
పాలనకు మానవీయతను అద్దిన జననేత
ఒక పాలకుడు భౌతికంగా దూరమై ఆరేళ్ళు గడిచినా ప్రజల గుండెల్లో ఆయన సజీవంగా ఉండడం ఇటీవల కాలంలో సాధ్యమేనా? ఆ పాలకుని పాలన ముగిసినా... ఆయ నను ఇంకా గుర్తుంచుకో వడం ఈ రోజుల్లో జరిగే పనేనా? ప్రజలు ఎందుకు ఆయనను మరిచిపో కుండా నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రజల జీవితాలతో మమేకమైన ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజాకంటక పాలనకు విరుగు డుగా జనరంజక పాలనను అందించి, పేదలు, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన జననేత వైఎస్. ఆయనకు ముందు వెనుక పాలనను చూస్తే తప్ప డాక్టర్ వైఎస్ తెలుగు ప్రజలపై వేసిన ప్రభా వం ఏమిటో స్పష్టం కాదు.
పేదోడికి గూడు కావాలంటే అధికార పార్టీకి నిరంతరం కొమ్ముకాస్తే తప్ప ఇంటికి గతిలేని దిక్కు మాలిన పాలన అది. రోగం వచ్చినా, మంచి చదు వులు చదువుకోవాలన్నా పేదలకు ఎటువంటి భరోసా ఇవ్వలేని పాలకులున్న రోజులవి. చేతి వృత్తులు కునారిల్లి, వ్యవసాయం దండుగ మారిగా మారిన రోజులవి. అంతెందుకు కరెంట్ బిల్లులే షాక్ కొట్టే ‘స్వర్ణాంధ్ర’ పాలన అది. పేదలపై కనికరం లేని ‘పారదర్శక’ పాల నది. రైతులు, నేతన్నలు, కూలీలు వలసబాట పట్టి తమ ప్రాణాలు మిగుల్చుకున్న రోజులవి.
ఒక సామాజిక పింఛను, తెల్ల రేషన్ కార్డు, బలహీన వర్గాల ఇల్లు.. ఇదీ అప్పట్లో పేదల కోర్కెల చిట్టా. నిరుపేదల జీవితాలలో నిరంతరం దోబూచులాడే ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బం దులు విని చలించిపోయిన కరుణామూర్తి డాక్టర్ వైఎస్. పేదల నోటికి ‘ఐదేళ్ళు’ అందివచ్చిన పాలనను అందించి, మళ్ళీ మరో ఐదేళ్ళు అధికారంలో కొనసాగే నైతిక తను సొంతం చేసుకున్న పాలకుడాయన. నూటికి ఎనభైశాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని గాడిలో పెడితే తప్ప గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదని నమ్మి అక్కడ నుంచే చికిత్సను ప్రారంభించారు.
రైతాంగానికి ఉచిత విద్యుత్, మహిళలకు పావలావడ్డీకే రుణాలు, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రెండు రూపాయలకే కిలో బియ్యం, బలహీనవర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళు, వికలాంగులకు, వృద్ధులకు వృద్ధాప్యపు పింఛన్లు తదితర సంక్షేమ పథకాలతో పాటు జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి దీర్ఘకాలిక పథకాలన్నింటికి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా వైఎస్ జరిపిన పాదయాత్ర సమయంలో వెలుగులోకి వచ్చిన పేదల కష్టాలు కన్నీళ్ళే కారణం.
పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నా పై చదువులకు ఆర్థికస్తోమత లేనందున నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన ఒక విద్యార్థి రైల్వే కూలిపను లకు వెళ్తున్న విషయం వైఎస్‌ను కదిలించిన ఫలితమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం. అలాగే మైక్రోఫై నాన్స్ కంపెనీల ఆగడాలనుంచి తమను కాపాడా లని గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామ మహిళలు మొరపెట్టుకున్నప్పుడు వైఎస్ మదిలో మెదిలిన పథకమే డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీతో రుణ కల్పన. ఏవిధంగా నిరుపేదలకూ ఖరీదైన వైద్యాన్ని అందించగలమనే ఆలోచన నుంచి పుట్టిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి నిరుపేదా నయాపైసా ఖర్చుపెట్టకుండా తమను తాము రక్షిం చుకునే భరోసాను కల్గించారాయన.
ప్రపంచ బ్యాంక్ షరతుల నడుమ ప్రజలకు ఆమోదయో గ్యమైన పాలన అందించడం, అందులోనూ మాన వీయతతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక్క డాక్టర్ వైఎస్‌కే చెల్లింది. అందుకే ఆయన లేని లోటును జీర్ణించుకోలేని పేద గుండెలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ప్రాంతాలతో పనిలేకుండా, కాలంతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ డాక్టర్ వైఎస్ ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న పాలకుడే.
(జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా)
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు 9553750001
- బుర్రా విజయశేఖర్