వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
Published Wed, Jul 20 2016 5:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
రాజాపేట: వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ రామయ్య, ప్రధానోపాధ్యాయులు కే.రవిందర్‌నాయక్‌లు అన్నారు. బుధవారం మండలంలోని బొందుగుల గ్రామంలో రాష్ట్రీయ బాలస్వస్త్(ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 164 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేవారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఐరన్ లోపంతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అశ్వినీ కుమార్, శ్రియ, కార్తికేయ, జయంతి, హెచ్‌ఈఓ కృష్ణమూర్తి, సూపర్‌వైజర్లు వనతాదేవి, అనసూర్య, ఏఎన్‌ఎంలు వనిత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement