
కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచిన హేమ
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి, ఎంపీ హేమ మాలిని కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచారు. తన పాత ట్విట్టర్ ఖాతాను సినిమా, నృత్య కార్యక్రమాల వివరాలు అందించడానికి పరిమితం చేసుకోవాలని నిర్ణయించారు. 'హేమమలిని ఎంపీ ఎంటీఆర్' పేరుతో కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచినట్టు ఆమె వెల్లడించారు. తన నియోజకవర్గం మథురలో తన చేపట్టే కార్యకలాపాల వివరాలు దీని ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటానని చెప్పారు. మథురలో తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు ఇందులో పెట్టారు.
జూన్ లో మథురలో హింసాత్మక ఘటనలు జరిగిన సమయంలో ట్విట్టర్ పేజీలో తన సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటో పోస్టు చేసి ఆమె విమర్శలపాలయ్యారు. సొంత నియోజకవర్గం హింసాత్మక ఘటనలతో అట్టుడిపోతుంటే ఏమీ పట్టనట్టు ఉంటారా అంటూ నెటిజన్లు ఆమెను దుమ్మెత్తి పోశారు.