vishnu murthy
-
పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్
పాలమూరు: మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడ్ని నేను.. నా చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయ్. నేనే పరమాత్ముడ్ని.. అవతారపురుషుడ్ని.. రండి.. నా చెంతకు రండి.. నేనే దేవుడ్ని.. అంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి హల్ చల్ చేయగా.. ఆ పిలుపు అందుకుని భక్తులు కుప్పులు కుప్పలుగా క్యూ కట్టేశారు మరి. దీంతో అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి.. తాను దేవుడ్ని అంటూ.. రోగమేదైనా ఇట్టే నయం చేస్తానంటూ పాలమూరులో సెటిల్ అయ్యాడు. కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్ దగ్గర కొలువుదీరాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి.. శేషతల్పంపై నిద్రిస్తూ ఇద్దరు లక్ష్ములు(భార్యలు)ను చూపి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నాడు. భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా.. దీంతో స్వామీజీని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. చివరకు.. పోలీసులు ఆ దొంగ బాబా గుట్టు రట్టు చేశారు. ఈ దొంగ బాబాకు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చామని స్థానిక ప్రజలకు వివరించారు. ఇదీ చదవండి: ఆశ్రమంలో కీచక పర్వం.. దిశ పోలీసుల ఎంట్రీతో.. -
వేదాంతదేశికులు జీవితానికి అక్షర చిత్రాలు
దార్శనికులు, తాత్త్వికులు, సంస్కృత, తమిళ, ప్రాకృత భాషలలో లెక్కకు మిక్కిలిగా వేదాంత గ్రంథాలను రచించిన ఉద్దండ పండితులు వేదాంతదేశికులు, శ్రీమద్రామానుజుల తరువాత విశిష్టాద్వైత ప్రవర్తకులలో అంతటివారుగా ప్రసిద్ధి పొందిన మహనీయులు దేశికులు. విష్ణుమూర్తి నందక ఖడ్గం ఏ విధంగా అయితే అన్నమయ్యగా అవతరించిందో, వేంకటేశ్వరస్వామివారి ఘంట వేంకట నాథులుగా ఉద్భవించినట్లు కథనాలున్నాయి. శ్రీరంగం దేవాలయం విదేశీయుల దురాక్రమణకు గురై, అక్కడి ఉత్సవమూర్తి కొంతకాలం తిరుమలలో ప్రవాసం చేసిన విషయం తెలిసిందే. తరువాతి కాలంలో ఆ మూర్తిని శ్రీరంగంలో పునఃప్రతిష్ఠించడంలో దేశికులదే ప్రముఖపాత్ర. విద్యార్థి దశలోనే శ్రీ భాష్య ప్రసంగాలను ముప్పైమార్లు చేసిన ఘనత దేశికులది. వాల్మీకి కృత రామాయణంలోని హనుమ సందేÔè ం, కాళిదాసు‘మేఘసందేశం’ వంటి సందేశకావ్య పరంపరలో పరమోత్కృష్ట కావ్యం దేశికుల హంససందేశం. ఈ కావ్యం నుంచి ప్రేరణ పొందడం వల్లే తాను ఆయన జీవిత చరిత్రను రచించినట్లు చెప్పారు. ఇందులో దేశికుల జీవితంలోని ప్రధాన ఘట్టాలతోబాటు, ఆయన వ్యక్తిత్వం, విశిష్టాద్వైతంలోనూ, శ్రీవైష్ణవమతంలోనూ దేశికులపాత్ర, ఆయన రచించిన వేదాంత గ్రంథాల వివరాలను చూడవచ్చు. దేశికులు కేవలం గ్రంథరచయిత కాదు. ఆయన చూపిన దివ్యశక్తులు ఎన్నో కథలుగాచెప్పుకొంటారు. అందమైన ముఖచిత్రం, ఆర్టుపేపరు మీద అంతకన్నా అందమైన వర్ణఛాయాచిత్రాలు అనేకం, చిత్రాలలో జీవితచరిత్ర అదనపు ఆకర్షణ. -
ఆరోగ్య ధన్’వంతరి
ఆయుర్వేదంలో ఎవరైనా మంచి హస్తవాసి గల వైద్యులుంటే వారిని ధన్వంతరితో పోలుస్తారు. ఆయుర్వేదమనే కాదు, వైద్యులందరూ కూడా ధన్వంతరికి వారసులేననడంలో తప్పులేదు. ఎందుకంటే మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరే కాబట్టి. ఆయన దేవ వైద్యుడు. ప్రస్తుతం దీపావళికి రెండురోజుల ముందు మనం జరుపుకుంటున్న ధన్తేరస్ పండుగలో ధన్ అనేదానికి ధనమనే చెప్పుకుంటున్నాం కానీ, «నిజానికి అది ధన్వంతరికి సంబంధించినదే. ధన్వంతరిని సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశగా చెప్పుకుంటారు. దేశవ్యాప్తంగా ధన్వంతరికి ఆలయాలున్నాయి. ధన్వంతరి పేరుతో అనేక వైద్య, సేవాసంస్థలు కూడా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లేముందు అసలు ధన్వంతరి ఎవరో తెలుసుకుందాం.. దేవతలూ, రాక్షసులూ కలసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం ఉద్భవించింది. లోకాలను దహించివేసే ఆ హాలాహలాన్ని ఉండగా చేసుకుని, పరమేశ్వరుడు దానిని భక్షించి, గరళకంఠుడయ్యాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు ఆవిర్భవించారు. తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత అరచేత అమృతకలశాన్ని పట్టుకుని, విష్ణుమూర్తి అంశతో ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి. అప్పటినుంచి దేవవైద్యుడు ఆయనే. ఆయుర్వేదానికి, సమస్త ఔషధాలకు మూలపురుషుడు ఆయనే. లక్ష్మీదేవి, ధన్వంతరి ఒక్కరోజే ఉద్భవించినప్పటికీ, ధన్వంతరి విషయం ఎవరూ అంతగా పట్టించుకోరు. ఎందుకంటే, ఆరోగ్యం కన్నా, అందరికీ ధనమే ముఖ్యం అయిపోయింది కదా మరి! అందుకే ధన్తేరస్ నాడు కేవలం లక్ష్మీపూజ... అదీ కాదు... విలువైన వస్త్రాభరణాలు, ఖరీదైన వస్తుసామగ్రుల కొనుగోలులో మునిగి తేలుతుంటారు. లక్ష్మీపూజ చేయడంలో, వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేయడంలో తప్పు లేదు కానీ, ఆరోగ్యం కూడా సంపదే! అందుకే కదా, అష్టలక్ష్ములలో ఆరోగ్యం కూడా లక్ష్మీస్థానం సంపాదించుకుంది. కనీసం ఈ విషయం తెలిస్తే అయినా ఈ పర్వదినాన వైద్యనారాయణుడైన ధన్వంతరిని స్మరించుకుంటారని... – డి.వి.ఆర్. -
జగన్మోహిని కొలువున్న చోటు..?
కౌన్సెలింగ్ విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో కొలువైన ప్రాంతమేది? దాని విశేషాలేంటి? - ప్రసాద్, విజయనగరం విష్ణుమూర్తి జగన్మోహినీ రూపంలో కొలువైన క్షేత్రం ర్యాలి. ఇది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఇక్కడున్న జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో విష్ణుమూర్తి జగన్మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అంటే విగ్రహానికి ముందు వైపు విష్ణుమూర్తి, వెనుక వైపు జగన్మోహిని రూపం భక్తులకు కనిపిస్తుంది. సాలగ్రామ శిలగా ఉన్న ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. ఈ విగ్రహంలోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం మరెక్కడా లేదంటారు. హనుమంతుడిని వెన్నతో అలంకరించే క్షేత్రమేది? అది ఎక్కడ ఉంది? - సి.హెచ్.కుమార్, ఈమెయిల్ హనుమంతుడిని వెన్నతో అలంకరించే క్షేత్రం శుచీంద్రం. ఈ క్షేత్రంలోని స్థానేశ్వర స్వామి ఆలయంలో ఉన్న భారీ హనుమంతుడిని రోజూ వెన్నతో అభిషేకించి, వెన్నతోనే అలంకారం చేస్తారు. ఇలాంటి సంప్రదాయం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. హనుమంతుడు ఇక్కడ భారీ ఆకారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి వారికి వెన్న సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. శుచీంద్రం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి క్షేత్రానికి సుమారు ఇరవై కిలోమీటర్ల ఈవల ఉంది. -
పట్టపగలే రియల్టర్ దారుణ హత్య
ఆ సెంటర్ రద్దీగా ఉంది. అక్కడి ఆలయానికి భక్తులు వచ్చిపోతున్నారు. మిట్టమధ్యాహ్నం 12.45 గంటలు కావస్తోంది. వాహనాలతో రోడ్డు కళకళలాడుతోంది. ఇరువైపులా ఉన్న దుకాణాల్లో వినియోగదారులు కిక్కిరిసి ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి కొబ్బరి బోండాలు నరికే కత్తితో మరో వ్యక్తి వెంటపడుతున్నాడు. ఏం జరుగుతుందో అర్థంకాక అందరి కళ్లూ వారిద్దరిపై పడ్డాయి. క్షణాల్లో కత్తి ఉన్న వ్యక్తి చేతిలో పరిగెడుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురై రక్తపు మండుగులో పడి ఉన్నాడు. ఒంగోలు క్రైం : నగరంలో సోమవారం మిట్టమధ్యాహ్నం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎప్పుడూ ర ద్దీగా ఉండే లాయర్‌పేటలోని సాయిబాబా గుడి సమీపంలో రైతు బజారుకు ఎదురుగా టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం పక్కనే జరిగిన ఈ హత్యను అనేక మంది కళ్లారా చూశారు. స్థానిక వీఐపీ రోడ్డులోని లక్ష్మీనరసింహ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న యద్దనపూడి భ్రమరాచారి (39)ని ప్రత్యర్థి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తితో వెంటాడి మరీ దాడి చేయగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కత్తితో రెండు మూడు వేట్లు బలంగా వేయడం తో తల నుజ్జునుజ్జయింది. రక్తపు మడుగులో అందరూ చూస్తుం డగానే గిలగిలా కొట్టుకుని భ్రమరాచారి ప్రాణాలు విడిచాడు. వ్యాపార భాగస్వామితో కలతలు ఒంగోలు గాంధీనగర్‌కు చెందిన మేడిపి విష్ణుమూర్తితో కలిసి భ్రమరాచారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మనస్పర్థలు వచ్చాయి. దాదాపు రూ.4 లక్షలు విష్ణుమూర్తికి ఇవ్వాల్సి వచ్చింది. డబ్బులివ్వకుంటే అంతు చూస్తానని హెచ్చరించడంతో భ్రమరాచారికి ప్రాణభయం పట్టుకుంది. విష్ణుమూర్తి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు భ్రమరాచారి ఇది వరకే ఫిర్యాదు చేసి ఉండటం గమనార్హం. భార్యతోనూ సఖ్యత కరువు రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థికంగా దెబ్బతినడంతో కొన్ని నెలలుగా భ్రమరాచారి దంపతుల మధ్య గొడవలు పొడచూపాయి. తరచూ భార్యతో ఘర్షణ పడటంతో భార్య బ్రహ్మేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తల మధ్య కనీసం మాటమంతీ కూడా లేదు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇదీ.. హతుని నేపథ్యం హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొనకనమిట్ల మండలం మూగచింతలకు చెందిన భ్రమరాచారి కుటుంబం తొలుత పొదిలిలో స్థిరపడింది. ఈయన 20 ఏళ్ల క్రితమే ఒంగోలు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. గతంలో నక్షత్ర రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్‌గా పనిచేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. నక్షత్ర కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి డెరైక్టర్లను అరెస్టు చేయడంతో పాటు కంపెనీకి సంబంధించిన లావాదేవీలను స్తంభింపజేశారు. దీంతో ప్రైవేటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగైదేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్ప కూలిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మాటామాటా పెరిగి.. భ్రమరాచారి తన బైకుపై రైతు బజారు ఎదురుగా ఉన్న టీకొట్టు వద్దకు వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాదన పెరిగింది. తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. తోపులాట కూడా జరిగింది. భ్రమరాచారితో ఘర్షణ పడిన వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ పక్కనే చెట్టు కింద కొబ్బరి బోండాల దుకాణంలో ఉన్న కత్తి తీసుకుని భ్రమరాచారి వెంట పడ్డాడు. సరిగ్గా ప్రకాశం పంతులు విగ్రహం వద్ద కత్తితో బలంగా తలపై బాదాడు. ఒక్క దెబ్బకు కింద పడిపోయిన భ్రమరాచారి తలపై రెండు మూడు సార్లు కత్తితో దాడి చేశాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. హంతకుడు క్షణాల్లో పరారయ్యాడు. అందరూ చూస్తుండగానే.. కళ్లెదుటే హత్య జరగడంతో దుకాణాలు మూసి వ్యాపారులు ఇళ్లకు వెళ్లిపోయారు. జనం ఎందుకొచ్చిన గొడవనుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. అందరూ చూస్తుండగానే దారు ణం జరుగుతున్నా ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఒన్‌టౌన్ సీఐ కె.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా ఎవరూ సహకరించలేదు. కొబ్బరి బోండాల దుకాణ యజమాని వెంకట్రావు కూడా భీతిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంకట్రావును సీఐ పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంత వీఆర్వో రామును సంఘటన స్థలానికి పిలిపించుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
నివృత్తం: పూజామందిరంలో కలశాన్ని ఎందుకు స్థాపిస్తారు?
ఇలా చేయమని శాస్త్రాలే చెబుతున్నాయి. కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠభాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో మాతృగణాలు ఉంటారట. కలశంలోని జలాల్లో సాగరాలు, సప్తద్వీపాలతో కూడిన భూమి, వేద వేదాంగాలు, సమస్త దేవతలూ ఆశ్రయించి ఉంటారట. సమస్త పాపాలనూ తొలగించి దీవించేందుకు వారంతా దిగి రావాలని కోరుతూ కలశాన్ని స్థాపించాలని చెబుతారు. అది మాత్రమే కాక... మానవ జీవితాన్ని నిండు కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక అన్నమాట. అందువల్ల శుభ సందర్భాల్లో కలశ పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెబుతారు. (సన్నని మూతి కలిగి, నీటితో నింపిన పాత్రను కలశం అంటారు). లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు... నదుల మధ్యలో ఉండే భూమిని లంక అంటారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి లంకలు చాలానే ఉన్నాయి. ఆ జిల్లాల్లోని గ్రామస్తులు చాలామందికి పశువులు ఉంటాయి. వాటిని పాలేళ్లు గోదారి గట్టున మేపుతుంటారు. ఒక్కోసారి మేత సరిపోక... లంకల్లో ఉండే గడ్డి తినడానికి అక్కడికి తోలుకు పోతుంటారు. పశువులు కడుపుల నిండా మేత మేశాక తిరిగి ఒడ్డుకు తీసుకు వస్తారు. అయితే అవి తిన్నదంతా ఒడ్డుకు ఈదుకొచ్చేలోపు అరిగిపోతుంది. దాంతో వాటికి మళ్లీ ఆకలేస్తుంది. ఈ పరిస్థితిలోంచి పుట్టిందే ఈ సామెత. కొందరు చిన్న ప్రతిఫలం కోసం చాలా ఎక్కువ కష్టపడిపోతుంటారు. తీరా అంత చేశాక వీరికి మిగిలేదేమీ ఉండదు. అలాంటప్పుడు ‘లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు’ అయ్యింది వీడి పని అంటూ పరిహాసమాడుతుంటారు! -
‘రక్త’సంబంధం
మంచిర్యాల అర్బన్ : రక్తం.. కృత్రిమంగా తయారు చేయలేనిది. అలాగని ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర సమయాల్లో అందకపోతే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆపద సమయంలో ఒక్కరు రక్తం చేస్తే చాలు ప్రాణాన్ని కాపాడవచ్చు. ఓ కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. అందుకే మేమున్నామంటూ రక్తదాతలు ముందుకొస్తున్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇలా ఒకటి రెండుసార్లు కాదు 10.. 16.. 47సార్లు రక్తదానం చేసిన వారూ ఉన్నారు. ఆపదలో ఉన్నవారితో వారికెలాంటి సంబంధం లేకున్నా ‘రక్త’సంబంధం దాతలను ముందుకు నడిపిస్తోంది. జాతీయ నాయకుల జయంతి, ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో స్వ చ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పా టు చేస్తున్నాయి. ఈ నెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. రక్తదానంపై అపోహలు వద్దు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదానంపై చైతన్యం చేస్తున్నా కొంతమందిలో అపోహలు ఉన్నాయి. అవగాహన రాహిత్యంతో రక్తదానానికి సాహసించడం లేదు. రక్తదానం చేస్తే మనిషి బలహీన పడుతారనేది అపోహ మాత్ర మే. రక్తదానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. మానవుని శరీరం లో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్య క్తి నుంచి 350 మి ల్లీలీటర్ల రక్తం సేకరిస్తారు. ప్రతీ మూడు నెలలకోసారి రక్తదానం చేసినా ఎలాంటి నష్టం ఉండదు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న వారంతా నిర్భయంగా రక్తదానం చేయొచ్చు. జిల్లాలో.. జిల్లాలో మంచిర్యాల, నిర్మల్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, చెన్నూర్‌లో రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర ప్రమాదాల సమయాల్లో అవసరమైన వారికి రక్తం అందిస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. రక్తనిధి కేంద్రం లేక, రక్తం సకాలంలో అందక ఎంతోమంది రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, గర్భిణులు మరణించారు. 2008లో రక్తనిధి కేంద్రం ప్రారంభించారు. తూర్పు ప్రాంత వాసులకు అపర సంజీవనిలా మారింది. రక్తం నిల్వ ఉంచే సౌలభ్య ఉండడంతో ఏటా రక్తం నిల్వలు పెరుగుతున్నాయి. తలసేమియా వ్యాధిగ్రస్తులకు వరం తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకోసారి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం మంచిర్యాల బ్లడ్‌బ్యాంకులోనే మార్పిడి చేస్తున్నారు. అవసరమైన గ్రూపు రక్తం అందుబాటులో ఉంచుతున్నారు. 2012లో 152, 2013లో 1,036, 2014లో 1,800 యూనిట్ల రక్తాన్ని అందించారు. రక్తం విడదీసే సౌకర్యం రక్తాన్ని విడదీసి ఎక్కించే సౌకర్యం జిల్లాలోని అన్ని బ్లడ్‌బ్యాంకుల్లో ఉంది. ఒక వ్యక్తి రక్తాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఏ వ్యక్తికి ఏ కణం రక్తం అవసరమో ఆ కణాలనే ఎక్కించే సౌలభ్యం ఉంది. డెంగీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ప్లేట్లేట్స్ ఎక్కిస్తే మిగితా రక్తం మరో వ్యక్తిని అవసరం ఉన్నట్లుగా వినియోగించుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది.. రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచింది. అనార్యోగానికి గురవుతామనే అపోహలు వీడాలి. ఎన్నిసార్లు రక్తదానం చేసినా ఆరోగ్యానికి ఎలాంటి చింత ఉండదు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలి. బ్లడ్‌బ్యాంకులో ఎంత రక్తమైనా నిల్వ చేసుకునే సౌలభ్య ఉంది. యువకులు రక్తదానం చేయడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలి. - డాక్టర్ విష్ణుమూర్తి, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు, మంచిర్యాల 47సార్లు రక్తదానం ఆపదలో ఉన్నవారికి 47సార్లు రక్తదానం చేశాను. ఇప్పటివరకు 1,275 యూనిట్ల రక్తం అందించాను. రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆనందంగా ఉంది. మా తండ్రి మల్యాల రాజయ్య పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి రక్తదాతలను ప్రోత్సహిస్తున్న. నా స్నేహితులు వంద మంది రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రక్తసం అవసరమైన వారు 9700070894, 9908927515 నంబర్లలో సంప్రదించాలి. - మల్యాల శ్రీపతి, మంచిర్యాల తాండూర్ : 1998లో రక్తదానం చేయడం ప్రారంభించి క్రమం తప్పకుండా చేస్తున్న. ఇప్పటివరకు 58సార్లు రక్తదానం చేశాను. అభినవ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఎంతోమందిని సభ్యులుగా చేర్పించి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న. వారితో కూడా రక్తదానం చేయిస్తున్న. అన్ని దానాలకన్న రక్తదానం ఎంతో గొప్పది. రక్తదానం చేస్తేనే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం ఉన్న వ్యక్తే ఎన్ని దానాలైనా చేయగలడు. ఇప్పటివరకు రెండు రాష్ట్ర స్థాయి, ఐదు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న. గ్రామస్తాయిలో కూడా రక్తదానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అందరినీ రక్తదాతలుగా మార్చాలన్నదే నా ధ్యేయం. - కె.సంతోష్‌కుమార్, అభినవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, తాండూర్ -
నివృత్తం: మొండిచేతి వాడికి నువ్వులు తినడం నేర్పినట్టు...
ఒక ఆసామి నువ్వుల్ని పండించాడు. మామూలు వాళ్లయితే నువ్వులు తినేస్తారేమోనని భయమేసి, వెతికి వెతికి ఓ మొండి చేతుల వాడిని తీసుకొచ్చి పొలంలో పనికి పెట్టుకున్నాడు. అయినా కూడా వాడి మీద అనుమానంగానే ఉండేది. ఎప్పటికప్పుడు వాడిని పరిశీలిస్తూ ఉండేవాడు. అంతలో పనిమీద పక్కూరికి వెళ్లిన ఆసామి, రెండు రోజుల వరకూ రాలేకపోయాడు. తాను లేనప్పుడు పనివాడు నువ్వులు తినేశాడేమోనన్న అనుమానంతో, వచ్చీ రాగానే ‘ఏరా... నువ్వులు తిన్నావా’ అని అడిగాడు. ‘చేతుల్లేనివాడిని, నేనెలా తినగలను సామీ’ అన్నాడు వాడు. వెంటనే ఇతగాడు... ‘ఏముంది, మొండి చేతులకు నూనె రాసుకుని, వాటికి నువ్వుల్ని అద్దుకుని తినొచ్చు కదా’ అన్నాడు. ఇదేదో బాగుందే అనుకున్న పనివాడు అప్పట్నుంచీ నిజంగానే నువ్వులు తినడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. మంచివాడికి లేనిపోని ఆలోచనలు కల్పించి, తప్పుదారి పట్టించినప్పుడు ఈ సామెత వాడతారు. అవసాన దశలో తులసి తీర్థం ఎందుకు పోస్తారు? తులసి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే తులసిని ఎంతో పవిత్రంగా చూస్తారు. చావు బతుకుల్లో ఉన్న మనిషికి నోటిలో తులసి తీర్థం పోస్తారు. మరణానికి చేరువైన మనిషికి తులసి తీర్థాన్ని తాగిస్తే... అది శరీరాన్ని చల్లబర్చి వేడిని రగిలిస్తుందని, రుగ్మతలను తగ్గిస్తుందని, తద్వారా ఆ మనిషి మరికొంత కాలం బతుకుతాడేమోనన్న ఉద్దేశంతోనే అలా చేస్తారు.