ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా సమయం ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా సమయాన్ని 7 నుంచి 8 గంటలకు పెంచాలని..
మరో హామీపై బాబు సర్కారు వెనుకంజ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా సమయం ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా సమయాన్ని 7 నుంచి 8 గంటలకు పెంచాలని.. వచ్చే ఏడాది నుంచే దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి అధికారికంగా ఏడు గంటల ఉచిత విద్యుత్ అమలవుతోంది. (వాస్తవానికి నాలుగైదు గంటలు కూడా సరఫరా లేదు) ఆరేళ్ల కిందట ఈ 7 గంటల విద్యుత్‌ను 9 గంటలకు పెంచుతామని దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు.
అయితే ఆయన మరణానంతరం ఈ హామీని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే.. ప్రస్తుతం దీనిని కూడా 8 గంటలకే కుదించాలని భావిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పెంచే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఆలోచించడం లేదు.