న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నటి హేమమాలిని..ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ బరిలో నిలిచారు. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి సుమారు రూ. 123 కోట్లుగా తెలిపారు. అయితే రూ. 1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. నటనను తన వృత్తిగా తెలిపిన హేమమాలిని.. అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా తెలిపారు. అలాగే తన భర్త, నటుడు ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. నటన, పెన్షన్, వడ్డీలు ఆయన ఆదాయవనులుగా తెలిపారు.
అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, అల్‌కాజార్, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ. 43 లక్షల నగదు ఉన్నాయి. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని బీజేపీ తరపున మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు.
చదవండి: అవును! నేను అన్నది నిజమే..బోస్‌పై కంగన మరో ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment