వాసవి(ఫైల్)
నెల్లూరు సిటీ: భక్తి ముసుగులో మోసానికి పాల్పడిన కిలాడి లేడీ మెతుకు వెంకట నాగవాసవిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నగరంలోని ప్రశాంతినగర్‌లో గురుదత్తాత్రేయ ఆశ్రమాన్ని అడ్డాగా చేసుకొని భక్తుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మహిళ పరారైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఒంగోలు నగరంలోని మిర్యాలపాళేనికి చెందిన మెతుకు వెంకటనాగవాసవికి తొమ్మిదేళ్ల క్రితం సునీల్ అనే వ్యక్తితో వివాహమైంది. విభేదాలతో దంపతులిద్దరూ విడిపోయారు.
అనంతరం ఆంజనేయులును రెండో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయనకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ని ట్రంక్‌రోడ్డులో ఓ ఫర్నిచర్ దు కాణాన్ని నిర్వహిస్తున్న బాషా అలియాస్ మస్తాన్‌తో స్నేహం చేస్తోంది. మహామంత్రయా గం పేరు తో నెల్లూరులోని ప్రశాంతినగర్‌లో కొన్ని వారాలుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భక్తులను ముగ్గులోకి దించుతూ వాసవి రూ. కోట్ల మేర వసూలు చేసింది. ఇలా దాదాపు రూ.నాలుగు కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం.
గుట్టుచప్పుడు కాకుండా నగదు బదిలీ
వాసవి పక్కా స్కెచ్‌తో గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లను కుటుంబసభ్యులకు చేరవేసిందనే ఆరోపణలు ఉన్నా యి. దాదాపు రూ.రెండు కోట్ల నగదుతో కూడిన సంచులను కుటుం బసభ్యులకు అందజేసినట్లు తెలు స్తోంది. ఒంగోలులోని తన స్నేహితుడు బాషా అలియాస్ మస్తాన్, సోదరుడు మెతు కు రాజా, విజయవాడలో మామయ్య అయిన రైల్వే ఉద్యోగి వెంకటసురేష్‌బాబుకు సంచుల నిండా నగదును భారీగా అందజేసినట్లు సమాచారం.
పరారీలో కిలాడి లేడీ
వాసవి ముందస్తు ప్రణాళికలో భాగంగా తన ఆరేళ్ల చిన్నారితో కలిసి పరారైంది. ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వాసవికి సుధాకర్‌బాబాతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రణాళికలో భాగంగా జరిగిందా.. లేక వాసవి నమ్మించి మోసానికి పాల్పడిందా అనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment