దొంగ స్వాముల కలకలం.. దైవశక్తులు ఉన్న ప్రతిమలంటూ.. | Fake Baba Fraud Mystery In Vizianagaram | Sakshi
Sakshi News home page

దొంగ స్వాముల కలకలం.. దైవశక్తులు ఉన్న ప్రతిమలంటూ...

Published Wed, Aug 18 2021 10:42 AM | Last Updated on Wed, Aug 18 2021 1:31 PM

Fake Baba Fraud Mystery In Vizianagaram - Sakshi

విజయంనగరం: విజయనగరంలోని ఎస్‌.కోటమండలంలో దొంగస్వాములు పూజలు చేస్తామని గ్రామస్తుల దగ్గర నగదు వసూళ్లు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, మూషిడిపల్లి గ్రామంలో కొంత మంది దొంగస్వాములు.. దేవుడి పూజలు చేస్తామని స్థానికులను నమ్మించారు. అంతటితో ఆగకుండా.. దైవశక్తులు ఉన్న దేవుడి ప్రతిమలంటూ గ్రామస్తులనుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేశారు.

ఈ క్రమంలో, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితులు.. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు.. దొంగ స్వాములను ఆలయంలో బంధించి దేహశుద్ధి చేశారు. బాధితుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, దొంగ స్వాములను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement