పాలమూరు: మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడ్ని నేను.. నా చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయ్. నేనే పరమాత్ముడ్ని.. అవతారపురుషుడ్ని.. రండి.. నా చెంతకు రండి.. నేనే దేవుడ్ని.. అంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి హల్ చల్ చేయగా.. ఆ పిలుపు అందుకుని భక్తులు కుప్పులు కుప్పలుగా క్యూ కట్టేశారు మరి. దీంతో అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి.. తాను దేవుడ్ని అంటూ.. రోగమేదైనా ఇట్టే నయం చేస్తానంటూ పాలమూరులో సెటిల్ అయ్యాడు. కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్ దగ్గర కొలువుదీరాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి.. శేషతల్పంపై నిద్రిస్తూ ఇద్దరు లక్ష్ములు(భార్యలు)ను చూపి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నాడు.
భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా.. దీంతో స్వామీజీని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. చివరకు.. పోలీసులు ఆ దొంగ బాబా గుట్టు రట్టు చేశారు. ఈ దొంగ బాబాకు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చామని స్థానిక ప్రజలకు వివరించారు.
ఇదీ చదవండి: ఆశ్రమంలో కీచక పర్వం.. దిశ పోలీసుల ఎంట్రీతో..
Comments
Please login to add a commentAdd a comment