మరో పదేళ్లు హేమామాలినీనే ఎంపీ? | Hema Malini to Meet Premanand Maharaj | Sakshi
Sakshi News home page

Hema Malini: మరో పదేళ్లు హేమామాలినీనే ఎంపీ?

Published Sun, Apr 7 2024 2:20 PM | Last Updated on Sun, Apr 7 2024 3:28 PM

Hema Malini to Meet Premanand Maharaj - Sakshi

యూపీలోని మధుర ఎంపీ హేమామాలిని విజయానికి ఇక ఢోకాలేదట! ఓ స్వామీజీ ఆమెను ఆశీర్వదిస్తూ, రోబోయే పదేళ్లూ విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంటారని చెప్పారట. 

ప్రస్తుతం హేమామాలిని మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె ఆచార్య ప్రేమానంద్ మహరాజ్‌ను కలిసేందుకు మధురలోని ఆయన ఆశ్రమానికి  వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ప్రేమానంద్‌ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. 

ఈ సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ హేమామాలినీని ఆశీర్వదిస్తూ ‘మీరు సాధువులకు దగ్గరగా ఉండటమే కాకుండా, భగవంతుని పాదాలను ఆశ్రయించారు. మీరు ప్రాపంచిక విజయాలనే కాకుండా, అతీంద్రియ విజయాలను కూడా అందుకుంటారు. శ్రీ కృష్ణునిపై మీకు కలిగిన ప్రేమ ఒక అతీంద్రియ విజయం . ఏది ఏమైనప్పటికీ మీరు మరో పదేళ్లు ఇలా విజయాలు సాధిస్తూనే ఉంటారు’ అని ఆశీర్వదించారు. హేమామాలిని ప్రేమానంద్‌ ఆశ్రమంలో 20 నిముషాల పాటు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement