
సాక్షి, మేడ్చల్ : తాము దైవాంశ సంభూతులమని చెప్పుకుంటూ మోసాలకు, లైంగిక దాడులకు పాల్పడుతున్న దొంగ బాబాల బండారం బయటపడుతున్నా ప్రజలు కళ్లు తెరవడం లేదు. దీంతో దొంగ బాబాల దురాగతాలకు అంతం లేకుండా పోతోంది. తాజాగా మేడ్చల్‌లో దొంగ బాబా వ్యవహారం బయటపడింది.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదుమకుంట గ్రామంలో ఓమోజయ బాబా తన ఆశ్రమంలోకి దూర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి డ్రగ్స్ బానిసలుగా చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. యువతుల తల్లిదండ్రులు, హిందూ వాహినీ కార్యకార్తలు ఆందోళనకు దిగడంతో అసలు విషయం బయటపడింది.
మానసిక ప్రశాంత పేరుతో యువతులను అక్రమంగా నిర్భందించి డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారని హిందూ వాహినీ కార్యకర్తలు ఆరోపించారు. గతంలో ఎన్నిసార్లు పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నకిలీ బాబాల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆశ్రమం ముందు ధర్నాకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment