![Fake Baba Cheated Vijayawada Woman - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/18/Fake-Baba-Cheated-Vijayawad.jpg.webp?itok=am4LbNf2)
సాక్షి, కృష్ణాజిల్లా: నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది.
విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. 35 లక్షలతో కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో మౌలాల అనే దొంగ బాబాను రజనీకి ఓ భక్తురాలు పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలంటూ మౌలాల సూచించాడు. రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు పాతి పెట్టిన మౌలాల.. నమ్మకం కుదిరేందుకు 100 గంజాలు అమ్ముడుపోయేలా చేశాడు.
స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడం మొదలుపెట్టాడు. మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ.. ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది.
చదవండి: నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment