దేశ గౌరవాన్ని కాపాడుకోవాలి
దేశ గౌరవాన్ని కాపాడుకోవాలి
Published Fri, Oct 7 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
రాజాపేట : భారతదేశ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షణమధ్య క్షేత్ర (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల ప్రచారక్ ఏలె శ్యామ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రాథమిక శిక్షణా శిబిరంలో భాగంగా శుక్రవారం సార్వజనికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ హిందూ సమాజాన్ని సంఘటితం చే స్తూ శక్తివంతంగా చేసేందుకు గత 91 సంవత్సరాలుగా కృషి చేస్తుందని తెలిపారు. మొదటగా ఒక్కరిగా సంఘం ఏర్పడి నేడు భారత దేశవ్యాప్తంగా 60 వేల గ్రామాలకు విస్తరించిందని తెలిపారు. భారతదేశం ఎంతో శక్తివంతమైన దేశమని, విదేశీ శక్తులు విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. దేశంలో హిందుత్వం ఆధారంగా పరిపాలన జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాజవంశీయులు వజ్రేందర్‌రావు, సంచాలకులు ఎడ్ల నారాయణరెడ్డి, వర్గ అధ్యక్షుడు బల్ల దామోదర్, సర్పంచ్ ఊట్కూరి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఎర్రగోకుల కృష్ణ, గ్రామ ప్రముఖులు మాడిశెట్టి సత్యనారాయణ, పులిగిల్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement