
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేస్తారా?
హైదరాబాద్: రైతులకు 9 గంటల విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించింది. సోమవారం శాససభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. 9 గంటల ఉచిత విద్యుత్ దశలవారీగా ఇస్తామనడం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో హమీయిచ్చినట్టు రైతులకు 9 గంటల ఉచిత్ విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం ఉందా అని ఆయన అడిగారు. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే వెల్లడించాలని డిమాండ్ చేశారు.