో ఉన్న వలంటీర్లే వాటిని చేసి ఉంటారని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఆన్లైన్లో నమోదైన వాటిని మాత్రమే అందిస్తున్నామని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఎవరి తప్పిదమో తెలియని తికమక పరిస్థితి నెలకొంది. ఆయా సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించడం ద్వారా అర్హులు, అనర్హులు పెద్ద ఎత్తున ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జాబితాలు ప్రదర్శించకపోతే ఆయా లబ్ధిదారుల పేర్లతోనే ఇవి కొనసాగుతూ ఉండేవి. ఈ నిర్లక్ష్యానికి ప్రధాన కారకులు ఎవరేనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. సమస్యలు పరిష్కరిస్తున్నాం ఇతరుల పేరుతో ఉన్న మీటర్ తమ పేరుపై చూపుతోందని నాలుగు రోజుల నుంచి రోజూ 500 మందికిపైగా పవర్ ఆఫీస్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నాం. 2016 నుంచి విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించి పూర్తిగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. కర్నూలు జిల్లాకు చెందిన కొలిమిగుండ్ల వాసికి అనంతలో కనెక్షన్ ఉందని తేలింది. దీంతో అతను అనంతకు వచ్చి తన పేరును తొలగించుకున్నాడు. ప్రస్తుతం వచ్చిన లబ్ధిదారులకు సత్వరమే సమస్యను పరిష్కరిస్తున్నాం.– మొహమ్మది, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అనంతపురం -
అదనపు లోడ్ పేరుతో ఛార్జీల వాత
-
కొత్త రకం కరెంట్ 'షాక్'
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ తన ఇంటికి 2002లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. అప్పుడున్న ఉపకరణాల ప్రకారం ఆయన ఇంటికి ఒక కిలోవాట్ విద్యుత్ లోడు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. కూలర్లు, ఫ్రిజ్, మోటార్.. ఇలా క్రమంగా అనేక ఉపకరణాలు ఇంట్లో చేరాయి. దీంతో కరెంట్ బిల్లు అనేక రెట్లు పెరిగింది. అయితే, ఇప్పుడు విద్యుత్ అధికారులొచ్చి.. నీ వాడకం లోడ్ మూడు కిలో వాట్లు దాటిందంటున్నారు. నెల రోజుల్లో రూ.1800 అపరాధ రుసుం కట్టాలని చెప్పారు. లేకుంటే రూ.10 వేలకు పైగా ఫైన్ తప్పదని హెచ్చరించారు. తిరుపతి పట్టణం తిరుచానూరులోని సంజయ్ ఇంటికి 2001లో విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అప్పట్లో నెలకు రూ.50 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.700 వరకూ వస్తోంది. లోడ్ నాలుగు రెట్లు పెరిగిందని అధికారులు అంటున్నారు. కిలోవాట్‌కు రూ.600 చొప్పున.. 4 రెట్లు జరిమానా కట్టాలని తెలిపారు. లేదంటే నెల తర్వాత ఫైన్ తప్పదని హెచ్చరించారట. .. ఈ ఇద్దరే కాదు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల విద్యుత్ వినియోగదారులకు ఇదే షాక్. అదనపు లోడ్ పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ వసూళ్లకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి కూడా లభించింది. దీంతో అదనపు లోడ్‌ను బలవంతంగా వసూలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించబోతున్నారు. నెల రోజుల వ్యవధిలో ప్రస్తుత లోడ్‌ను వినియోగదారులే స్వచ్ఛందంగా ప్రకటించాలని.. లేనిపక్షంలో గడువు ముగిశాక, తనిఖీలు చేసి, భారీగా జరిమానాలు విధించే వీలుందని చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రతీ విద్యుత్ వినియోగదారుడు ఉన్నట్టుండి అదనంగా రూ.1200 నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 48 లక్షల మంది పేదలకు సగటున రూ.600 వరకూ భారంపడే వీలుంది. ఏంటీ అదనపు లోడ్? చాలామంది విద్యుత్ వినియోగదారులు రెండు దశాబ్దాల క్రితమే కరెంట్ కనెక్షన్లు తీసుకున్నారు. అప్పట్లో మహా అయితే నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, చిన్నాచితకా విద్యుత్ ఉపకరణాలుండేవి. ఒక బల్బు 100 వాట్లు.. ఫ్యాన్ 70 వాట్లు.. ఇతర ఉపకరణాలన్నీ కలుపుకున్నా మొత్తం వాడకం 500 వాట్ల కన్నా ఎక్కువ ఉండదు. వీటిని పరిగణలోనికి తీసుకుని ఆ ఇంటికి విద్యుత్ లోడ్ ఒక కిలోవాట్ (వెయ్యి వాల్టులు) ఉంటుందని లెక్కగట్టారు. కాలక్రమంలో ఫ్రిజ్, మిక్సీ, కుక్కర్, వాషింగ్ మిషన్, వాటర్ హీటర్, గీజర్, ఏసీ, 1 హెచ్‌పి మోటర్.. ఇలా అనేకం ఇంట్లో చేరాయి. నిజానికి ఇవన్నీ వాడటంవల్ల ప్రతీనెలా కరెంట్ బిల్లూ పెరుగుతోంది. కరెంట్ వాడకం పెరిగే కొద్దీ శ్లాబుల పేరుతో బిల్లూ పెరుగుతుంది. అంతిమంగా సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా నెలకు రూ. 500పైన కరెంట్ బిల్లు రావడం మామూలైంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. వాడే ప్రతీ ఉపకరణాన్ని పరిగణలోనికి తీసుకుని లోడ్‌ను లెక్కిస్తున్నారు. మీరు కనెక్షన్ తీసుకున్నప్పుడు కిలోవాట్ లోడ్‌కే అనుమతి తీసుకున్నారని, ఇప్పుడు నాలుగు కిలోవాట్ల లోడ్ వాడుతున్నారని అధికారులు అంటున్నారు. ఇది విద్యుత్ చట్టానికి వ్యతిరేకమని.. దీనికి జరిమానా చెల్లించాలనేది విద్యుత్ పంపిణీ సంస్థల వాదన. ఇదే విషయాన్ని ఏపీఈఆర్సీ ముందూ విన్పించి అనుమతి తీసుకున్నారు. బిల్లు కట్టినా.. నేరస్తులేనా? విద్యుత్ వినియోగదారుడు ప్రతీనెలా వాడుకునే కరెంట్‌కు బిల్లు చెల్లిస్తున్నాడు. అతనికి అది మాత్రమే తెలుసు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు లోడ్ ఎంత? ఇప్పుడెంత పెరిగిందనేది ఎవరికీ తెలియదు. వాడకం పెరిగింది. బిల్లు పెరిగింది. అదే కట్టామని వినియోగదారులు అంటున్నారు. ఇంకా ఈ లోడ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఉన్నట్టుండి అదనపు లోడ్ అంటూ విరుచుకుపడటంతో వినియోగదారులు విస్తుబోతున్నారు. స్మార్ట్ మీటర్‌తో ఇట్టే పట్టేస్తారు.. ప్రస్తుతం గృహ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తున్నారు. దానిని మీటర్ స్క్రీన్కు చూపిస్తే బిల్లు జనరేట్ అవుతోంది. నెల రోజుల్లో ఎక్కువ లోడ్ ఎప్పుడు వినియోగించుకుంటే దాన్నే పరిగణనలోకి తీసుకుని అదనపు లోడ్‌ను నిర్ణయించనున్నారు. నెలలో ఏ ఒక్క రోజైనా తాము తీసుకున్న ఒక కిలోవాట్ లోడ్ కన్నా అదనపు లోడ్‌తో విద్యుత్‌ను వినియోగించుకుంటే అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుందని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 1.25 కోట్ల గృహ వినియోగదారులకు సరాసరి ఒక కిలోవాట్ చొప్పున అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించినా కిలోవాట్‌కు రూ.600 చొప్పున రూ.750కోట్లు విద్యుత్ సంస్థలకు ఆదాయం రానుంది. -
మరుగుదొడ్లు నిర్మించుకోవడం లేదని..
అడ్డాకుల (దేవరకద్ర): మండలంలోని గుడిబండలో గురువారం అధికారులు పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావు, స్థానిక సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి యశోద, అంగన్వాడీ, ఆశలు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ నిర్మాణాలు మొదలుపెట్టని వారిని కలిశారు. నిర్మాణాలు మొదలు పెట్టి మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీఓ సూచించారు. నిర్మాణాలు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ల ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. మొండికేసిన వారి ఇళ్లకు విద్యుత్ శాఖ సిబ్బందితో కరెంటు కనెక్షన్లను తొలగింపజేశారు. నిర్మాణాలు పూర్తిచేసిన 5 మంది లబ్ధిదారులకు పంచాయతీ కార్యాలయం వద్ద చెక్కులను అందజేశారు. మూడు రోజుల్లో గ్రామంలో నిర్మాణాలు పూర్తి కావాలని ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావు సూచించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. -
చేయి తడపాల్సిందే..!
నారాయణపేట : నారాయణపేట ట్రాన్స్‌కో పరిధిలో కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో రైతులు, వినయోగదారులు నష్టాలపాలవుతున్నారు. తాజాగా ఓ నిరుపేద రైతుకు ప్రభుత్వం అందించిన నాలుగు విద్యుత్ స్తంభాల్లో మూడు స్తంభాలను తిరిగి తీసుకెళ్లారు. స్తంభానికి రూ.5వేలచొప్పున డీడీ నారాయణపేట మండలం జలాల్‌పూర్‌కు చెందిన కుర్వ బుగ్గప్ప తన పొలానికి విద్యుత్ స్తంభాలు, తీగలను ఏర్పాటు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.5వేలకు పైగా డీడీని కట్టారు. జనవరి 22న కుర్వ బుగ్గప్ప పొలంలో కాంట్రాక్టర్ కతల్అహ్మాద్ నాలుగు స్తంభాలు పాతి రైతుతో పాతినట్లు సంతకాలు చేయించుకున్నారు. విద్యుత్ తీగలు అమర్చేందుకు బేరం విద్యుత్ తీగలు అమర్చేందుకు రూ.15 వేలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. బేరసారాలతో రూ. 7,500 వరకు చెల్లించేందుకు రైతు ముందుకొచ్చారు. సంబంధిత కాంట్రాక్టర్ పాతిన నాలుగు స్తంభాల్లో మూడు స్తంభాలను వారం రోజుల క్రితం తిరిగి తీసుకెళ్లారు. ఈ విషయంపై రైతు బుగ్గప్ప పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్‌తో ప్రాదేయపడిన ఫలితం లేకుండా పోయింది. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు వెంకోభతో కలిసి ట్రాన్స్‌కో డీఈ చంద్రమౌలికి ఈనెల7న ఫిర్యాదు చేశారు. ఈమేరకు రైతు పొలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో కాంట్రాక్టర్‌తో మాట్లాడి స్తంభాలు ఏర్పాటు చేయిస్తానని డీఈ హామీ ఇచ్చివెళ్లారు. మరెందరో రైతులు ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ డీడీలు పట్టుకొని చెప్పులు అరిగేలా తిరుగుతున్న పరిస్థితి నారాయణపేటలో కొనసాగుతుందని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఇక ఆంక్షల్లేని ఉచిత కరెంట్!
-
ఇక ఆంక్షల్లేని ఉచిత కరెంట్!
విద్యుత్ కనెక్షన్ల సంఖ్య, పొలం విస్తీర్ణంపై నిబంధనలు తొలగింపు సాక్షి, హైదరాబాద్: పెద్ద, చిన్న రైతులు తేడా లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. అవసరమై నన్ని ఉచిత కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయిం చాయి. ఈ మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేయాలం టూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుతం.. మెట్ట భూమి రైతులకు మూడుకు మించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని, 2.5 ఎకరాల్లోపు మాగాణి ఉన్న రైతులే ఉచిత విద్యుత్‌కు అర్హులనే నిబంధ నలున్నాయి. ఇకపై మెట్ట, మాగాణి భూముల రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా విద్యుత్ కనెక్షన్లు జారీ చేసేందుకు... విద్యుత్ కనెక్షన్ల సంఖ్య, భూవిస్తీర్ణం ఆంక్షలను ఎత్తివేయాలని డిస్కంలు కోరాయి. అయితే కార్పొరేట్ రైతులు ఉచిత విద్యుత్‌కు అనర్హులన్న నిబంధనలో మార్పు ఉండదని పేర్కొన్నాయి. ఇక పాలీహౌస్/గ్రీన్హౌస్లలో పంటల సాగుకు సైతం ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలంటూ మరో ముఖ్య ప్రతిపాదన చేశాయి. చార్జీల పెంపు లేనట్లే! రాష్ట్రంలో గతేడాది (2016–17)లో అమలు చేసిన విద్యుత్ చార్జీలనే ఈ ఏడాది (2017–18) కూడా కొనసాగించాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయి. ఈ మేరకు డిస్కంల తరఫున దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ఏడాది విద్యుత్ చార్జీలు పెంచబోమని శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా డిస్కంలు ఈ ప్రతిపాదన చేశాయి. గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక తదితర అన్ని కేటగిరీల వినియోగదారులకు ఎలాంటి చార్జీల పెంపును ప్రతిపాదించలేదని రఘుమారెడ్డి తెలిపారు. ఇక ప్రస్తుతం మూడు కన్నా ఎక్కువ విద్యుత్ కనెక్షన్లున్న మెట్ట రైతులు.. అదనపు కనెక్షన్లకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి వస్తోందని, 2.5 ఎకరాలకు మించి మాగాణి ఉన్న రైతులు కూడా బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఇకపై ఎంత భూమి ఉన్నా, ఎన్ని విద్యుత్ కనెక్షన్లకు అయినా ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని ప్రతిపాదించామని వెల్లడించారు. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యథాతథంగా అమలు చేస్తే డిస్కంలు ఎదుర్కునే ఆర్థిక లోటుపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుందని... లోటును అధిగమించేం దుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఆర్సీ నిర్ణయం ఎలా ఉంటుందో? విద్యుత్ చార్జీలు పెంచవద్దని డిస్కంలు ప్రతిపాదించినా నిర్ణయాధికారం మాత్రం ఈఆర్సీ చేతిలో ఉంది. వాస్తవానికి గతేడాది నవంబర్‌లోగా సమర్పించాల్సిన టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పుడు సమర్పించాయి. జాప్యంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన ఈఆర్సీ.. సుమోటోగా కొత్త టారిఫ్ ఖరారు ప్రక్రియను చేపట్టింది. డిస్కంల ఆర్థిక స్థితి, ప్రభుత్వం అందించే విద్యుత్ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుని.. విద్యుత్ చార్జీలు పెంచాలా.. వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. చార్జీల పెంపు వద్దన్న డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తే.. ఏయే కేటగిరీల వినియోగదారులకు ఎంత పెంచాలన్న అంశా న్ని ఈఆర్సీయే ఖరారు చేయనుంది. -
విద్యుత్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
త్రిపురారం (నల్లగొండ) : కట్ చేసిన విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని త్రిపురారం మండలం రైతులు శుక్రవారం మండల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. బిల్లులు చెల్లించలేదని సత్యనారయణపురం, పనసాయి క్యాంప్, ఇండ్లకోటయ్యగూడెం, నారమ్మగూడకు చెందిన రైతుల విద్యుత్ కనెక్షన్లకు ఉన్న జంపర్లను తొలగించారు. ఎలాంటి హెచ్చరిక లేకండా విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. -
16 వేల మందిపై ఎఫ్ఐఆర్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చోరీ శృతిమించుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా విద్యుత్ ను ఏదో రకంగా అపరిస్తూనే ఉన్నారు. తాజాగా పదహారు వేల మంది దొంగ కలెక్షన్లతో విద్యుత్ వాడుతున్న ఘటన వెలుగు చూసింది. ఇంతటీ భారీ సంఖ్యలో విద్యుత్ చోరీ నమోదు కావడంతో రాష్ట్ర సర్కారులో ఆందోళన నెలకొంది. జనవరి 12వ తేదీన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విద్యుత్ చోరీకి సంబంధించి సమీక్ష నిర్వహించి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన విద్యుత్ అధికారులకు విస్తుగొలిపే విషయాలు కంటబడ్డాయి. అధికశాతంలో విద్యుత్ కలెక్షన్లు దుర్వినియోగం కావడంతో అందుకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే పదహారు వేల మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. యూపీ ప్రభుత్వం తాజాగా లక్షా 13 వేల కలెక్షన్లను మాత్రమే మంజూరు చేస్తే.. ఎటువంటి అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లు ఉన్న సంఖ్య 16 వేలకు పైగానే ఉండటంతో వారిపై ప్రాధమిక దర్యాప్తు చేపట్టనున్నారు. -
విద్యుత్తు అక్రమ కనెక్షన్లపై కొరడా
మధుర: అక్టోబర్ నెల నుంచి 24 గంటలు విద్యుత్తు సరఫరా ఇచ్చే దిశగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇందుకోసం అక్రమ కనెక్షన్లను తొలగించిందేందుకు జిల్లా యంత్రాగాలు కార్యచరణను రూపొందించాయి. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకూ 27 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా గ్రామాల్లో 21బృందాలు, పట్టణాలలో 7 బృందాలు విద్యుత్తు అక్రమంగా వినియోగాన్ని నివారించి, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమస్యపై ప్రజల్లో అవగహన కల్పించేందుకు చాలా ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కొత్త కనెక్షన్లు తీసుకునేవారు కచ్చితంగా ధ్రువీకరణపత్రంతో పాటు ఇంటి యజమాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు.పాత మీటర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మీటర్లను అమర్చుతామని చెప్పారు. -
కొత్త కనెక్షన్లకు బ్రేక్
కరీంనగర్ అర్బన్ : వ్యవసాయ పంపుసెట్లకు నూతన విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం నిలిపివేసింది. దరఖాస్తు చేసుకుని కొద్ది నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు రేపో మాపో కనెక్షన్ వస్తుందనే ఆశతో ఉండగా... ప్రభుత్వ నిర్ణయం వారిలో తీవ్ర నిరాశ నింపింది. నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జిల్లాలోని వివిధ డివిజన్లలో 3101 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి, మంథని, హుస్నాబాద్, హుజూరాబాద్ డివిజన్లలో అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రబీ సీజన్ మొదలు కావడంతో తమకు ఎలాగైనా విద్యుత్ కనెక్షన్ మంజూరవుతుందనే ధీమాతో పలువురు రైతులు సాగుకు సిద్ధమయ్యారు. కనెక్షన్ ఇవ్వాలని కొద్ది రోజులుగా విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంజూరు కోసం చెల్లించాల్సిన డబ్బును కూడా సమకూర్చుకున్నారు. అక్రమ కనెక్షన్లవైపు చూపు కరెంటు కొరత దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో నూతన కనెక్షన్లు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్‌శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో 3 వేల మంది రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రబీ సీజన్ పూర్తయ్యే వరకు కొత్త కనెక్షన్లు లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో కనెక్షన్ ఎలాగూ మంజూరవుతుందనే ధీమాతో పంటలు సాగు చేసుకున్న రైతులు ఇప్పుడు వాటిని కాపాడుకునేందుకు అక్రమ కనెక్షన్లవైపు దృష్టి సారిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లోనే పలువురు రైతులు అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని పంటలు కాపాడుకునే యత్నం చేశారు. కానీ, కరెంటు కోతలు, వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కూడా మళ్లీ అక్రమ కనెక్షన్లవైపు దృష్టి సారిస్తుండడంతో లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని ట్రాన్స్‌కో అధికారులు అభిప్రాయపడుతున్నారు. డీడీ వద్దన్నారు కొత్త ట్రాన్స్ఫార్మర్కు డీడీ కట్టేందుకు వెళ్లా. ఇప్పుడు తీసుకోవడం లేదని తర్వాత రమ్మని చెప్పిండ్రు. పంట చేతికొచ్చి డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే మళ్లా ఎప్పుడు తీసుకుంటం. వెంటనే కనెక్షన్ ఇస్తే బాగుండు. - నారాయణ, కొయ్యూర్ పేర్లు నమోదు చేసుకుంటున్నం డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో తాత్కాలికంగా కొత్త కరెంట్ కనెక్షన్లకు దరఖాస్తు తీసుకోవడంలేదు. కనెక్షన్ కావాలని వచ్చే వారి పేరు మాత్రం నమోదు చేసుకుంటున్నం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం. - మాధవరావు, డీఈఈ, ఎన్పీడీసీఎల్ మంథని -
ఉచిత కనెక్షన్లు 50 వేలే ?
ఏపీలో లక్ష మంది రైతులకు నిరాశ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది కొత్తగా 50 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,50,000 మంది రైతులు ఉచిత కనెక్షన్ల కోసం ఎదురుచూస్తుంటే.. సబ్సిడీ భారం పేరిట ప్రభుత్వం రకరకాల వడపోతల తర్వాత కేవలం 50 వేలమందికి మాత్రమే కనెక్షన్లు మం జూరు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు పంపా యి. మరోవైపు కనెక్షన్లన్నిటికీ మీటర్లు తప్పనిసరి చేయడంతో పాటు గృహ, వ్యవసాయ కనెక్షన్లను విడిదీసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అందువల్ల ఈ ప్రక్రియ పూర్తయితే కానీ మంజూరు చేసే 50 వేల కనెక్షన్లు సైతం రైతులకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. వినియోగం తగ్గాకేనా..? రాష్ట్రంలో మొత్తం 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు అధికారికంగా పనిచేస్తున్నాయి. అయితే రోజుకు 25 నుంచి 35 మిలియన్ యూనిట్ల విద్యు త్ వినియోగమవుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. 8 వేల మందికి సోలార్ పంపుసెట్లు మరోవైపు నిరంతర విద్యుత్ పథకం ఒప్పందాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 8 వేల సోలార్ పంపుసెట్లను మంజూరు చేసింది. వీటి పంపిణీకి కసరత్తు జరుగుతోంది. -
సారీ.. ఆగాల్సిందే!
సాక్షి, మహబూబ్‌నగర్: వర్షాలు సరిగా కురియకపోవడంతో కనీసం బోరు నీటితోనైనా వ్యవసాయం చేసుకుందామని భావించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా అప్పులుచేసి బోరువేసుకుంటున్న అన్నదాతకు విద్యుత్ కనెక్షన్లు పొందడం గగనమైపోయింది. జిల్లాలో చాలా మండలాల్లో రైతుల చేత డీడీలు కట్టించుకుని ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వకుండా విద్యుత్‌శాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడుఅప్పుడు అంటూ రైతులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారు. అంతేకాదు తమ ఆవేదన చెప్పుకొంటే చులక నగా చూస్తున్నారని వారు వాపోతున్నారు. ఇలా జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు ఏటా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 28,351 దరఖాస్తులు పెండిగ్లో ఉన్నట్లు అంచనా. జిల్లాలో అధికారికంగా 2,19,990 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా వ్యవసాయ కనెక్షన్ల కోసం 28,351 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎస్టీలకు సంబంధించి 3,836 ఉండగా, ఎస్సీలకు సంబంధించిన 2,302 దరఖాస్తులు మూలకుపడ్డాయి. జిల్లాలో అత్యధికంగా మద్దూరు మండలంలో 1246 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ధరూరులో 1102, వీపనగండ్లలో 902 దరఖాస్తులకు అతీగతిలేకుండా పోయింది. అయితే విద్యుత్‌శాఖ అధికారులు మాత్రం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు. నీటి సౌకర్యం లేక..! జిల్లాలో మక్తల్, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యం ఉంది. కానీ కల్వకుర్తి, అచ్చంపేట, నారాయణపేట, షాద్‌నగర్, కొడంగల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల రైతులు ప్రధానంగా బోరుబావులపైనే ఆధారపడి పంటలు చేస్తుంటారు. ఈ ప్రాంత రైతులు అప్పోసప్పోచేసి బోర్లు వేసుకుని కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలను సాగుచేస్తారు. పాడి పశువులకు అవసరమయ్యే పచ్చిమేతను బోర్లకిందే సాగుచేస్తారు. అయితే విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి కావడంతో ట్రాన్స్‌కో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. డీడీలు కట్టాలని చెప్పిన అధికారులు, వాటిని తీసుకెళ్తే తమవైపు చూడడం లేదని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి బోర్లు వేసుకున్నాం నాకున్న మూడెకరాల పొలంలో ఏడాది క్రితం బోరు వేసుకున్నాను. నీళ్లు పడ్డాయి కానీ విద్యుత్ కనెక్షన్ లే దు. కనెక్షన్ ఇవ్వాలంటే వ్యవసాయబోరుకు రూ.5450 డీడీ కట్టమని విద్యుత్ అధికారులు సూచించారు. దీంతో వెంటనే డీడీ కట్టినా.. కనెక్షన్ ఇవ్వలేదు. నాతో పాటు మరో నలుగురు డీడీలు కట్టారు. అందరికి కలిపి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని ఏడాది కాలంగా అధికారులు తిప్పుకుంటున్నారు. - కడేల భీమప్ప, రైతు, చింతల్‌దిన్నె, మద్దూరు మండలం ఏళ్ల తరబడిగా తిప్పుకుంటున్నారు నాకు ఐదెకరాల పొలం ఉంది. 2008 మార్చిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.5850 డీడీ చెల్లించాను. అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు. పనులు వదులుకుని నిత్యం తిప్పుకుంటున్నారే తప్ప నేటికీ ఇవ్వలేదు. - వెంకట్‌రెడ్డి, పాతపాలెం, ధరూరు మండలం తిరిగి తిరిగి వేసారిపోయా.. 2008లో ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.5850 డీడీలు చెల్లించాం. మేము తీసుకుపోకుండానే మా పేర వచ్చిన ట్రాన్స్ఫార్మర్ను ఎ వరో తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. గత్యంతరం లేక మేము ప్రైవేటుగా రూ.80వేలు చెల్లించి తెచ్చుకున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయినం.. - చాంద్‌పాష, పాతపాలెం, ధరూరు మండలం -
కరెంటోళ్లొస్తే నిర్బంధించండి
కరీంనగర్ సిటీ : పంచాయతీల విద్యుత్ కనెక్షన్లు తొలగించడాని కి విద్యుత్ సిబ్బంది వస్తే గ్రామాల్లోనే నిర్బంధించాలని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ సర్పంచ్‌లకు సూచించారు. బకాయిలను ప్ర భుత్వమే భరించాల్సి ఉంటుందని, గ్రామ పంచాయతీల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ బిల్లులు చెల్లిం చొద్దని పేర్కొన్నారు. విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే భరించాలంటూ శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ, డీఆర్వోకు సర్పంచ్ల సంఘం తరపున వినతిపత్రం అందించారు. అంతకుముందు నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కేరళ తరహాలో పంచాయతీలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు సంబరపడుతున్న సర్పంచ్‌లకు విద్యుత్ బకాయిలు పంచాయతీలే చెల్లించాలన్న వార్త షాక్‌కు గురిచేసిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా ఆదేశించలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాలు చీకటిమయంగా మారాయన్నారు. బకాయిల పేరిట ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే 800కు పైగా పంచాయతీలకు కనెక్షన్లు తొలగించారని ఆరోపించారు. 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధుల నుంచి 25 శాతం బకాయిలు చెల్లించాలనే డీపీవో సర్క్యులర్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల జోలికొస్తే సహించేది లేదని, అవసరమైతే కలెక్టరేట్, సెక్రెటేరియేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామ జనా భా వారీగా తలసరి గ్రాంటు రూ.100కు పెంచాలని, పంచాయతీల తీర్మానాల మేరకే ఎమ్మెల్యే, ఎంపీలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని, మరణించిన సర్పంచుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషి యో, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రతిసర్పంచ్కు ఉచిత సిమ్‌కార్డు ఇచ్చి, గ్రూప్ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. మేజర్ సర్పంచ్‌లకు రూ.20వేలు, మైనర్ సర్పంచ్‌లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. సర్పం చ్‌లకు శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం కేటాయించిన 20 గుంటల స్థలంలో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించాలన్నారు. సమావేశంలో సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఉప్పుల అంజనీప్రసాద్, సుల్తానాబాద్, కరీంనగర్, గంగాధర మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్, బేతి సుధాకర్‌రెడ్డి, వైద రామానుజం, సర్పంచ్‌లు నందెల్లి పద్మ, శ్రీగిరి రంగారావు, టి.శ్రీనివాస్‌రావు, ఇందిర రాజేశం, అనితారెడ్డి, ఎన్నం కిషన్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ ఉత్తుత్తిదే
నెల్లూరు(హరనాథపురం): రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇళ్ల కు 24 గంటల విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పాడైన ట్రాన్స్ఫార్మర్లకు 24 గంటల్లో మరమ్మతులు... ఇవి టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు. జిల్లాలో వాస్తవ పరిస్థితి ఏమిటంటే విద్యుత్ కోసం ఎండల్లో ఎం డుతూ, రాత్రుళ్లు కటిక చీకట్లో చేల ల్లోనే గంటల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో 1.38 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి రైతులకు ఇచ్చిన ఫ్రీ సర్వీసులకు నెలకు రూ.30 వంతున యూజర్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లించే మోతుబరి రైతులకు ఇచ్చిన 2000 వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్‌కు రూ.4.50 వంతున వసూలు చేస్తున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నెలకు రూ.25 కోట్ల రాయితీని భరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టీడీపీ హామీలు ఇచ్చినట్లు జిల్లాలో తొమ్మిది గంటల విద్యుత్ అమలు కావడం లేదు. ఏడు గంటల విద్యుత్ సరఫరాలో నిరవధికంగా మూడు గంటలు కూడా అమలు కావడం లేదు. జిల్లాలో సబ్స్టేషన్ల వారీగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను నాలుగు గ్రూపులుగా విభజించిన అధికారులు సరఫరా వేళలను మార్చారు. ‘ఎ’ గ్రూపునకు రాత్రి 11.15 నుంచి 4.15 గంటల వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 వర కు, బీ గ్రూపునకు ఉదయం 4.55 నుంచి 9.15 వరకు, రాత్రి 11.15 నుంచి 1.15 వరకు, సీ గ్రూపునకు రాత్రి 9.15 నుంచి 2. 15 వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 3.15 వరకు, డీ గ్రూపునకు మధ్యాహ్నం 2.10 నుంచి 7.10 వరకు, రాత్రి 3.15 నుంచి 5.15 వరకు విద్యుత్ సరఫరా వేళలుగా నిర్ణయించారు. అయితే ఆచరణలో ఎక్కడా అ మలు కావడం లేదు. చంద్రబాబు పాలన వ చ్చి నెల గడుస్తున్నా 9 గంటల విద్యుత్‌కు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలు, వడగాలుల నేపథ్యంలో ఉ దయం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. తప్పని ఇక్కట్లు: రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉంటుం దని, కోతలు తగ్గుతాయని భావిస్తే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. విద్యుత్ కోతల తో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు భయాందోళనలో ఉన్నారు. ఉదయగిరి, విం జమూరు, కలిగిరి, పొదలకూరు, రాపూరు తదితర మండలాల రైతులు వ్యవసాయ వి ద్యుత్‌పై ఆధారపడి అరటి, బత్తాయి, పత్తి, కూరగాయలు, తదితర పంటలు సాగు చేస్తు న్నారు. డెల్టాలోనూ కొంత మేర చెరుకు, వరి పంట బోర్ల కిందే సాగుచేస్తున్నారు. ప్రస్తు తం కోతల నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి నా 24 గంటల్లో మార్చేస్తామన్న ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. ఫీజులు దెబ్బతిన్నా, గాలులకు తీగలు తెగిపడినా సిబ్బంది స్పందించడం లేదు. ప్రభుత్వం స్పందించి సమస్యలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
పంచాయతీలకు షాక్
పంచాయతీలకు సంబంధించి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ముక్కు పిండి వసూలు చేసేందుకు ఆ శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే నిధులు లేక నీరసించిన స్థానిక సంస్థల మెడకు ఇది గుదిబండగా మారనుంది. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోని పక్షంలో జిల్లాలోని వందలాది పంచాయతీల్లో చీకట్లు అలుముకోనున్నాయి. మరోవైపు మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌లోనూ అదే పరిస్థితి నెలకొననుంది. నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : జిల్లాలో 40 మేజర్, 900 మైనర్ గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీ వీధిదీపాలు, మంచినీటి పథకాల నిర్వహణకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యుత్ బిల్లులను ఐదేళ్ల క్రితం వరకు పంచాయతీల తరఫున ప్రభుత్వమే చెల్లించేది. అనంతరం ఆ బాధ్యతను పాలకమండళ్లకే వదిలేసింది. మొదట్లో కొంతకాలం బిల్లులను సక్రమంగా చెల్లించినా చాలా పంచాయతీలు తర్వాత కట్టడం మానేశాయి. ఎప్పటికైనా ప్రభుత్వం చెల్లించికపోతుందా..అనే ధీమాతోనే బకాయిలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా బకాయిలు రూ.45.22 కోట్లకు చేరుకున్నాయి. వీటి వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే సరఫరా అయినా నిలిపేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి విద్యుత్ శాఖ అధికారులు సూచించినట్లు సమాచారం. ఇదే జరిగితే జిల్లాలోని అనేక గ్రామాలు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం నెలకొంది. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు వీధిలైట్లు వెలగక వీధులు చిమ్మచీకట్లో చిక్కుకోనున్నాయి. మరోవైపు ఇప్పటికప్పుడు ఈ బిల్లులు చెల్లించే పరిస్థితిలో కూడా పంచాయతీలు లేవు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు ప్రభుత్వం నుంచి పలు రకాల నిధుల విడుదల నిలిచిపోయింది. కొన్ని నెలల క్రితం ఏర్పడిన పాలకవర్గాలు ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెడుతున్నాయి. ఈ సమయంలోనే విద్యుత్ బకాయిల సమస్య సర్పంచ్‌లకు పెద్ద సవాల్‌గా మారింది. కాలిపోయిన మోటార్ల మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు నూతన ప్రభుత్వ సహకారం కోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి. అన్ని స్థానిక సంస్థలది అదే పరిస్థితి పంచాయతీలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా విద్యుత్ బకాయిల సమస్యను ఎదుర్కొంటున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ ఇప్పటికే రూ.21.4 కోట్ల బకాయి పడడంతో పదిహేను రోజుల క్రితం కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. వెంటనే స్పందించకుంటే వీధిలైట్లు, మంచినీటి పథకాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. మరోవైపు మున్సిపాలిటీలు కూడా విద్యుత్ శాఖకు రూ.2.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2009 నుంచి పెండింగ్ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిల చెల్లింపు 2009 నుంచి నిలిచిపోయింది. అంతకుముందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ జీఓ విడుదల చేశారు. పంచాయతీలను విద్యుత్ బిల్లుల నుంచి మినహాయించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా 2009 వరకు ప్రభుత్వమే విద్యుత్ బిల్లులను చెల్లించేది. మహానేత మరణానంతరం అధికారం చేపట్టిన వారు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పంచాయతీలకు భారం పెరిగిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు వరకు సీఎంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి బకాయిలు చెల్లిస్తామని, బిల్లులను ప్రభుత్వమే కట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఒక్క రూపాయి విదల్చలేదు. త్వరలో ఏర్పడబోతున్న ప్రభుత్వమైనా ఈ విషయంలో తగిన నిర్ణయం వెంటనే తీసుకోవాలని పంచాయతీ పాలకమండళ్లు కోరుతున్నాయి. -
సీనియారిటీ ప్రకారమే వ్యవసాయ కనెక్షన్లు
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల సీనియారిటీ ఆధారంగా సర్వీసులు విడుదల చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టరు రిజ్వీ అన్నారు. మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్లో కర్నూలు జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు, రైతులకు కనెక్షన్లు మంజూరులో నిర్లక్ష్యం వీడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లతోపాటు సబ్సేషన్ల పర్యవేక్షణ, నిర్వాహణ ఎంతో ముఖ్యమన్నారు. బిల్లుల వసూలులో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతినెల వంద శాతం వసూలు చేయాలన్నారు. పాత బకాయిలను వసూలు చేయడంలో లక్ష్యాన్ని చేరాలని సూచించారు. కొత్తగా నిర్మించే సబ్స్టేషన్ల పనులు నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని, దీంతో లో ఓల్టేజీ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సీజీఎం నరసింహులు, ఎస్ఈ (ఆపరేషన్స్) టి. బసయ్య, కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ ఆపరేషన్స్ డీఈలు ఉమాపతి, తిరుపతిరావు, నరేంద్రకుమార్, ప్రభాకర్, టెక్నికల్ డిఈ నాగప్ప, కన్స్ట్రక్షన్ డీఈ చెంచన్న, ఎంఅండ్‌పీ డీఈ నారాయణ నాయక్, ఎస్ఏఓ సుబ్రహ్మణ్యం, కమర్షియల్, ఎంఅండ్‌పీ, స్టోర్స్ సెక్షన్ల ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు. -
అన్నదాతపై మరో పిడుగు
చీమకుర్తి, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టం అందకపోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటివాటితో సతమతమవుతున్న జిల్లా రైతాంగంపై విద్యుత్‌శాఖ మరో పిడుగు వేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై రైతుల నుంచి ఏకంగా గత తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలు వసూలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు రైతులకు నోటీసులు కూడా అందిస్తోంది. వేల రూపాయల్లో కస్టమర్ చార్జీలు చెల్లించాలంటూ ఒక్కసారిగా నోటీసులు అందించడంతో రైతులు గొల్లుమంటున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లుల బకాయిలను రద్దు చేశారు. అనంతరం నెలవారీగా తమ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు బిల్లులను రైతులు చెల్లించుకుంటున్నారు. అయితే, కస్టమర్ చార్జీలు మాత్రం చెల్లించడం లేదు. అప్పట్లో ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుండటంతో విద్యుత్ అధికారులు కూడా వారినుంచి కస్టమర్ చార్జీలు వసూలు చేసేందుకు చర్యలు చేపట్టలేదు. అయితే, కొంతమంది రైతులు మాత్రం ప్రతినెలా విద్యుత్ బిల్లులతో పాటు కస్టమర్ చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. అలా చెల్లించని రైతులను ఇప్పటి వరకూ ప్రశ్నించకుండా చూసీచూడనట్లు వ్యవహరించిన విద్యుత్ శాఖాధికారులు.. ఒక్కసారిగా తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలు వసూలు చేసేందుకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. గత రెండేళ్లుగా అప్పుడప్పుడూ రైతుల గృహాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులకు లింకుపెట్టి వారి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలను వసూలు చేశారు. అయితే, కొన్నిచోట్ల రైతుల నివాసాలు ఒక గ్రామంలో, పొలాల్లోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మరో గ్రామం పరిధిలో ఉంటుండటంతో పూర్తిస్థాయిలో వసూలు చేయడం కుదరలేదు. దీంతో తొమ్మిదేళ్లుగా కస్టమర్ చార్జీలు చెల్లించని రైతులందరికీ నోటీసులు అందజేసి వసూలు చేసేందుకు విద్యుత్‌శాఖాధికారులు చర్యలు చేపట్టారు. 2004 నుంచి నెలకు 20 రూపాయల చొప్పున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కస్టమర్ చార్జీలు విధిస్తూ నోటీసులు అందజేస్తున్నారు. దాని ప్రకారం ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలు 2,000 రూపాయలకుపైగా ఉన్నాయి. జిల్లాలో 1.15 లక్షల కనెక్షన్లకు రూ.6.76 కోట్లు... జిల్లాలో 1.15 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వాటికి సంబంధించి కస్టమర్ చార్జీల పెండింగ్ బకాయిలు 6.76 కోట్ల రూపాయలున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్ఈ తెలిపారు. చీమకుర్తి మండలంలోని 23 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీలో దాదాపు 3 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా, వాటికి సంబంధించిన కస్టమర్ చార్జీలు 30 లక్షల రూపాయల వరకూ ఉన్నాయి. వాటిని వసూలు చేసేందుకు చీమకుర్తి మండలంలో లైన్మన్లు శుక్రవారం రైతులకు నోటీసులు జారీ చేశారు. చీమకుర్తి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 1,449 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నుంచి 16 లక్షలు, మర్రిచెట్లపాలెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 1,600 వ్యవసాయ విద్యుత్ క నెక్షన్ల నుంచి 14 లక్షల రూపాయల వరకు కస్టమర్చార్జీలు వసూలు చేసేందుకు ఆ శాఖాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ మేరకు చండ్రపాడులో 100 మంది రైతులకు, పల్లామల్లిలో 200 మందికి, నేకునంబాద్లో 80 మంది రైతులకు శుక్రవారం లైన్మన్లు నోటీసులు జారీ చేశారు. కాగా, ఎప్పటికప్పుడు వసూలు చేయకుండా తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలను ఒకేసారి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంపై రైతులు మండిపడుతున్నారు. -
అమలుకు నోచుకోని పథకం
నిధులున్నాయి. వారి దరికి చేరవు. పథకాలుంటాయి ఆచరణలో పడకేస్తాయి. ఇదీ ఏళ్లుగడుస్తున్నా మారని బడుగువర్గాల బతుకులు. వారికోసం రూపొందించిన ఆర్జీజీవై (గ్రామీణ విద్యుద్దీకరణ యోజన) పథకం ఎందుకో తెలియని దుస్థితి. పాలకుల కరుణకు నోచుకోని దుర్గతి. అడవి తల్లి ఒడిలో విసిరేసినట్లున్న చెంచు గూడేలను ఇరవైనుంచి ఏభై వంతున ఒక చోటకు చేర్చి విద్యుద్దీకరణకు అనువుగా మార్చాలని కాగితాల్లో రాసుకున్నా ఆచరణలో చెల్లుచీటీ అవుతోంది. పాలమూరు, న్యూస్‌లైన్ : చెంచు గూడేల్లో చీకట్లు తొలగడం లేదు. తమ బతుకుల్లో వెలుగు నింపాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు వారు మొరపెట్టుకున్నా.. అది అరణ్య రోదనగానే మారుతోంది. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, బీసీ కాలనీలు, గిరిజన తండాలు చీకట్లోనుంచి వెలుతురులోకి రాలేకపోతున్నాయి. పాలకుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఆర్జీజీవై పథకానికి శాపమవుతోంది. ఆర్జీజీవై అమలులో భాగంగా.. విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన అంచనాల ప్రకారం జిల్లాలోని 936 గిరిజన తండాలు, ఎస్సీ, వెనుకబడిన తరగతుల కాలనీలు విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ.. గృహ వినియోగానికి ఇచ్చే కనెక్షన్లు కాకుండా వ్యవసాయ విద్యుత్ లైన్ (హెచ్‌టీ లైన్)ల నుంచి అనధికారింగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గిరిజనులు తండాలు, కాలనీల్లో ఏళ్లతరబడి చీకట్లోనే మగ్గుతున్నారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో నివసించే ప్రజలు రాత్రయిందంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. నిధులు కొరవడి... రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన (ఆర్జీజీవై) పథకాన్ని 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దారిద్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతోపాటు అన్ని గ్రామాలకు, ఆవాసాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇవ్వగా మిగిలిన 10 శాతం డిస్కమ్‌లు భరిస్తాయి. ఈ పథకాన్ని 2011 వరకు కొనసాగించాల్సి ఉండగా, మహానేత మరణానంతరం 2010 డిసెంబర్లో ఆర్జీజీవై పథకానికి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, జడ్చర్ల, నాగర్‌కర్నూల్ డివిజన్లకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ పథకం ద్వారా కేవలం 1,17,025 మంది లబ్ది పొందినట్లు రికార్డులే సాక్ష్యమిస్తున్నాయి. తండాలు...తంటాలు మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ విద్యుత్ డివిజన్లకు సంబంధించి చాలాచోట్ల విద్యుత్ సౌకర్యంలేక జనం ఇబ్బంది పడుతున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజక వర్గాలలోని చెంచుల పెంటలు చీకట్లోనే మగ్గుతున్నాయి. నల్లమల అడవుల్లోని కండ్లకుంట, గీచుగండి, పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, ఆగర్లపెంట, రాంపూర్, అప్పాపూర్, బౌరాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, సంగడిగుండాలు, తాటిగుండాలు, పందిబొర్రె తదితర చెంచుపెంటలకు కరెంటు సౌకర్యం అంటే ఏంటో తెలియదు. ఒక్కో దగ్గర 20 నుంచి 50 వరకు బొడ్డు గుడిసెలతో ఉండే పెంటలన్నింటినీ అప్పాపూర్ దగ్గరికి చేర్చి ఓ గ్రామంగా మార్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో ఆగిపోయింది. ఇటూ ఒక దగ్గరకు రాక... కరెంటు లేక వీరి పరిస్థితి ఆగమ్యగోచరమవుతోంది. రాత్రివేళ చెంచులు బొడ్డు గుడిసెలో కట్టెల మంటలు(నెగడు) పెట్టి కాలం వెల్లదీస్తున్నారు. -
సర్కారు దొంగదెబ్బ
ఉదయగిరి, న్యూస్‌లైన్ : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉచిత విద్యుత్‌ను దశలవారీగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనికి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి దశలవారీగా ‘ఉచితానికి’ మంగళం పాడేందుకు కుయుక్తులు పన్నుతోంది. ప్రపంచ బ్యాంకు తయారు చేసిన వ్యవసాయానికి నేరుగా నగదు బదిలీ అనే ముసాయిదా నివేదికకు రాష్ర్ట ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీన్ని అమలులోకి తెచ్చే ప్రయత్నం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అందులో భాగంగా రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తున్నారు. జిల్లాలోని ప్రస్తుతం జరుగుతున్న హెచ్డీవీఎస్ పనుల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తున్నారు. ప్రతి ట్రాన్స్ఫార్మర్కు మీటరు ఏర్పాటు చేస్తున్నారు. ఫీడర్‌కు కూడా మీటరు ఏర్పాటు చేసి ఆ వ్యవసాయ కనెక్షన్‌కు ఎంత మేర విద్యుత్ వినియోగం అవుతుందో లెక్క తేల్చేందుకు రీడింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులపై పెరగనున్న భారం ప్రస్తుతం జిల్లాలో 1.36 లక్షల వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. వీటికి విద్యుత్ మీటర్లు లేవు. కేవలం వినియోగ అంచనా ప్రకారం లెక్కించి ఆ మేరకు ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ ఇస్తోంది. ప్రస్తుతం 5 హార్స్ పవర్ మోటారు రోజుకు ఏడు గంటలు విద్యుత్ వినియోగిస్తే 5.25 యూనిట్లు విద్యుత్ కాలుతుందని అంచనా వేస్తున్నారు. ఏడాదికి 300 రోజులకు ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు 1,775 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తం సబ్సిడీని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు అందజేస్తూ వస్తోంది. అదే మీటర్ల ద్వారా రీడింగ్ లెక్కకట్టినట్లయితే కచ్చితంగా ఖర్చయిన రీడింగ్‌కు సబ్సిడీ చెల్లించడం ద్వారా కొంత లాభం ఉంటుంది. మరో విధంగా లాభపడేందుకు ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఖర్చవుతున్న యూనిట్లలో కొంత మేరకే తాము సబ్సిడీ భరిస్తామని, మిగతాది రైతు భరించాలనే వ్యూహంతో అడుగులు ముందుకేస్తోంది. ముందుగా రైతు వినియోగించిన యూనిట్ల మొత్తానికి విద్యుత్ సంస్థలకు బిల్లు చెల్లించాలి. అందులో సబ్సిడీని రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం నమ్మబలకనుంది. పథకం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన మీదట సబ్సిడీ రైతు ఖాతాలో జమ చేయడం మానేసే అవకాశముంది. ఇప్పటికే ఈ విధానాన్ని సబ్సిడీ గ్యాస్ సిలిండర్లలో అమలు చేసి వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న విషయం విదితమే. ఒక్కొక్క సిలిండరు రూ.418 కే అందించాల్సి ఉన్నా, అదనంగా రూ.70 వ్యాట్‌తో కలిపి మరో రూ.130 అదనంగా వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఇదే తరహాలోనే ఉచిత విద్యుత్‌లో కూడా అమలు చేయనుందనే అన్నదాతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు పాలన గుర్తు చేయనుంది.. చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలు తు.చ తప్పకుండా విద్యుత్ పంపిణీ అమలు జరిగింది. ఎన్టీఆర్ హయాంలో రైతులకు బాసటగా హార్స్ పవర్‌కు రూ.50 వసూలు చేయగా, చంద్రబాబు దాన్ని రద్దు చేసి రైతుల నుంచి అధిక మొత్తంలో విద్యుత్ చార్జీలు వసూలు చేశారు. రైతుల వెతలను ప్రతిపక్ష నేతగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ అమలు చేసి రైతులను ఆదుకున్నారు. విద్యుత్ సంస్థలు ఎంత ఒత్తిడి తెచ్చినా రైతు ప్రయోజనాల దృష్ట్యా చార్జీల పెంపునకు, ఉచితం ఎత్తివేతకు అంగీకరించలేదు. మహానేత వైఎస్సార్ మరణానంతరం రాష్ట్ర విద్యుత్ రంగంపై ప్రపంచ బ్యాంకు పెత్తనం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే కిరణ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
నిను మరువం రాజన్నా..
మంకమ్మతోట, న్యూస్‌లైన్: నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే వైఎస్.రాజశేఖరరెడ్డి గొంతు మూగబోయి నేటికి నాలుగేళ్లవుతోంది. తాను ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో స్వర్ణయుగానికి బాటలు వేసిన ఆ మహానేత ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తన పాలనా కాలంలో జిల్లాకు ఆయన చేసిన మేలు మరువలేనిది. ఉచిత విద్యుత్ మొదలు జలయజ్ఞం వరకూ నిరంతరం రైతుల కోసం తపిస్తూ.. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ఆయనదే. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో రెండున్నర లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో సుమారు రెండు లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. దీనిద్వారా వేలాది మంది రైతులు బావులు, బోర్ల కింద రెండు పంటలు పండించుకుంటున్నారు. తమ కడుపు నింపుకోవడంతోపాటు నలుగురికి అన్నం పెడుతున్నారంటే అది మహానేత చలవే. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు, పంట రుణాలు అందించడంతోపాటు పండించిన ధాన్యానికి మద్దతుధర కల్పించి అన్నదాతలకు ఆత్మబంధువయ్యారు. జలయజ్ఞం పథకం కింద జిల్లాలో ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల భారీ ప్రాజెక్టులకు పునాది వేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సారెస్పీ వరదకాల్వ పనులను వేగవంతం చేశారు. మధ్యమానేరు, తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి జలాశయాల ద్వారా సాగుభూములను సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకంలో జిల్లాలో ఇప్పటివరకు పదివేల మందికి పైగా వైద్యసహాయం పొందారు. వారంతా వైఎస్సార్‌ను ప్రాణదాతగా కొలుస్తున్నారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరం కారాదనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ పథకం ద్వారా వేలాది మంది లబ్ధిపొందారు. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకున్నారు. అంతకుముందు రూ.75 ఉన్న సామాజిక పింఛన్లను రూ.200కు పెంచడం, రూ.2కే కిలో బియ్యం వంటి పథకాల ద్వారా వేలాది మంది పేదలకు పస్తులుండాల్సిన బాధలు తప్పాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించడంతో ఆపద నుంచి గట్టెక్కారు. సింగరేణి కార్మికులకిచ్చే లాభాల వాటా పెంచడంతోపాటు గోదావరిఖనిలో 40 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో వారికి శాశ్వతంగా ఆశ్రయం లభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వేలాది మంది నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. వైఎస్సార్ అందించిన చేయూత వల్ల స్వశక్తి సంఘాల మహిళలు నేడు సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. పావలా వడ్డీ రుణాలు, 60 ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కుతుంది. సంక్షేమ పథకాలే కాకుండా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్.రాజశేఖరరెడ్డి బాటలు వేశారు. ఆయన పథకాలతో ఇంటింటికీ ఏదో విధంగా లబ్ధి జరిగిందంటే అతిశయోక్తికాదు. అందుకే ఆ మహానేతను ‘నిను మరువం రాజన్నా’ అంటూ జనం గుండెల్లో దాచుకున్నారు. నేడు వర్ధంతి కార్యక్రమాలు వైఎస్సార్ నాలుగో వర్ధంతిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి కుమార్ తె లిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలో గల తేజ హై స్కూల్ వద్ద జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యాలయంలో జరిగే వై ఎస్సార్ వర్ధంతి వేడుకల్లో వైఎస్సార్సీపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కా లనీలో గల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో పార్టీ జిల్లా నాయకుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీతోపాటు పలు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.