చరిత్ర కనుమరుగుచేసే కుట్ర
చరిత్ర కనుమరుగుచేసే కుట్ర
Published Sun, Sep 11 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
రాజాపేట : త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కనుమరుగు చేసే కుట్ర జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటర్‌రెడ్డిలు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 68వ వార్షికోత్సవం సందర్భంగా అమరులైన వారిని స్మరించేదుకు సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్ర ఆదివారం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా రఘునాథపురం, చల్లూరు, బేగంపేట, రేణికుంట, రాజాపేట, కుర్రారం, బొందుగుల గ్రామల్లో పోరాటంలో అమరులైన బద్దం బాల్‌రెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, చింతలాపురి రామిరెడ్డి, పాశం రామిరెడ్డి, కూతూరు పోచయ్య, బొందుగుల నారాయణరెడ్డి, చెడిదీపు నారాయణ, మూల బాలయ్యల స్థూపాలవద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 200లకు పైగా మోటార్ సైకిల్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రతాప్‌రెడ్డి, జిలా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, నాయకులు గోద శ్రీరాములు, మండల కార్యదర్శులు చెక్క వెంకటేశ్, చెడిదీపు రామస్వామి, నాయకులు రాంగోపాల్‌రెడ్డి, కల్లెం కృష్ణ, సోములు, వెంకట్‌రాంరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement