దొంగబాబా అరెస్టు | fake baba arrested in kurnool district | Sakshi
Sakshi News home page

దొంగబాబా అరెస్టు

Published Thu, Aug 27 2015 10:16 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

fake baba arrested in kurnool district

ఎమ్మిగనూరు(కర్నూలు): పూజల పేరుతో ప్రజల్ని మోసగిస్తున్న ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న హసన్ అలీ అలియాస్ తాజుద్దీన్ క్షుద్ర పూజలతో స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. అయితే ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్టు చేసి విచారణ చేశారు.

దీంతో అతడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం దొంగ బాబా పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నాడు. పులివెందులలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement