‘మల్లన్న సాగర్‌’పై రాజకీయం తగదు | Mallannasagar is not on the politics | Sakshi
Sakshi News home page

‘మల్లన్న సాగర్‌’పై రాజకీయం తగదు

Published Tue, Jul 26 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

‘మల్లన్న సాగర్‌’పై రాజకీయం తగదు

‘మల్లన్న సాగర్‌’పై రాజకీయం తగదు

రాజాపేట : మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని వరంగల్‌ జిల్లా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ దేవస్థానం వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం దబగుంటపల్లిలోని శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన 22 ఎకరాల్లో 2,150 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీతారెడ్డి, దేవాలయ ధర్మకర్త నర్సింహమూర్తి ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బండారి శ్రీనివాస్, ఏడీఏహెచ్‌ యుగేంధర్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement