ప్రతీకాత్మక చిత్రం
ముంబై: తనకు మహిమలు ఉన్నాయని ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడతానని ఓ దొంగ స్వామీ ఒక మహిళను రూ. 32 లక్షలు మోసం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన బాబాన్ బాబూరావు పాటిల్‌ను పోలీసులు గర్తించారు.
వివరాల ప్రకారం.. కాల్వ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని వాటిని తరిమివేసే శక్తి తనకు ఉందని నమ్మించాడు ఓ దొంగ బాబా. అయితే బాబా మోసాన్ని గ్రహించలేని ఆ మహిళ 2019 డిసెంబర్ నుంచి నిందితుడుకి పలు మార్లు డబ్బులు ఇచ్చింది. ఈ రకంగా పాటిల్ ఆమె నుంచి మొత్తం రూ.31.60 లక్షలతో పాటు కొన్ని ఖరీదైన వస్తువులను తీసుకున్నాడు.
అయితే ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తను ఇంట్లో సమస్యలు పరిష్కారం కాకపోయే సరికి ఆ మహిళ దొంగ బాబా అసలు స్వరూపం తెలుసుకుని మోసపోయానని గ్రహించింది. దీంతో సమీప పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి జరిగినదంతా చెప్పి పాటిల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
చదవండి: స్కూల్‌లో ఉన్న విద్యార్థినిని బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి లైంగిక దాడి
Comments
Please login to add a commentAdd a comment