ఓ నకిలీ బాబాను ఎల్‌బీ నగర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వై.వి.శాస్త్రి అనే వ్యక్తి సంతానం లేని వారికి పూజలు చేసి సంతానం కలిగిస్తామని, హోమాలు, పూజలతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి లక్షలలో డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఇతనిపై గతంలో వనస్థలిపురం, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి రూ.లక్షా 6 వేల నగదు, 5 సెల్‌ఫోన్‌లు, ,2 టాబ్‌లెట్లు స్వాధీనం చేసుకున్నారు.