ఉచిత విద్యుత్ పథకంలో కోత! | | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 5 2013 8:57 AM | Last Updated on Thu, Mar 21 2024 9:14 AM

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని మోయలేని భారంగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం రోజుకో నిబంధనను తెరపైకి తెస్తోంది. వీలైనంత ఎక్కువమంది రైతులు ఈ పథకానికి అనర్హులయ్యేలా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. తద్వారా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి (తరిపంట) ఉన్న రైతులకు ఉచిత కరెంటును ఎత్తివేసిన ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థ ‘కాకి లెక్కల’ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌కు మరిన్ని పరిమితులు విధిస్తోంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి, వర్షాభావంతో అల్లాడుతున్న రైతుల్ని మరింత దెబ్బతీసేలా.. ఒక హార్స్ పవర్ (హెచ్‌పీ)కు ‘ఏడాది’కి కేవలం 1,255 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలను జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement