ఆర్థిక ఇబ్బందులతో డ్రైవర్ ఆత్మహత్య
రాజాపేట
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బేగంపేట మదిర గ్రామం నీలోనిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మూల రాజు (34) ఏపీఎస్ ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపోలో బస్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజుకు భార్య సునిత, కుమారుడు భవిచందర్ అన్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురైన రాజు ఉదయం రోజులాగే డ్యూటీకి వెళ్లడం కోసం టిఫిన్ బ్యాగ్‌తో బస్కెక్కాడు. గ్రామం పొలిమేరలో బస్సుదిగి తన వ్యవసాయ బావివద్దకు నడుచుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తెలిసిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మరణించిన రాజును చూసి బోరున విలపించారు. రాజు భార్య సునిత ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.