
రఘునాథపురంలో చుట్టుకాముడు
రాజాపేట: మండంలోని రఘునాథపురం గ్రామంలో వర్షాలు కురియాలని మంగళవారం మహిళలు చుట్టుకాముడు ఆడారు. వర్షాలులేక నాటిన విత్తనాలు, మొలకలు ఎండిపోతున్నాయని మంచినీళ్ల బిందెల్లో పసుపు, కుంకుమ, వేపకొమ్మలు వేసి శివుడిని ఆరాధిస్తూ బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం రామస్వామిగుట్ట ఉన్న దేవాలయంలో పూజలు చేశారు.