మోసం చేస్తున్న సీఎం
మోసం చేస్తున్న సీఎం
Published Tue, Sep 20 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
రాజాపేట : రైతుల సమస్యలను విస్మరించి మాటల గారడీతో ప్రజలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నారని అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బీ కోటేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఎంఎల్ (న్యూడెమోక్రసీ) సబ్‌డివిజన్ నాయకులు రేగు శ్రీశైలం అధ్యక్షతన ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. భువనగిరి ప్రాంతానికి గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగునీరు అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎంల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, డివిజన్ కార్యదర్శి ఆర్ జనార్దన్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బెజాడి కుమార్, నాయకులు ఆర్ గీత, సీహెచ్ సత్యనారాయణ, రాజయ్య, టీ కొండయ్య, ప్రమీల, ఎన్ శ్రీను, బీ శ్రీను, నరేష్, సిద్ధులు, కనకయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement