
ఉచిత విద్యుత్ ఉత్తుత్తిదే
నెల్లూరు(హరనాథపురం): రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇళ్ల కు 24 గంటల విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పాడైన ట్రాన్స్‌ఫార్మర్లకు 24 గంటల్లో మరమ్మతులు... ఇవి టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు. జిల్లాలో వాస్తవ పరిస్థితి ఏమిటంటే విద్యుత్ కోసం ఎండల్లో ఎం డుతూ, రాత్రుళ్లు కటిక చీకట్లో చేల ల్లోనే గంటల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో 1.38 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి రైతులకు ఇచ్చిన ఫ్రీ సర్వీసులకు నెలకు రూ.30 వంతున యూజర్ చార్జీలను వసూలు చేస్తున్నారు.
ఆదాయ పన్ను చెల్లించే మోతుబరి రైతులకు ఇచ్చిన 2000 వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్‌కు రూ.4.50 వంతున వసూలు చేస్తున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నెలకు రూ.25 కోట్ల రాయితీని భరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టీడీపీ హామీలు ఇచ్చినట్లు జిల్లాలో తొమ్మిది గంటల విద్యుత్ అమలు కావడం లేదు. ఏడు గంటల విద్యుత్ సరఫరాలో నిరవధికంగా మూడు గంటలు కూడా అమలు కావడం లేదు.
జిల్లాలో సబ్‌స్టేషన్ల వారీగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను నాలుగు గ్రూపులుగా విభజించిన అధికారులు సరఫరా వేళలను మార్చారు. ‘ఎ’ గ్రూపునకు రాత్రి 11.15 నుంచి 4.15 గంటల వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 వర కు, బీ గ్రూపునకు ఉదయం 4.55 నుంచి 9.15 వరకు, రాత్రి 11.15 నుంచి 1.15 వరకు, సీ గ్రూపునకు రాత్రి 9.15 నుంచి 2. 15 వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 3.15 వరకు, డీ గ్రూపునకు మధ్యాహ్నం 2.10 నుంచి 7.10 వరకు, రాత్రి 3.15 నుంచి 5.15 వరకు విద్యుత్ సరఫరా వేళలుగా నిర్ణయించారు. అయితే ఆచరణలో ఎక్కడా అ మలు కావడం లేదు. చంద్రబాబు పాలన వ చ్చి నెల గడుస్తున్నా 9 గంటల విద్యుత్‌కు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలు, వడగాలుల నేపథ్యంలో ఉ దయం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
తప్పని ఇక్కట్లు: రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉంటుం దని, కోతలు తగ్గుతాయని భావిస్తే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. విద్యుత్ కోతల తో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు భయాందోళనలో ఉన్నారు. ఉదయగిరి, విం జమూరు, కలిగిరి, పొదలకూరు, రాపూరు తదితర మండలాల రైతులు వ్యవసాయ వి ద్యుత్‌పై ఆధారపడి అరటి, బత్తాయి, పత్తి, కూరగాయలు, తదితర పంటలు సాగు చేస్తు న్నారు. డెల్టాలోనూ కొంత మేర చెరుకు, వరి పంట బోర్ల కిందే సాగుచేస్తున్నారు. ప్రస్తు తం కోతల నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి నా 24 గంటల్లో మార్చేస్తామన్న ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. ఫీజులు దెబ్బతిన్నా, గాలులకు తీగలు తెగిపడినా సిబ్బంది స్పందించడం లేదు. ప్రభుత్వం స్పందించి సమస్యలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.