కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల సీనియారిటీ ఆధారంగా సర్వీసులు విడుదల చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టరు రిజ్వీ అన్నారు. మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్‌లో కర్నూలు జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు, రైతులకు కనెక్షన్లు మంజూరులో నిర్లక్ష్యం వీడాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లతోపాటు సబ్‌సేషన్ల పర్యవేక్షణ, నిర్వాహణ ఎంతో ముఖ్యమన్నారు. బిల్లుల వసూలులో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతినెల వంద శాతం వసూలు చేయాలన్నారు.
పాత బకాయిలను వసూలు చేయడంలో లక్ష్యాన్ని చేరాలని సూచించారు. కొత్తగా నిర్మించే సబ్‌స్టేషన్ల పనులు నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని, దీంతో లో ఓల్టేజీ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సీజీఎం నరసింహులు, ఎస్‌ఈ (ఆపరేషన్స్) టి. బసయ్య, కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ ఆపరేషన్స్ డీఈలు ఉమాపతి, తిరుపతిరావు, నరేంద్రకుమార్, ప్రభాకర్, టెక్నికల్ డిఈ నాగప్ప, కన్‌స్ట్రక్షన్ డీఈ చెంచన్న, ఎంఅండ్‌పీ డీఈ నారాయణ నాయక్, ఎస్‌ఏఓ సుబ్రహ్మణ్యం, కమర్షియల్, ఎంఅండ్‌పీ, స్టోర్స్ సెక్షన్ల ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు.
సీనియారిటీ ప్రకారమే వ్యవసాయ కనెక్షన్లు
Published Wed, Dec 18 2013 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement