అసహజ శృంగారం : లిప్‌స్టిక్‌ బాబా అరెస్ట్‌ | Lip Stick Baba Arrested in Rajasthan | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 12:22 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Lip Stick Baba Arrested in Rajasthan - Sakshi

లిప్‌ స్టిక్‌ బాబా (ఇన్‌సెట్‌లో మాములు ఫోటో)

జైపూర్‌ : భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ బాబాను రాజస్థాన్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. అసహజ శృంగారం.. ఓ భక్తుడి ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలతో పింక్‌ బాబాపై కేసు నమోదయ్యింది. ఎట్టకేలకు బుధవారం జైపూర్‌లో ఫేక్‌ బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఝలవార్‌కు చెందిన 20 ఏళ్ల యువరాజ్‌ సింగ్‌ కుటుంబం కొన్నేళ్ల నుంచి కుల్దీప్‌ సింగ్‌ ఝాల కు భక్తులుగా ఉంటున్నారు. మహిళ వేషధారణతో కుల్దీప్‌.. ‘లిప్‌ స్టిక్‌ బాబా’గా ఫేమస్‌ అయ్యాడు. ఇక యువరాజ్‌ తరచూ ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఈ క్రమంలో బాబాతో లైంగిక కార్యకలాపాల్లో నెరపాలంటూ బాబా అనుచరులు యువరాజ్‌ను బలవంతం చేసేవారు. ప్రాణ భయంతో యువకుడు అందుకు అంగీకరించాడు. అయితే కొన్నాళ్ల క్రితం యువరాజ్‌కు ఇంట్లో వాళ్లు వివాహం నిశ్చయించారు. అది తెలిసిన లిప్‌స్టిక్‌ బాబా మరింత వేధింపులకు పాల్పడ్డాడు.  

ఈ క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఫిబ్రవరిలో సూసైడ్‌ నోట్‌ రాసి యువరాజ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాని ఆధారంగా తల్లిదండ్రులు.. లిప్‌స్టిక్‌ బాబాపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో లైంగిక వేధింపులు నిజమని తేలటం.. పైగా యువరాజ్‌ వాట్సాప్‌కు కుల్దీప్‌ పంపిన అసభ్య సందేశాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరకు అరెస్ట్‌ చేశారు. మరికొందరు భక్తులపై కూడా కుల్దీప్‌ గతంలో ఇదే తరహా వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement