కరీంనగర్‌లో నకిలీ బాబా అరెస్ట్‌ | fake baba arrested in karim nagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో నకిలీ బాబా అరెస్ట్‌

Published Thu, Aug 31 2017 1:06 PM | Last Updated on Tue, Sep 12 2017 1:29 AM

fake baba arrested in karim nagar

కరీంనగర్: పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాస్తు పేరుతో ప్రత్యేక పూజలు చేయించి డబ్బులు దండుకుంటున్న నకిలీ బాబాను కరీంనగర్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటస్వామి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బాబా అవతారమెత్తి అమాయక ప్రజలను దోచుకుంటున్నాడు. వ్యవసాయ భూములను పరిశీలించి అందులో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ప్రత్యేక పూజల పేరుతో లక్షల్లో డబ్బు దండుకొని చివరకు తన తీసుకొచ్చిన ఇత్తడి విగ్రహాలను భూ యజమానికి తెలియకుండా ఏదో ఓ ప్రాంతంలో పాతి పెట్టి అక్కడ తవ్వకాలు జరిపిస్తున్నాడు.
 
అనంతరం వీటిని ప్రత్యేక మూలికలతో శుద్ధి చేయాలి.. దానికి చాలా ఖర్చు అవుతుందని నమ్మిచి వారి వద్ద నుంచి దండిగా డబ్బు లాగి మోసం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఈ రోజు నకిలీ బాబాను అరెస్ట్‌ చేశారు.  అతని వద్ద నుంచి ఇత్తడి ప్రతిమలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement