free power
-
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. రేవంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో విజయం సాధించడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో కేసీఆర్ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఇక, తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్, ఫ్యామిలీని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. 🔥కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. 🔥వచ్చేది కాంగ్రెస్… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్.#ByeByeKCR pic.twitter.com/KERC60owzn — Revanth Reddy (@revanth_anumula) July 12, 2023 వ్యవసాయానికి 24 గంటల కరెంట్.. ఇక, అంతకుముందు కూడా రేవంత్ తెలంగాణలో ఉచిత కరెంట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘తెలంగాణలో 95% రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చిండు. ఉచిత కరెంట్ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతుండు. ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పేసి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నం’ అని అన్నారు. దీంతో, రేవంత్ కామెంట్స్ పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కాంగ్రెస్‌కు కవిత కౌంటర్.. మరోవైపు.. రేవంత్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రైతుకు వ్యవసాయం మంచిగా ఉండాలంటే నీళ్లు, కరెంటు ఉండాలి. కేసీఆర్ పెట్టిన రైతుబంధు పధకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బోగస్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే తప్పు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే తమకు కళ్ళ మంట ఎందుకంటూ ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి కరెంటు వస్తే అనేక మంది రైతులు చనిపోలేదా అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘నాకు తెలంగాణ సీఎం కావాలనే ఆశ లేదు’ -
‘ఫ్రీ’ ఫైర్.. అగ్గేసిన కాంగ్రెస్.. అందుకున్న బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. తెలంగాణ రైతాంగానికి టోటల్‌గా ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వేడి రాజేశాయి. అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంది. తాము అమలు చేస్తోన్న రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని, అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడింది. పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ధరణి ఎత్తివేస్తామని, ఉచిత విద్యుత్ తీసేస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీకి కరెంటు షాకులు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు నిరసనగా బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లెక్కారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమంటూ లేదని, ఎవరికి తోచింది వారు చెబుతూ ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నారని విమర్శించింది. రేవంత్ వ్యాఖ్యలు ఊహించని విధంగా వివాదాన్ని సృష్టించడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. పేటెంట్ మాదే.. బీఆర్ఎస్, బీజేపీల విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రేవంత్ వ్యాఖ్యలు వైరల్ కావడం, బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించడంతో ఎదురుదాడికి దిగింది. నష్ట నివారణకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, మల్లురవి, అద్దంకి దయాకర్, షబ్బీర్‌అలీ, రైతు విభాగం నేతలు కోదండరెడ్డి, సుంకేట అన్వేష్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ తదితరులు రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే రైతులని, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, రేవంత్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మంత్రులు ఊరకుక్కల్లా మాట్లాడుతున్నారంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపేందుకే రేవంత్ అలా మాట్లాడారని, విద్యుత్ రంగంలో అవినీతిపై బహిరంగ చర్చకు మంత్రులు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక ఉచిత విద్యుత్‌పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించగా, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమపై బురద జల్లుతున్నారని మాజీ ఎంపీ మల్లురవి విమర్శించారు. బీజేపీ తెచి్చన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ విధాన నిర్ణయాన్ని రేవంత్ ప్రకటించలేదంటూ, రైతులకు ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర: రేవంత్ బీఆర్ఎస్ విమర్శల పర్వం, కార్యాచరణపై అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి తాజాగా స్పందించారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన బీజేపీ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకు బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఒక ప్రకటనలో విమర్శించారు. గాంధీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్న సమయంలో అసత్య, అసందర్భ అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ చిల్లర హడావుడి చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న విషయం తేలడంతోనే బీఆర్ఎస్ మంత్రులు, నేతలు దు్రష్పచారం చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో 12 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్ల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించిందని, అందుకే తాను అమెరికాలో మాట్లాడిన మాటలు అవకాశంగా తీసుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ స్కీం అని, ఆ విషయంలో కాంగ్రెస్‌ను వేలెత్తి చూపే అర్హత బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. అసలు రేవంత్ ఏమన్నారు..? అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన గ్రీట్ అండ్ మీట్లో ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ సమావేశంలోనే ఉచిత విద్యుత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ రైతాంగానికి నిరంతరాయంగా ఇస్తున్న కరెంటును కొనసాగిస్తారా లేక రద్దు చేస్తారా? రైతుబంధు కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని ఓ ఎన్ఆర్ఐ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన రేవంత్.. ‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులు. మూడెకరాలలోపు ఉంటే ఒక ఎకరానికి నీరు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాలకు ఫుల్లుగా నీరు పారాలంటే మూడు గంటలు సరిపోతుంది. టోటల్‌గా ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్ తీసుకొచి్చండు. ఉచిత కరెంటు అని కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఇలాంటి ఉచితాలను అనుచితంగా స్వార్థానికి వాడుకోవద్దు. ఉచిత విద్యుత్ గురించి రైతు డిక్లరేషన్‌లో స్పష్టంగా చెప్పాం..’ అని అన్నారు. -
రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మంచి జోష్‌తో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక సొంత పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం..అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. మొత్తం మీద రేవంత్ వ్యాఖ్యల పర్యవసానం తీవ్రంగానే ఉంటుందని, 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే నిలదీసి ప్రభుత్వం చేత ఇప్పించాల్సిన బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. అసలు 24 గంటల విద్యుత్తే అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రెస్మీట్లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్టానం దృష్టికి..! అమెరికా వేదికగా ఉచిత విద్యుత్‌పైనా, అవసరమైతే సీఎంగా సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘రేవంత్ అమెరికా వెళ్లేంతవరకు బాగానే ఉన్నాడు. అక్కడకు వెళ్లిన తర్వాత బాలకృష్ణ, ఎర్రబెల్లి ప్రభావం పడి అలా మాట్లాడుతున్నాడేమో’ అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ విషయమై కొందరు సీనియర్లు అనధికారికంగా మాట్లాడుతూ.. ‘రేవంత్ పప్పులో కాలేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యాధృచ్చికంగా ఒక్క పదం అన్నందుకే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వ్యవసాయం దండుగ అన్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు 7–9 గంటల విద్యుత్ ఇచ్చాం. అసలు ఉచిత విద్యుత్ గురించి ఎందుకు మాట్లాడాలి? 24 గంటలు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ను విమర్శించాలి కానీ ఇస్తామంటే వద్దనడమెందుకు? దీంతో పాటు కాంగ్రెస్సే రేవంత్, రేవంతే కాంగ్రెస్ అని ఆయన అంటున్నారు. సీతక్కను సీఎం చేస్తామంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్, సీడబ్ల్యూసీ, సీఎం పదవులన్నీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికేనా? అసలైన కాంగ్రెస్ వాదులకు ఏం పదవులు లేవా? ఇలాంటి విషయాలన్నీ రాహుల్‌గాంధీతోనే మాట్లా డుతాం.’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఉచిత విద్యుత్‌పై రేవంత్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు(మంగళ, బుధవారం) బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ టీకాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ బయటపెట్టుకుందని అన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి ఆయన పిలుపునిచ్చారు. చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపు 👉 తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు… pic.twitter.com/teXS5Vk1JF — BRS Party (@BRSparty) July 11, 2023 కాగా, అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం తానా మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్నది మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని, ఎకరాకు సాగునీరు పారించాలంటే ఒక గంట, అదే మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని అన్నారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్‌కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని అనుచితంగా వ్యవహరించవద్దని అన్నారు. మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో ఇదీ కరెంటు దుస్థితి... మళ్లీ ఆ చీకటి రోజులు మనకొద్దు! 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడదాం... 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతుల బాధలు తీర్చిన కేసీఆర్ పాలనకే జై కొడదాం!! pic.twitter.com/X64kv1gd3S — BRS Party (@BRSparty) July 11, 2023 -
ఉచిత విద్యుత్ ఎంతెంత భారం!
శివాజీనగర: సాధారణంగా ప్రతిసారి కర్ణాటక విద్యుచ్ఛక్తి నియంత్రణ కమిషన్ (కేఇఆర్‌సీ) ప్రజలకు షాక్ ఇస్తూ ఉండేది. అయితే ఇటీవలి నిర్ణయం వల్ల ఈ దఫా ప్రభుత్వానికి షాక్ కొట్టింది. కొన్ని వారాల కిందట ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరిగినందున ప్రతి యూనిట్‌కు కనీసం 33 పైసల నుంచి 51 పైసలు పెంచింది. దీనిద్వారా మొత్తంలో గృహ వినియోగానికి అనుమతి ఇచ్చిన 14,090 మిలియన్ యూనిట్ విద్యుత్‌కు లెక్కించినపుడు సంవత్సరానికి సుమారు రూ.500 కోట్ల మేర వినియోగదారులపై భారం పడింది. ఈ భారం ఇప్పుడు ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని సర్కారు ప్రకటించింది. కనుక కొత్త చార్జీల పెంపు భారం భరించటం సర్కారుకు అనివార్యమైంది. రూ.500 కోట్లకు పైనే కొత్త చార్జీల ప్రకారం రూ.500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతోపాటు జీఎస్టీ తదితరాల కింద రూ.45 కోట్లు పన్నులు కట్టాలని అధికారులు అంచనా వేశారు. ప్రజలు ఉచిత విద్యుత్ పథకం కింద ఈ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని విశ్లేషించారు. ప్రతి ఏటా ఉచిత విద్యుత్‌కు రూ.500 కోట్ల నుంచి 740 కోట్ల వరకూ వ్యయమవుతుందని సర్కారు తెలిపింది. వరుసగా చార్జీల వడ్డింపులు గతంలో కేఈఆర్సీ వెనువెంటనే విద్యుత్ చార్జీలను పెంచుతూ వచ్చింది. ఇటీవల మే 12న ప్రతి యూనిట్‌కు సరాసరి 70 పైసలు పెంచుతున్నట్లు కేఇఆర్‌సీ ప్రకటించింది. అంతలోనే జూలై–సెప్టెంబర్, అక్టోబర్– డిసెంబర్‌కు అన్వయించే విధంగా మళ్లీ 33 పైసల నుండి గరిష్ట 51 పైసలు వరకు చార్జీల వాత పెట్టింది. ముందు రెండు త్రైమాసికాల్లో, బెస్కాం సవరించిన ప్రకారం ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ.1.01 పెరిగింది. దీనిద్వారా మొత్తం రూ.1.71 చొప్పున ప్రతి యూనిట్ విద్యుత్ వాడకంపై వడ్డించారు. 100 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.4.75 ఉండేది. 100 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.7 అవుతుంది. ప్రభుత్వం ఉచితం పేరుతో విద్యుత్ సరఫరాను కుంటుపరచరాదని, ఇతర రంగాలపై దుష్ప్రభావం పడకుండా చూడాలని ఈ రంగ నిపుణులు పేర్కొన్నారు. -
వ్యవసాయ మీటర్లు భారం కాదు.. భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను రైతన్నకు హక్కుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ కొరత రాకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగంపై కచ్చితమైన లెక్కలు వచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే ఉచిత విద్యుత్ పథకం కొందరికే అమలవుతుందని, రైతులే బిల్లులు చెల్లించాల్సి వస్తుందని కొందరిలో అపోహలు ఉన్నాయి. ఇవన్నీ అపోహలేనని, నిజాలు కావని అధికారులు చెబుతున్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల ఉపయోగాలే తప్ప రైతుకు ఎటువంటి భారం ఉండదని స్పష్టంచేస్తున్నారు. పైగా నాణ్యమైన విద్యుత్‌ను పొందేందుకు రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు. రైతుపై పైసా భారం ఉండదు స్మార్ట్ మీటర్లు బిగించినప్పటికీ రైతుకు పైసా భారం పడదు. ఇప్పుడు అమలవుతున్నట్లుగానే అర్హులైన రైతులందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ బిల్లు దగ్గర్నుంచి, మీటర్లు బిగించడానికి, వాటి మరమ్మతులకు అయ్యే ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగించిన విద్యుత్‌కు రైతులు చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా జమ చేస్తుంది. రైతులు ఆ బిల్లు సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించాలి. దీనిద్వారా వారికి ఉచిత విద్యుత్‌ను హక్కుగా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. రైతుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డిస్కంలకు బకాయిలనేవి ఉండవు కాబట్టి కచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తాయి. నాణ్యమైన విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్ నాణ్యత (లో వోల్టేజీ, అంతరాయాలు వంటివి లేకుండా) మెరుగుపడుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై లో వోల్టేజీ సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఎవరెవరికి విద్యుత్ అందుతుందో, ఏ రైతుకు ఏ కారణంగా విద్యుత్ అందడం లేదో తెలియాలన్నా ఈ మీటర్లతోనే సాధ్యమవుతుందని డిస్కంలు, ఇంధన శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. అనధికార కనెక్షన్ల క్రమబద్ధీకరణ అనధికార, అదనపు లోడ్ విద్యుత్ కనెక్షన్లనూ కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున డెవలప్మెంట్ చార్జీ, ప్రతి హెచ్‌పీకి రూ.40 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే వాటిని క్రమబద్ధీకరించి, మీటర్లు అందించి ఉచిత విద్యుత్ పరిధిలోకి తీసుకువస్తారు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ పేరు మార్చుకోవాలంటే పట్టాదారు పాసు పుస్తకం, భూ యాజమాన్య హక్కుపత్రం ఆధారంగా మార్చుకోవచ్చు. అవి అందుబాటులో లేకపోతే గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. వృథా ఉండదు 2020–21 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారని డిస్కంలు అంచనా వేశాయి. దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీని చెల్లించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 28 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించారు. తర్వాత 67.76 మినియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు వచ్చింది. అంటే.. 2 వేల వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగా వినియోగించినట్లు తేలింది. దీనివల్ల ఇప్పటివరకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు అడ్డుకట్ట పడింది. ఇదే విధంగా రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6 నెలల్లో మీటర్లు పెడితే వ్యవసాయ విద్యుత్‌కు చెల్లిస్తున్న దాదాపు రూ.10 వేల కోట్ల సబ్సిడీలో మూడోవంతు మిగులుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈమేరకు చర్యలు వేగవంతం చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. -
AP: పేదోడి గూటికి ‘పవర్’
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన నిరుపేద దళితురాలు బలగ కామాక్షి భర్త చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా కుమారుడు బాలరాజు కిడ్నీ వ్యాధితో చనిపోయాడు. కాయకష్టం చేసుకొని మనవరాళ్లకు వివాహం చేసింది. గతంలో విద్యుత్ బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడేది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌తో పాటు పింఛన్ కూడా అందిస్తుండటంతో తన జీవితంలో వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయని సంతోషంగా చెబుతోంది’’ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మీటేతాండలో ఆర్.భీమా నాయక్‌కు చిన్న ఇల్లు ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఆయన గతంలో నెలకు రూ.150 నుంచి రూ.250 వరకు కరెంటు బిల్లు కట్టేవారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందచేస్తుండటంతో మూడేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కరెంట్ బిల్లుల కింద ఇప్పటి వరకు సుమారు రూ.8 వేలకుపైగా మిగలడంతో ఇతర అవసరాలకు ఉపయోగపడిందని చెబుతున్నాడు’’ ఫ్యాన్, రెండు బల్బులకు.. ఉచిత విద్యుత్‌తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్ది మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఒక ఫ్యాన్, రెండు బల్బులు వినియోగానికి ఇబ్బంది లేదు. పొదుపుగా వాడుకుంటూ నెలకు 200 యూనిట్లు వినియోగం దాటకుండా చూసుకుంటున్నాం. –దేవదాసు, భీమవరం, నంద్యాల జిల్లా పేదల ఇళ్లలో విద్యుత్ వెలుగులపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 2019 ఆగస్టు నుంచి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల దాదాపు 22,54,596 మంది ఎస్సీ, ఎస్టీలకు మేలు చేకూరుతోంది. గత మూడేళ్లుగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వారంతా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా విద్యుత్తు వెలుగులు పొందుతున్నారు. ఈ ఏడాది 17,44,562 ఎస్సీ కుటుంబాలకు, 5,10,034 ఎస్టీ కుటుంబాలకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందచేసింది. పొదుపుగా వాడుతున్నాం ఉచిత విద్యుత్ పథకం ఎస్సీ, ఎస్టీలకు గొప్పవరం. గతంలో ప్రతి నెలా రూ.250కిపైగా బిల్లు చెల్లించే వాళ్లం. ఉచిత విద్యుత్ పుణ్యమా అని చార్జీలు చెల్లించే అవసరంలేదు. నెలకు 200 యూనిట్లు దాటకుండా కరెంటును పొదుపుగా వాడుకుంటున్నాం. –పి.భీమన్న, కర్నూలు జిల్లా పోలకల్ గ్రామం. హామీని నిలబెట్టుకున్నారు... కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేకునే నేను గతంలో కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడ్డా. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. –గిరి, నంద్యాల హరిజనపేట -
అడిగితేనే విద్యుత్ సబ్సిడీ ఇస్తాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉచిత, సబ్సిడీ విద్యుత్‌పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడిగే వారికి మాత్రమే ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందని చెప్పారు. ‘చౌక విద్యుత్ అనేది ఇప్పుడు ఢిల్లీలో ఐచ్ఛికం. అంటే, వినియోగదారుడు విద్యుత్ సబ్సిడీని కోరుకుంటేనే ఇక నుంచి ఉచిత లేదా రాయితీతో కూడిన విద్యుత్‌ను పొందుతాడు. సబ్సిడీ అవసరం లేదకునేవారు సాధారణ రేటుకే కరెంటు ఉపయోగించుకుంటామని ప్రభుత్వానికి తెలపాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1 నుండి రాయితీతో కూడిన విద్యుత్ అడిగిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంద’ని కేజ్రీవాల్ వివరించారు. (చదవండి: వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది) ప్రస్తుతం ఢిల్లీలోని వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు లేదు. నెలకు 201 నుంచి 400 యూనిట్ల విద్యుత్‌పై రూ. 800 సబ్సిడీ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, నీటి పథకాలతో కేజ్రీవాల్ ఢిల్లీలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. పంజాబ్‌లోనూ దీన్ని అమలు చేస్తామని ఆయన హామీయిచ్చారు. విద్యా, వైద్య రంగాల్లోనూ ఢిల్లీ సర్కారు మంచి ప్రగతి సాధించడంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. (చదవండి: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన) -
జలకళ.. కనెక్షన్ భళా!
కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో మెట్ట భూముల్లో ఉచితంగా బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఉచితంగా విద్యుత్ కనెక్షన్, మోటార్ కూడా ఇస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు జలకళ పథకం వరంగా మారింది. ఒకప్పుడు వర్షాధారంపై కనాకష్టంగా సంవత్సరానికి ఒక పంట పండించేవారు. నేడు సమృద్ధిగా నీరు ఉండడంతో మూడు పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. 766 బోర్లలో సమృద్ధిగా నీరు జలకళ పథకం కింద రెండున్నర ఎకరాల్లోపు భూమి ఉన్న సన్నకారు రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డ్వామా (జిల్లా నీటి యాజమాన్యపు సంస్థ) అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. సీనియారిటీ ప్రకారం జిల్లాలో 1100కు పైగా బోర్లు చేశారు. వాటిలో 766 బోర్లలో నీరు పడ్డాయి. దీంతో రెవెన్యూ డివిజన్ల వారీగా జాబితాను విద్యుత్ శాఖ కర్నూలు ఆపరేషన్స్ అధికారులకు అందజేశారు. దీని కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆయా బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంతోపాటు సరఫరా ఇవ్వాలని డ్వామా అధికారులు కోరారు. సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక వైఎస్సార్ జలకళ పథకం కింద వేసిన 766 బోర్లకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్నకారు రైతులకు చేదోడుగా నిలవడంతోపాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. జలకళ పథకం కింద వివిధ పనుల కోసం రూ.26,60,27,751 నిధులు కావాలని అంచనాలు తయారు చేసి పంపించారు. కర్నూలు టౌన్, కర్నూలు రూరల్, నంద్యాల, ఆదోని, డోన్ డివిజన్ల వారీగా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, లెన్త్ ఆఫ్ లైన్, ఏబీ స్విచ్‌లు, ఇతర సామగ్రి కావాలని అడిగారు. మొత్తం 620కి పైగా ట్రాన్స్ఫార్మర్లకు రూ.3.80కోట్లు, 8,837 విద్యుత్ స్తంభాలకు రూ.1.59కోట్లు, 767 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.2.26కోట్లు, 72.540 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.39.70లక్షలు, ఇతర సామగ్రి, సివిల్ పనులు, లేబర్ చార్జీల కోసం రూ.9.25కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆమోదం లభించడంతో డ్వామా అధికారులు నిధులు విడుదల చేశారు. నాణ్యతతో పనులు ఉమ్మడి జిల్లాల్లో జలకళ కింద వేసి బోర్లకు కనెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ముఖ్యంగా మొదటి వేసిన బోర్లకు సీనియారిటీ ఆధారంగా విద్యుత్ సరఫరా అందిస్తూ వస్తున్నారు. మొదటి విడతలో రూ.2లక్షల లోపు నిధుల అంచనాలో ఉండే 71 బోర్లకు కనెక్షన్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ నేతృత్వంలో పనుల నాణ్యతతో చేశారు. విడతల వారీగా పనులు వైఎస్సార్ జలకళ పథకం కింద 766 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని డ్వామా అధికారులు విన్నవించారు. రూ.26.60 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపగా ఆమోదం లభించింది. డ్వామా అధికారులు నిధులు చెల్లిస్తున్న మేరకు విడతల వారీగా పనులు పూర్తి చేసి, కనెక్షన్లు మంజూరు చేస్తున్నాం. – కె. శివప్రసాద్ రెడ్డి, ఎస్ఈ, కర్నూలు ఆపరేషన్స్, విద్యుత్ శాఖ నాడు వర్షాధారం.. నేడు సమృద్ధిగా జలం నడిపి వెంకయ్య స్వామి. ఓర్వకల్లు మండలం ఎన్. కొంతలపాడు గ్రామ వాసి. తనకున్న మూడెకరాల పొలంలో వర్షాధారంపై వివిధ పంటలు సాగు చేసేవాడు. ప్రకృతి సహకరిస్తేనే దిగుబడులు వచ్చేవి. లేదంటే అప్పుల కుప్ప మిగిలేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు దశ తిరిగింది. వైఎస్సార్ జలకళ పథకంతో పొలంలో ఉచితంగా 600 అడుగుల లోతు బోరు వేశారు. రెండు ఇంచుల నీరు పడడంతో విద్యుత్ అధికారులు రూ.2,61,229 వెచ్చించి ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు, విద్యుత్ వైర్లు అమర్చి కనెక్షన్ ఇచ్చారు. సర్వీసు నంబర్ 8322317000412ను విడుదల చేశారు. సమృద్ధిగా నీరు ఉండడంతో ఈయన కూరగాయల పంటలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. -
పంజాబ్ ప్రజలకు ఆప్ సర్కార్ శుభవార్త..
చండీగఢ్: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తనందించింది. జూలై 1నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు కరెంట్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ ప్రకటన చేసింది. ఈనెల 16న పంజాబ్ ప్రజలకు శుభవార్త అందించనున్నట్లు సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమమై దీనిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఇప్పుడు మీరు అయిదేళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదు.. పంజాబ్ ప్రజలు రేపు పెద్ద ప్రకటన వినబోతున్నారు’’ అని ఆప్ ట్వీట్ చేసింది. అయితే ఢిల్లీలోని ఆప్ సర్కార్ కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆప్ ఇచ్చిన హామీల్లో.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇచ్చిన హామీని నెలబెట్టుకుంది ఆప్ సర్కార్. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తోంది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 92 చోట్ల విజయకేతనాన్ని ఎగరవేసింది. చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు -
మేము చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదు
-
ఉచిత విద్యుత్ ఘనత వైఎస్సార్‌దే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి పునరుద్ఘాటించారు. ఉచిత విద్యుత్ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. 39.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని గుర్తుచేశారు. సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో తమ పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వివరించారు. పెట్రోల్ ధరలను అదుపు చేయడం తమ చేతుల్లో లేదని అన్నారు. -
‘సీఎం ఆదేశాలను పక్కదారి పట్టిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా... అవగాహనలేమితో అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర కులాలు, మతాల వారు నడుపుతున్న క్షౌరశాలలు, బ్యూటీపార్లర్లను కూడా ఈ పథకం కింద నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అందలేదని జవాబిచ్చారని తెలిపారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే క్షౌరవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న క్షురకులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే ఉచిత విద్యుత్ పథకంలో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
ఉచిత విద్యుత్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్‌పై సోమవారం సమీక్షించారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. (చదవండి: కౌలు రైతుల కష్టాలకు చెల్లు) రైతులకు అవగాహన కల్పించాలి: ⇒ వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయాన్ని గట్టిగా ప్రచారం చేయాలి. ⇒ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్ సరఫరాను తెలుసుకునే వీలు కలుగుతుంది. ⇒ దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ⇒ ఆ విద్యుత్ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ⇒ ఆ తర్వాత రైతులు అదే నగదును విద్యుత్ బిల్లు కింద డిస్కమ్‌లకు చెల్లిస్తారు. ⇒ మొత్తం ఈ ప్రక్రియలో రైతులపై ఏ మాత్రం భారం పడదు. వారికి ఇంకా నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ⇒ ఇదే విషయంపై రైతులకు అవగాహన కల్పించాలి. ⇒ ఆ మేరకు అన్ని గ్రామ సచివాలయాల్లో పోస్టర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలి. ⇒ నాణ్యమైన విద్యుత్‌ను 9 గంటల పాటు, నిరంతరాయం సరఫరా చేయడం కోసమే మీటర్ల ఏర్పాటు అన్న విషయంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ⇒ ఆ ప్రక్రియలో భాగంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ⇒ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మెసేజ్ క్లియర్‌గా ఉండాలి. ఎక్కడా అపోహలకు అవకాశం ఇవ్వకూడదు. నాణ్యత – ఐఎస్ఐ ప్రమాణాలు: ⇒ ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యంఇవ్వాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ (ఈఈఎస్ఎల్)తో మాట్లాడండి. ⇒ రైతులు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన మోటర్లు వినియోగించేలా అవగాహన కల్పించాలి. ⇒ అదే విధంగా కెపాసిటర్లు కూడా ఐఎస్ఐ ప్రమాణాలతో ఉండాలి. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలి. శిక్షణనిచ్చాం: కాగా, మీటర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడబోదన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే 14,354 లైన్మెన్లకు శిక్షణ ఇచ్చినట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ఇప్పటికే 97.5 శాతం ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి కూడా నవంబరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. సౌర విద్యుత్: మరోవైపు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు పేర్కొనగా, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు. (చదవండి: విచారణతోనే న్యాయం) -
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో దేశ రాజధానివాసులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారీ నజరానా ప్రకటించారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచిత విద్యుత్ వర్తింపచేస్తామని కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. 201 యూనిట్ల నుంచి 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి విద్యుత్ బిల్లులపై 50 శాతం రిబేట్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 200 యూనిట్లలోపు వినియోగానికి ఎలాంటి బిల్లు రాదని, పూర్తిగా ఉచితమని కేజ్రీవాల్ వెల్లడిస్తూ ఇది సామాన్యులకు మేలు చేసే చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. నగర విద్యుత్ వినియోగదారుల్లో 33 శాతం మంది ఉచిత విద్యుత్‌తో లబ్ధి పొందుతారని అన్నారు. కాగా ఢిల్లీలో మహిళలందరికీ ఉచిత మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం కేజ్రీవాల్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సీఎం జగన్ మరో హామీని నిలబెట్టుకున్నారు!
సాక్షి, అమరావతి: రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను రేపటి నుంచి అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను కలిసి అభినందించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పి మోసం చేశారని, కానీ సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీని అమలు చేసి నిరూపించారన్నారు. రైతులకు గురువారం నుంచే పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 శాతం ఫీడర్ల ద్వారా రేపటి నుంచే పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. మిగిలిన 40 శాతం ఫీడర్ల మరమ్మతులకు రూ. 1700 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వచ్చే ఏడాది జులై నుంచి మిగిలిన 40 శాతం ఫీడర్ల నుంచి కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. -
జగనన్నహామీతోరైతుల్లోధీమా
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు పండించిన పంటలకు బీమా నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో ఇచ్ఛాపురంలో చేసిన ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతన్నలకు వెన్నుదన్నుగా బీమా పథకం ఉంటుంది. రైతుల్లో ఈ బీమాపై అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. అత్యధిక మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోకపోవడం, పంటలు వేసే సమయానికి బీమా సమయం దాటిపోవడంతో బీమా చేయించుకోకుండా నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే సహాయం అరకొరగానే ఉంటోందని ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లుగా ప్రకృతి విపత్తు సమయంలో రైతులకు నష్టాలే తప్ప ఆదుకునే వారే కరువయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2,40,844 హెక్టార్లలో 6,11,086 మంది రైతులు వివిధ రకాల పంటలు వేశారు. వీరిలో 3 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల వల్ల 13,194 హెక్టారుల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిలో 702 హెక్టారుల్లో వరి, 293 హెక్టారుల్లో ప్రత్తి, 177 హెక్టారుల్లో చెరకు పంటల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. రబీలో మాత్రం తిత్లీ తుపాను కారణంగా వరి పంటతో పాటు పొగాకు పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా పంటలపై భీమాలేక నష్టపోయినట్లు రైతు సంఘం నాయకులు చెప్తున్నారు. జగనన్న హామీతో రైతులకు భరోసా ప్రజాసంకల్పయాత్ర చేసి గ్రామగ్రామాన ప్రజా సమస్యలను తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కష్టాలను దగ్గరగా చూసి చలించిపోయారు. కష్టాలను తీర్చేవిధంగా ఇచ్ఛాపురం సభలో ఆయన ఇచ్చిన హామీలతో రైతులు చెప్పలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పంటల సహాయంతో పాటు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండుగలా చేస్తారని రైతులు అన్నారు. జగన్ పాలనలో తమ బతుకులు తప్పకుండా మారతాయని వారంటున్నారు. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లించడం, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. రైతు భరోసా పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్ ముందు రైతులకు పంట ఖర్చులను రూ. 12,500 పెట్టుబడి సహాయం, ఉచిత బోర్లు, వడ్డీలేని పంట రుణాలను అందిస్తామనే జగన్ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి మంచి రోజులు వస్తున్నాయని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. రానున్నది రైతు రాజ్యమే అని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ప్రకటించిన హామీలు తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ఉంది. వ్యవసాయానికి మంచి రోజులు రాబోతున్నాయి. పగటి పూట 9 గంటలకు ఉచిత విద్యుత్, ఉచిత బోర్లు వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.– బిరుదుగడ్డ మురళి,రైతు, బుట్టాయగూడెం మండలం రానున్నది రైతు రాజ్యమే రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వైఎస్సార్ భరోసా పథకం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాదికి రూ. 12,500 చొప్పున రూ.50 వేలు నేరుగా రైతుకు ఇస్తామనడం సంతోషమే. రానున్నది రైతు రాజ్యమే. జగన్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.– అల్లూరి సోమేశ్వరరావు, రైతు,రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం -
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
-
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ అందించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం నుంచే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. 11వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు డిస్కంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మోటార్లకు పెట్టిన ఆటోస్టార్టర్లను రైతులు వెంటనే తొలగించాలని సీఎం కేసీఆర్ కోరారు. నోట్ల రద్దు పరిణామాలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. నరేంద్రమోదీ సర్కారు డీమానిటైజేషన్ చేపట్టి.. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నోట్ల రద్దు పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ వాయాదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్పీకర్ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. నోట్లరద్దుతో దేశ ఆర్థిక ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, వ్యాపారులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని, ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. -
ఉచిత విద్యుత్ నిర్ణయం వరం
కడప అగ్రికల్చర్: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం వేంపల్లెలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఈ హామీని అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పారు. జగన్ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాటతప్పిందని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. అన్న వస్తే అంతా మేలు జరుగుతుంది వైఎస్ జగనన్న ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఆయన ప్రకటించిన నవరత్నాలు అందరి మన్నలను పొందాయి. వేంపల్లెలో రచ్చబండ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉచిత కరెంటు హామీ తప్పకుండా అమలవుతుంది. – వినయ్‌కుమార్, ఎస్సీ కాలనీ, పులివెందుల ఎంతో మేలు జరుగుతుంది ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వటం సంతోషంగా ఉంది. హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. జగన్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇవ్వటం వల్ల ఎస్సీలు బాగు పడతారు. –ఎన్.పెంచలయ్య, మల్లేపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం సంతోషంగా ఉంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ వరం. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం సంతోషకరం. దళితుల పక్షపాతి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. –మర్రి సుబ్బన్న, పెద్దచెప్పలి దళితవాడ, కమలాపురం మండలం -
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న కేసీఆర్
-
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఉచిత విద్యుత్ ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శాసనసభ సాక్షిగా అంగీకరించారు. బుధవారం సభలో రైతు సమస్యలు, ఉచిత విద్యుత్‌పై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ విధానాన్నే తాము కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ సభలో మాట్లాడుతూ...‘రుణమాఫీని పూర్తిగా అమలు చేశాం. ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. మాది రైతు ప్రభుత్వం, రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం. రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది వైఎస్ఆరే. తడిచిన పత్తిని కొంటాం. మొన్న ఎన్నికల్లో మమ్మల్ని మేలు రకంగా, మిమ్మల్ని నాసిరకంగా గుర్తించారు. మళ్లీ అందరు ప్రజల్లోకి వెళ్లాల్సిందే.’ అని అన్నారు. ఉచిత విద్యుత్ దివంగత నేత వైఎస్ఆర్ ఘనతే.. -
పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ.. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎవరి కార్లకూ బుగ్గలు (సైరన్ లైట్లు) తీసేస్తామని ప్రకటించారు. దాంతో ఇక ముఖ్యమంత్రికి తప్ప వేరెవ్వరికీ బుగ్గ కార్లు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. శనివారం నాడు సమావేశమైన అమరీందర్ మంత్రివర్గం ఇంకా అనేక నిర్ణయాలు తీసుకుంది. వాటన్నింటినీ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పంజాబ్‌నుంచి డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా తరిమేయడానికి వీలుగా ఒక స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు రైతులకు ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామన్నారు. రుణమాఫీ విషయాన్ని అంచనా వేసి, దాని అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇచ్చేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న డీటీఓలు, హల్కా ఇన్చార్జులు ఉండబోరని, ఆ రెండు వ్యవస్థలను రద్దుచేయాలని తమ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నదీ జలాల పరిరక్షణ కోసం అన్ని రకాల న్యాయపరమైన, పాలనాపరమైన అవకాశాలను చూస్తామన్నారు. పాత ప్రభుత్వ హయాంలో పెట్టిన తప్పుడు కేసులు, ఎఫ్ఐఆర్లపై విచారణకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దోషులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. My cabinet has decided to rid the state of VIP culture. All beacon lights to be removed from vehicles of Ministers, MLAs and bureaucrats. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We have also decided to set up a Special Task Force to crack down on drugs and wipe them out from Punjab. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 No more DTOs, no more Halqa Incharges to harass and bleed my people. My cabinet has decided to abolish both. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We have decided to constitute a Group Of Experts to assess and propose farm debt waiver ways in 60 days. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We will continue to give free power to the farmers of Punjab and bring our agriculture back on track. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 My government will pursue all legal and administrative options to protect the waters of Punjab in the SYL canal issue. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 Will set up a Commission Of Enquiry to probe false cases and FIRs done by the previous govt and ensure justice to all innocent. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 -
భారం సర్కారుదే
♦ ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం ♦ కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. నీటి పారుదల శాఖకు ప్రతినెలా రూ.2,100 కోట్లు ♦ ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న రైతులను చంద్రబాబు రాచిరంపాన పెట్టారు ♦ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ఎత్తిపోతలు.. శరవేగంగా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించాలని అధికారులకు సూచన ♦ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించి తీరుతామన్నారు. గురువారం కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. రైతులను ఆదుకోవడం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామని.. అందులో ప్రతి నెలా రూ.2,100 కోట్ల చొప్పున నీటి పారుదల శాఖకు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం రాచిరంపాన పెట్టిన పరిస్థితిని ప్రజలు చూశారని.. అలాంటి పాలకులను తిరస్కరించారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందివ్వడంతో పాటు సాగునీరు అందించడం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని, దీనికి జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలి తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా సముద్రంలోకి పోయే నీటిని సమర్థంగా వినియోగించుకోగలుగుతామని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఏటా 4,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తయినా.. వెయ్యి టీఎంసీలలోపే నీటిని వాడుకోగలమని, మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్‌కే వెళుతుందని చెప్పారు. సముద్రంలోకి వృథాగా వెళుతున్న నీటిని వినియోగించుకునేలా ఏపీ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుతో 320 మెగావాట్ల విద్యుత్ ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేసి రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని భవిష్యత్తులో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం దుమ్ముగూడెం వద్ద నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సీతారామ ప్రాజెక్టును నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత బ్యారేజీకి 200 మీటర్ల కింద మరింత ఎత్తుగా బ్యారేజీ నిర్మించి మొత్తం ఖమ్మం జిల్లా అవసరాలు తీర్చేలా సాగునీటి వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. దానివల్ల దాదాపు 22 టీఎంసీల నీరు నదిలోనే నిల్వ ఉండటంతో పాటు.. దాదాపు 31 కిలోమీటర్ల వరకు నదిలో నీరు నిలుస్తుందని, ఎలాంటి ముంపు లేకుండా ఆ నీటిని వాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ డిజైన్ వల్ల దాదాపు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో కృష్ణా నదిలో జలాలు లేకున్నా... ఈ ప్రాజెక్టు ద్వారా ఆ జిల్లా వ్యవసాయానికి ఢోకా ఉండని పరిస్థితి తేవాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక, అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. శరవేగంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే తెలంగాణ రైతులకు అంత ప్రయోజనం చేకూరుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు అమర్పాల్సింగ్, రామకృష్ణారావు, రజనీశ్ చౌహాన్‌లతో ఇదే సమీక్షలో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులు మేడిగడ్డ నిర్మాణ మెథడాలజీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 నెలల సమయంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళికను అందులో పేర్కొన్నారు. బ్యారేజీతో పాటు నదికి ఇరువైపులా మట్టికట్ట కట్టే ప్రాంతాలను కూడా ఖరారు చేశారు. బ్యారేజీ పూర్తయ్యే కన్నా ముందే పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయాలని ఈ సందర్భంగా వారికి కేసీఆర్ సూచించారు. ఈ సమీక్షలో మంత్రి జగదీ్‌శ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పాలనకు మానవీయతను అద్దిన జననేత
ఒక పాలకుడు భౌతికంగా దూరమై ఆరేళ్ళు గడిచినా ప్రజల గుండెల్లో ఆయన సజీవంగా ఉండడం ఇటీవల కాలంలో సాధ్యమేనా? ఆ పాలకుని పాలన ముగిసినా... ఆయ నను ఇంకా గుర్తుంచుకో వడం ఈ రోజుల్లో జరిగే పనేనా? ప్రజలు ఎందుకు ఆయనను మరిచిపో కుండా నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రజల జీవితాలతో మమేకమైన ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజాకంటక పాలనకు విరుగు డుగా జనరంజక పాలనను అందించి, పేదలు, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన జననేత వైఎస్. ఆయనకు ముందు వెనుక పాలనను చూస్తే తప్ప డాక్టర్ వైఎస్ తెలుగు ప్రజలపై వేసిన ప్రభా వం ఏమిటో స్పష్టం కాదు. పేదోడికి గూడు కావాలంటే అధికార పార్టీకి నిరంతరం కొమ్ముకాస్తే తప్ప ఇంటికి గతిలేని దిక్కు మాలిన పాలన అది. రోగం వచ్చినా, మంచి చదు వులు చదువుకోవాలన్నా పేదలకు ఎటువంటి భరోసా ఇవ్వలేని పాలకులున్న రోజులవి. చేతి వృత్తులు కునారిల్లి, వ్యవసాయం దండుగ మారిగా మారిన రోజులవి. అంతెందుకు కరెంట్ బిల్లులే షాక్ కొట్టే ‘స్వర్ణాంధ్ర’ పాలన అది. పేదలపై కనికరం లేని ‘పారదర్శక’ పాల నది. రైతులు, నేతన్నలు, కూలీలు వలసబాట పట్టి తమ ప్రాణాలు మిగుల్చుకున్న రోజులవి. ఒక సామాజిక పింఛను, తెల్ల రేషన్ కార్డు, బలహీన వర్గాల ఇల్లు.. ఇదీ అప్పట్లో పేదల కోర్కెల చిట్టా. నిరుపేదల జీవితాలలో నిరంతరం దోబూచులాడే ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బం దులు విని చలించిపోయిన కరుణామూర్తి డాక్టర్ వైఎస్. పేదల నోటికి ‘ఐదేళ్ళు’ అందివచ్చిన పాలనను అందించి, మళ్ళీ మరో ఐదేళ్ళు అధికారంలో కొనసాగే నైతిక తను సొంతం చేసుకున్న పాలకుడాయన. నూటికి ఎనభైశాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని గాడిలో పెడితే తప్ప గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదని నమ్మి అక్కడ నుంచే చికిత్సను ప్రారంభించారు. రైతాంగానికి ఉచిత విద్యుత్, మహిళలకు పావలావడ్డీకే రుణాలు, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్, రెండు రూపాయలకే కిలో బియ్యం, బలహీనవర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళు, వికలాంగులకు, వృద్ధులకు వృద్ధాప్యపు పింఛన్లు తదితర సంక్షేమ పథకాలతో పాటు జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి దీర్ఘకాలిక పథకాలన్నింటికి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా వైఎస్ జరిపిన పాదయాత్ర సమయంలో వెలుగులోకి వచ్చిన పేదల కష్టాలు కన్నీళ్ళే కారణం. పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నా పై చదువులకు ఆర్థికస్తోమత లేనందున నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన ఒక విద్యార్థి రైల్వే కూలిపను లకు వెళ్తున్న విషయం వైఎస్‌ను కదిలించిన ఫలితమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. అలాగే మైక్రోఫై నాన్స్ కంపెనీల ఆగడాలనుంచి తమను కాపాడా లని గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామ మహిళలు మొరపెట్టుకున్నప్పుడు వైఎస్ మదిలో మెదిలిన పథకమే డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీతో రుణ కల్పన. ఏవిధంగా నిరుపేదలకూ ఖరీదైన వైద్యాన్ని అందించగలమనే ఆలోచన నుంచి పుట్టిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి నిరుపేదా నయాపైసా ఖర్చుపెట్టకుండా తమను తాము రక్షిం చుకునే భరోసాను కల్గించారాయన. ప్రపంచ బ్యాంక్ షరతుల నడుమ ప్రజలకు ఆమోదయో గ్యమైన పాలన అందించడం, అందులోనూ మాన వీయతతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక్క డాక్టర్ వైఎస్‌కే చెల్లింది. అందుకే ఆయన లేని లోటును జీర్ణించుకోలేని పేద గుండెలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ప్రాంతాలతో పనిలేకుండా, కాలంతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ డాక్టర్ వైఎస్ ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న పాలకుడే. (జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు 9553750001 - బుర్రా విజయశేఖర్