ఏపీలో లక్ష మంది రైతులకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది కొత్తగా 50 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,50,000 మంది రైతులు ఉచిత కనెక్షన్ల కోసం ఎదురుచూస్తుంటే.. సబ్సిడీ భారం పేరిట ప్రభుత్వం రకరకాల వడపోతల తర్వాత కేవలం 50 వేలమందికి మాత్రమే కనెక్షన్లు మం జూరు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు పంపా యి. మరోవైపు కనెక్షన్లన్నిటికీ మీటర్లు తప్పనిసరి చేయడంతో పాటు గృహ, వ్యవసాయ కనెక్షన్లను విడిదీసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అందువల్ల ఈ ప్రక్రియ పూర్తయితే కానీ మంజూరు చేసే 50 వేల కనెక్షన్లు సైతం రైతులకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.
వినియోగం తగ్గాకేనా..?
రాష్ట్రంలో మొత్తం 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు అధికారికంగా పనిచేస్తున్నాయి. అయితే రోజుకు 25 నుంచి 35 మిలియన్ యూనిట్ల విద్యు త్ వినియోగమవుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశం.
8 వేల మందికి సోలార్ పంపుసెట్లు
మరోవైపు నిరంతర విద్యుత్ పథకం ఒప్పందాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 8 వేల సోలార్ పంపుసెట్లను మంజూరు చేసింది. వీటి పంపిణీకి కసరత్తు జరుగుతోంది.