అదనపు లోడ్‌ పేరుతో ఛార్జీల వాత | New type current shock | Sakshi
Sakshi News home page

అదనపు లోడ్‌ పేరుతో ఛార్జీల వాత

Published Tue, Apr 17 2018 9:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన వేణుగోపాల్‌ తన ఇంటికి 2002లో విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు. అప్పుడున్న ఉపకరణాల ప్రకారం ఆయన ఇంటికి ఒక కిలోవాట్‌ విద్యుత్‌ లోడు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. కూలర్లు, ఫ్రిజ్, మోటార్‌.. ఇలా క్రమంగా అనేక ఉపకరణాలు ఇంట్లో చేరాయి. దీంతో కరెంట్‌ బిల్లు అనేక రెట్లు పెరిగింది. అయితే, ఇప్పుడు విద్యుత్‌ అధికారులొచ్చి.. నీ వాడకం లోడ్‌ మూడు కిలో వాట్లు దాటిందంటున్నారు. నెల రోజుల్లో రూ.1800 అపరాధ రుసుం కట్టాలని చెప్పారు. లేకుంటే రూ.10 వేలకు పైగా ఫైన్‌ తప్పదని హెచ్చరించారు.
     
తిరుపతి పట్టణం తిరుచానూరులోని సంజయ్‌ ఇంటికి  2001లో విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. అప్పట్లో నెలకు రూ.50 వచ్చే కరెంట్‌ బిల్లు ఇప్పుడు రూ.700 వరకూ వస్తోంది. లోడ్‌ నాలుగు రెట్లు పెరిగిందని అధికారులు అంటున్నారు. కిలోవాట్‌కు రూ.600 చొప్పున.. 4 రెట్లు జరిమానా కట్టాలని తెలిపారు. లేదంటే నెల తర్వాత  ఫైన్‌ తప్పదని హెచ్చరించారట.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement